Samantha : అప్పుడు సమంత నే కావాలి ఇంకెవరూ వద్దు అన్నాడు .. ఇప్పుడు సమంత అస్సలు వద్దు అంటున్నాడు

samantha
Share

Samantha : అగ్ర కథానాయిక సమంత ‘‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’’ అంటూ కుర్రకారుని కైపెక్కించింది. వాస్తవానికి సమంత తన 12 ఏళ్ల కెరీర్‌లో ఐటమ్‌ సాంగ్‌లో నర్తించడం ఇదే తొలిసారి. అందుకే ఈ పాటకు విపరీతమైన హైప్ వచ్చింది. అందులోనూ ఈ పాట పాడిన గాయని గాత్రం ఎల్లారీశ్వరి గాత్రంలా మత్తెక్కించేసింది. ఆ కారణంగా కూడా ఈ పాట భారతదేశంతో పాటు ఖండాంతరాలు దాటి మరీ వైరల్ అవుతోంది. అయితే అప్పుడు సమంతనే కావాలని అన్న ఒక అతను ఇప్పుడు సమంత అంటేనే చిరాకుపడిపోతున్నాడట. ఇంతకీ అతనెవరు? చూద్దాం.

Samantha : అప్పుడు సమంత నే కావాలి ఇంకెవరూ వద్దు అన్నాడు

samantha

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన సుకుమార్ కొత్తదనం కావాలనుకున్నారు. పాటలు, డైలాగులు.. ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా సమంతను ఒప్పించాడు. ఎందుకంటే ఆ సమయంలో సమంత లైమ్ లైట్‌లో ఉంది. ఆమెతో ఏం చేసినా అది ఒక సంచలనం అవుతుందని సుకుమార్ భావించారు. అలా ఆమెతో తప్ప మరి ఎవరితోనూ స్పెషల్ సాంగ్ చేయకూడదని అనుకున్నాడు. ఆ పట్టుదలతోనే సుకుమార్ సమంతని కన్విన్స్ చేసాడు. అందులోనూ తనకు హద్దే లేదని చెప్పేందుకు ఆమె కూడా ఐటమ్ సాంగ్ చేసింది.

 

ఇప్పుడు సమంత అస్సలు వద్దు అంటున్నాడు

samantha

అయితే అప్పుడు సమంత తప్ప మరెవరూ వద్దనుకున్న సుకుమార్ ఇప్పుడు సమంత తప్ప ఇంకా ఎవరైనా ఓకే అని అంటున్నాడట. “పుష్ప 2 ది రూల్స్” అనే సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా.. అందులో కూడా సమంత చేస్తే బాగుంటుందని చిత్ర బృందంలోని పలువురు అభిప్రాయ పడుతున్నారట. కానీ ఇప్పుడు బాలీవుడ్ భామల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సుక్కు చూస్తున్నాడట. పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా సరే దక్కించుకోవాలని పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ చేసేందుకు బడా బాలీవుడ్ భామలు సుకుమార్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో సమంత వద్దు.. బాలీవుడ్ స్టార్ యే ముద్దు అని సుక్కు చెబుతున్నారట. ఈ విషయంపై క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.


Share

Related posts

పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

bharani jella

బాలయ్య హీరోయిన్స్ ఇలా మారిపోతున్నారేంటి ..?

GRK

Tollywood: కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న టాలీవుడ్ సెలెబ్రిటీల వివరాలు..!!

sekhar