Oscars 2023: ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడం జరిగింది. అంతకుముందే ఇదే క్యాటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటంతో చాలామంది సినీ విశ్లేషకులు ఆస్కార్ గెలుస్తుందని ముందే చెప్పారు. ఆ రీతిగానే “RRR” ఆస్కార్ అవార్డు గెలవడం జరిగింది. దీంతో సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అవార్డును ఎం ఎం కీరవాణి, చంద్ర బోస్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు వారం రోజులకు పైగానే “RRR” సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో అమెరికాలో ఫుల్ బిజీగా గడిపింది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ఎవరికి వారు ఇంటర్వ్యూలు ఇస్తూ రాణించడం జరిగింది.
“RRR” నాటు నాటు సాంగ్ గెలవాలని భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు జరిపారు. చివర ఆఖరికి అవార్డువరించటంతో RRR హిస్టరీ క్రియేట్ చేసినట్లు అయింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఆస్కార్ అవార్డు గెలవలేదు. ఫస్ట్ టైం హాలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా “RRR” ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేశారని విశ్లేషకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గత ఏడాది మార్చి 24వ తారీకు విడుదలైన “RRR”… ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించటం జరిగింది.
ఫస్ట్ టైం ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి నటించిన దక్షిణాది సినిమా రంగంలో RRR అతిపెద్ద మల్టీ స్టారర్ సినిమాగా… రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమా అందుకొని రీతిలో చాలా అంతర్జాతీయ అవార్డులు గెలవడం జరిగింది. కాగా నేడు ప్రపంచ సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం ఆస్కార్ గెలవడంతో “RRR” సినిమా ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది.