ఎందుకు బీరు తాగాలి? తాగిందనుకో ఎందుకు బరువు పెరగాలి? పెరిగిందనుకో.. ఎందుకు అవకాశం పోవాలి. పోయిందనుకో ఎందుకు బాధపడాలి?… అని తనను తాను ప్రశ్నించుకుంటోంది రాధికా ఆప్టే. చూడ్డానికి దక్షిణాది అమ్మాయిలా కనిపించే ఉత్తరాది భామ రాధికా ఆప్టే. తెలుగు, తమిళంలో అడపాదడపా పెద్ద హీరోల సరసన నటించి, ఆ తర్వాత హిందీకి వెళ్లి దక్షిణాది హీరోలను తిట్టిపోసిన భామ రాధిక. టాప్లెస్గానూ ఓ చిత్రంలో నటించింది. ప్రస్తుతం హాలీవుడ్లో రెండు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. రాధికా ఆప్టే మాట్లాడుతూ “విక్కీ డోనర్ చిత్రంలో నన్ను నటించమని అడిగారు. సరేనని సంతకం చేశా. ఆ షూటింగ్ కి ముందు కాసింత గ్యాప్ దొరికింది. బాగా తిని, బీర్లు తాగి సేదదీరా. ఇంకేముంది? తీరా షూటింగ్‌కి ముందు బాగా లావయ్యా. ఇది చిత్ర యూనిట్‌కి నచ్చలేదు. ఆ విషయాన్ని నా ముఖం మీదే చెప్పేశారు. `తగ్గుతాను` అని అన్నా వినిపించుకునే స్థితిలో లేరు. నా బదులు యామీ గౌతమ్‌ని తీసుకున్నారు. అంతా ఓకే. కానీ నేను తగ్గుతానన్నా పట్టించుకోకపోవడం నాకు బాధ కలిగించింది. అతిగా బీర్లు ఎందుకు తాగాలి? ఇలా అవకాశాలు ఎందుకు పోగొట్టుకోవాలని నన్ను నేను తిట్టుకున్నా. అప్పటి నుంచి భోజనం, నీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా“ అని ప్రకటించింది.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!