Rashmika Mandanna: రష్మిక.. ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `ఛలో` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇక్కడ మొదటి ప్రయోగంలోనే సక్సెస్ అయిన రష్మిక.. ఆ వెంటనే గీత గోవిందం తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుస సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక.. మరోవైపు తన క్యూట్‌నెస్‌తో నేషనల్ క్రష్‌గానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న రష్మి.. మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న విషయం తెలిసిందే.
మొన్నీ మధ్య తన ఫాలోవర్స్‌కు ఫిట్నెస్ సూత్రాలను కూడా వల్లించిన రష్మిక.. తాజాగా తన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో రష్మిక ప్యాంట్ లేకుండా బుల్లి నిక్కర్, టీ షర్ట్ ధరించి జీరో సైజ్ అందాల కోసం చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, తమిళంలో దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తోంది. అలాగే హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు పూర్తి కాకముందే బాలీవుడ్లో మరో సినిమాకు సైన్ చేసింది.
https://www.instagram.com/tv/Cbpb6thAZSQ/?utm_source=ig_web_copy_link