సినిమా

Rakul: హాట్ డోస్ పెంచేసిన ర‌కుల్‌.. తాజా పిక్స్ చూసి అల్లాడిపోతున్న‌ నెటిజ‌న్స్‌!

Share

Rakul: రకుల్ ప్రీత్ సింగ్.. కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఈమె ఒక‌రు. `గిల్లి` అనే క‌న్న‌డ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించి `కెర‌టం`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ర‌కుల్‌.. త‌న‌దైన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం ఈమె ఫోక‌స్ మొత్తం బాలీవుడ్ వైపు మ‌ల్లించింది. తెలుగులో అవకాశాలు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ అక్క‌డ వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. ఇప్పుడు ఈమె న‌టించిన హిందీ చిత్రం `రన్ వే 34` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీల‌క పాత్ర‌ను పోషించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్‌గా బీటౌన్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే వర‌స‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న రకుల్‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ డోస్ పెంచేసి ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తోంది. తాజాగా కూడా మెరూన్ కలర్ టాప్, స్కర్ట్ ధరించి హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

దీంతో ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాగా.. వాటిని చూసి నెటిజ‌న్లు అల్లాడిపోతున్నారు. మ‌రి లేటెందుకు ర‌కుల్ తాజా పిక్స్‌పై మీరు డీప్‌గా ఓ లుక్కేసేయండి.

కాగా, ర‌కుల్ ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. హిందీలో ఈమె థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రీవాలి, మిషన్ సిండ్రెల్లా అనే చిత్రాలలో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు మూడు చిత్రాలు చేస్తోంది.

 


Share

Related posts

సైరా చేయ‌డానికి కార‌ణమేంటంటే?

Siva Prasad

`మ‌హ‌ర్షి` మ‌రింత లెంగ్తీగా…

Siva Prasad

కార్తీక దీపం సీరియల్ లో అంత అందంగా ఉండే సౌందర్య వయసు మీరు అస్సలు గెస్ చెయ్యలేరు!!

Naina