న్యూస్ సినిమా

Raviteja: అక్కడ ప్రభాస్, బన్నీ తర్వాత మాస్ మహారాజానే..టార్గెట్ ఫిక్స్ చేశాడు

Share

Raviteja: అక్కడ ప్రభాస్, బన్నీ తర్వాత మాస్ మహారాజానే..టార్గెట్ ఫిక్స్ చేశాడు. అవును ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి సినిమాతో గట్టిగానే రవితేజ టార్గెట్ ఫిక్స్ చేశాడు. ప్రభాస్ బాహుబలి సిరీస్‌తో ఆ తర్వాత సాహో సినిమాతో బాలీవుడ్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. ఎంతగా అంటే ఏకంగా ప్రభాస్ హీరోగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో అక్కడ సినిమాలు నిర్మించడానికి బాలీవుడ్ మేకర్స్ ప్రభాస్ డేట్స్ కోసం క్యూ కట్టేంత. సాహో సినిమాతో బాలీవుడ్‌లో ప్రభాస్ 150 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టారు. అందుకే ఇప్పుడు ప్రభాస్‌తో బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను రూపొందిస్తున్నారు.

raviteja-is entering bollywood with khiladi movie
raviteja-is entering bollywood with khiladi movie

ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ పార్ట్ 1తో బాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ హిందీలో దాదాపు 80 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టాడు. దాంతో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ మార్కెట్‌లో పట్టు సాధించిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇక పుష్ప పార్ట్ 2 కూడా బాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు, అల్లు అర్జున్ – త్రివిక్రం కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో సినిమాను హిందీ వెర్షన్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు వీరి సరసన మాస్ మహారాజ రవితేజ నిలవబోతున్నాడు. ఇకపై ఆయన నటిస్తున్న సినిమాలను హిందీలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.

Raviteja: రవితేజ చేతిలో 6 సినిమాలున్నాయి.

ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఖిలాడి సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పెన్ స్టూడియో వారికి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ప్లేస్ ఉంది. వారి సినిమాలు సౌత్‌లో మాత్రమే కాకుండా నార్త్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ ఖిలాడి సినిమాను హిందీలో రిలీజ్ చేయనున్నారట. అక్కడ గనక ఈ సినిమా కలెక్షన్స్ బాగా రాబడితే ఇక ఆయన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు రవితేజ చేతిలో 6 సినిమాలున్నాయి. అవన్నీ కూడా బాలీవుడ్‌లో డబ్బింగ్ వెర్షన్ విడుదలకు సన్నాహాలు చేస్తారట.


Share

Related posts

America: ఆమెరికాలో ఎన్‌ఆర్ఐలకు కొత్త కష్టాలు..! ఏమిటంటే..?

Srinivas Manem

గుడ్ న్యూస్.. త్వరలోనే కరోనా టీకా తో ఫైజర్ ఎంట్రీ..

Teja

సురేఖ వాణి కూతురు సుప్రిత క్రేజ్ చూస్తే మీ మైండ్ లు బ్లాక్ అవ్వాల్సిందే !

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar