రాజమౌళి, కొరటాల శివ ప్రాజెక్టులలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. RRR, ఆచార్య ప్రాజెక్టులు చేస్తున్న రామ్ చరణ్..ఈ రెండు త్వరగా కంప్లీట్ చేయడానికి రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా “ఆచార్య” సినిమాకి నిర్మాత కావడంతో.. పాటు సినిమా షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల తరువాత చరణ్ నటించబోయే సినిమా ఏంటి అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. చరణ్ తో చాలా మంది డైరెక్టర్లు చేయటానికి రెడీగా ఉన్నా గాని తాజాగా మాత్రం చరణ్.. మహేష్ బాబుతో గత ఏడాది “సరిలేరు నీకెవరు” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“F3” సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఇప్పటికే చరణ్ కి స్క్రిప్ట్ వినిపించినట్లు, ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే చరణ్ తో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లో టాక్ నడుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!