RRR: పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్తో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కొత్త చరిత్ర సృష్ఠిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే రూ 500 కోట్ల మార్క్ ను దాటి మరింతగా వసూళ్ళు రాబట్టే రేంజ్లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇద్దరు హీరోలను జక్కన్న చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాలను బీట్ చేశారు రాజమౌళి అని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ సహా పలువురు క్రిటిక్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇండియన్ స్క్రీన్ మీద రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను తీసుకువచ్చి మన సౌత్ సినిమా రేంజ్ ఏంటో మరోసారి చూపించారని టాలీవుడ్ సహా మిగతా సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ, పొగిడేస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ రోజు యూఎస్ అండ్ టాలీవుడ్‌తో తప్ప మిగతా సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్ళు రాబట్టలేదు. దాంతో రాజమౌళి గెస్ తప్పిందనే కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నెగిటివ్ టాక్ బాగా వినిపించింది. అక్కడ భారీగా నిర్వహించిన ప్రమోషన్స్ వృధా అని చెప్పుకున్నారు.
RRR: ఇలాంటి సినిమాలు మరికొన్ని వస్తే మన టాలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీతో సమానం..
కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాజాగా హిందీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద రూ 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు లాంగ్ రన్లో రూ 200 కోట్ల వరకు బాలీవుడ్లోనే వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ అందరి అంచనాలను తారుమారు చేసి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతూ సరికొత్త రికార్డ్స్‌ను రాబడుతోంది. ఇలాంటి సినిమాలు మరి కొన్ని వస్తే మన టాలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీతో సమానంగా నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!