దివంగత అందాల నటి శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టు 13వ తారీకు నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “హేయ్ శ్రీదేవి నువ్వు స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నావ్… అనుకుంటున్నా. నీ బర్త్ డే సందర్భంగా ఒక పెగ్ వోడ్కా వేస్తున్నప్పుడు నువ్వు ఒక పెగ్ అమృతం తీసుకో.. చీర్స్” అంటూ శ్రీదేవితో దిగిన ఫోటో రాంగోపాల్ వర్మ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆర్జీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివంగత అందాల నటి శ్రీదేవి చిన్న వయసులోనే నాలుగు సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా చలామణి అయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేయడం జరిగింది.
దాదాపు 50 సంవత్సరాలు పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటిగా కొనసాగి అనేక అవార్డులను సొంతం చేస్తుంది. తెలుగులో అయితే రామారావు తరం తో పాటు చిరంజీవి తరం హీరోల అందరితో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి అంటే ఎంత ప్రేమ ఆర్జీవి ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. ఆమె తన దేవతా అని కూడా ఒకానొక టైంలో తెలియజేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం శ్రీదేవి నటించిన సినిమాల లిస్టు చూస్తే క్షణం క్షణం, గోవిందా గోవిందా ఇంకా పలు సినిమాలు.
తెలుగులో చిరంజీవితో “జగదేకవీరుడు అతిలోకసుందరి”తో భారీ బ్లాక్ బస్టర్ శ్రీదేవి అందుకోవడం జరిగింది. ఎప్పుడైతే బోనీ కపూర్ తో పెళ్లి కావడం జరిగింది శ్రీదేవి చాలా వరకు సినిమాలకు దూరమైంది. మళ్లీ 2012వ సంవత్సరంలో “ఇంగ్లీష్ వింగ్లిష్” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీ దేవీ… పలు సినిమాలు చేసి 2018 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో దుబాయిలో బాత్రూంలో పడి తలకి బలమైన గాయం కావడంతో మరణించింది. ఈ క్రమంలో ఆగస్టు 13వ తారీకు ఆమె పుట్టిన రోజు కావటంతో సోషల్ మీడియాలో పలువురు శ్రీదేవిని గుర్తు చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..పోస్ట్ లు పెట్టడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!