NewsOrbit
దైవం న్యూస్

Marriage : మీ అమ్మాయి  కి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? అయితే  ఆ  ఆవిషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!

Marriage : అల్లుడిని సాక్షాత్ విష్ణు స్వరూపుడు గా భావించి కాళ్ళు కడిగి… అమ్మాయిని లక్ష్మి స్వరూపం గా భావించి బుట్టలో తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తారు.అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు   కన్యను ఇచ్చేసా ..పుచ్చేసుకో  అన్నట్టుగా దానం చేయడు కన్యాదాత. వరుడు దగ్గర నుండి కొన్ని ప్రమాణాలు తీసుకుని మరీ ఇస్తాడు.   ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టి, తన ఇంటి మహారాణి ని  కన్యాదాత  సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు  చేయమంటాడు.

1. నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకుండా ఉండాలి  అని అడిగితే, వరుడు దానికి  ఒప్పుకుని  ధర్మమునందు ఈమెను అతిక్రమించనని
ప్రమాణం చేస్తాడు.
2. అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు సంపాదించిన దానికి , ఇక ముందు సంపాదించ బోయె దానికి ఈవిడ సర్వాది కారిణి అని ఒప్పుకుంటావా? అని అడిగితే దానికి కూడా వరుడు తన అంగీకారం తెలుపుతాడు.
3. నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయి మాత్రం  గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారా మాత్రమే  నీవు సంతానాన్ని పొందాలి. ఆ అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు  అని అనగానే,   వరుడు దానికి  అంగీకారం  తెలియచేసాడు.


ఇప్పుడు   మహాద్భుతమైన కన్యాదానం ఘట్టం మొదలవుతుంది.   విష్ణు స్వరూపం లో  ఉన్న వరుడు ఎదురుపడితే,   ఆయన కు ఆతిధ్యం  అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా!.  అందుకే  ముందు కన్యాదాత, వరుడు వివాహ వేదికకు వచ్చే  లోపుగా ఒక ఆసనం ఏర్పాటు
చెయ్యాలి. అది  కూడా ఒక దర్భాసనం అయి ఉండాలి.  మరి విష్ణుమూర్తి వచ్చి  ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా..   దర్భాసనం మించిన ఉచితాసనం  ఇంకా ఏముంటుంది.    కాబట్టి  కన్యాదాత దానిని తప్పక ఏర్పాటు  చేయాలి.
కాళ్ళు కడిగే సమయం లో    ముందుగా కుడికాలుని పళ్లెం లో పెడితే  తనకు కాబోయే అత్తగారు మరచెంబు తో  సన్నటి ధారగా  నీటిని  అల్లుడి  పాదాల మీద పోస్తుంటే, మామగారు  చాలా జాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలు కడుగుతాడు. అలాగే,  ఆ తరువాత ఎడమ పాదాన్ని పళ్లెం లో ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే శ్రద్దగా కడుగుతారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju