డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల రిజర్వేషన్ల అంశంపై కాంట్రవర్సి కామెంట్లు చేశారు. రిజర్వేషన్లు కులాన్ని బట్టి ఉండకూడదు పేదవాడు ఏ కులం లో ఉన్న సపోర్ట్ చేయాలి. రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కు తినటమే అన్నట్టుగా పూరి జగన్నాథ్ కామెంట్లు చేశారు. దెబ్బకి పూరి జగన్నాథ్ చేసిన కామెంట్లకు దళిత సంఘాల ఆగ్రహం ఒక్కసారిగా భగ్గుమంది. అసభ్యంగా అమ్మాయిల తొడలను నీచాతి నీచంగా చూపిస్తూ, సినిమాలు తీస్తూ కనీస మర్యాద ఇవ్వకుండా పూరిజగన్నాథ్ వ్యభిచారం చేసే రీతిలో వెండితెరపై తన సినిమాలను చిత్రీకరిస్తాడు అంటూ, డైలాగులు కూడా అలాగే రాస్తాడు ఈ పత్తిత్తు. వీడు చెబితే మేము వినాల అంటూ దళిత నేతలు తెగ రెచ్చిపోయారు.
అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలన్నా పూరి… అదే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు…. సినిమాలు కూడా చూడకూడదని స్టేట్మెంట్ ఇవ్వగలవా అంటూ పూరి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది చాలా మంచి స్టేట్మెంట్. అసలు కులమే లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అంటూ దళిత నేతలు ధ్వజమెత్తారు. అంటే కులాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ పూరి జగన్నాథ్ పై మండిపడుతున్నారు. పుట్టుకతోనే అంటరానివాడు అయిపోతే పర్లేదు తక్కువ వాడు అయిపోతే పర్లేదు. …కానీ పుట్టుకతో కులాన్ని బట్టి వచ్చే గౌరవం నీకు కావాలి అంటూ పూరి పై మండిపడుతున్నారు.
కులం అలాగే ఉండాలి కానీ కులం వల్ల వచ్చే రిజర్వేషన్లు మాత్రం అనగారిన వాడు తీసుకోకూడదు. ఏం మాట్లాడుతున్నావ్ పూరి అంటూ దారుణమైన పద భాషతో దళిత నేతలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బూతు సినిమాలు తీసుకుని నీవు….. మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా మాట్లాడు అంటూ పూరి జగన్నాథ్ ని ఏకిపారేశారు. మొత్తానికి మొట్టమొదటిసారి టచ్ చేయని మేటర్ రిజర్వేషన్ మేటర్ టచ్ చేసి పూరి జగన్నాథ్ చాలా మంది చేత తిట్టించుకోవడం తో నెటిజన్లు పాపం పూరి అని జాలి పడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!