Siri Hanmanth : కరోనా సమయంలోనూ బిగ్‌బాస్ సీజన్ 5 సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఈ బిగ్‌బాస్ సీజన్లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బాగా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ 105 రోజులపాటు హౌజులో ఉండి టాప్-5లో కూడా నిలిచారు. అయితే దాదాపు నాలుగు నెలల సమయంలో వీరు గాఢమైన రొమాన్స్ చేసి ప్రజల్లో ఓ రకమైన ఇంప్రెషన్ తెచ్చుకున్నారు. సిరి షణ్ముఖ్ పై చూపించిన ప్రేమ కొందరిని ఫిదా చేస్తే మరికొందరిని ఆగ్రహానికి గురి చేసింది. ఎందుకంటే ఆమె శ్రీహాన్ అనే నటుడితో ప్రేమాయణం సాగిస్తుంది. అలా ఒక వ్యక్తితో ప్రేమలో ఉండి షన్నుతో రొమాన్స్ చేయడం తప్పు అని చాలామంది ఆమె క్యారెక్టర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి.
Siri Hanmanth : పెళ్లి గురించి వైరల్ కామెంట్స్
సీరియల్ నటిగా ఫేమస్ అయిన సిరి హన్మంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ నిర్వాహకులు చెప్పినట్లుగా చేసి ఆమె ఏకంగా 15 వారాల పాటు హౌస్‌లోనే ఉండి సుమారు రూ. 30 లక్షల వరకూ సంపాదించిందట. కానీ ఆమె జనాల్లో తన క్యారెక్టర్‌ను దిగజార్చుకుందనే వ్యాఖ్యలు ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నిజానికి సిరి ఇప్పటికే శ్రీహాన్ అనే నటుడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలోనే ఈమె షణ్ముఖ్‌తో రొమాన్స్ చేసి వ్యక్తిగతంగా కాస్తా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఎవర్ని పెళ్లి చేసుకుంటావు? అని ప్రశ్నించగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
వాడిని చేసుకుంటా .. కానీ ఒక కండిషన్
ఇటీవల యూట్యూబ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సిరి శ్రీహాన్ నే పెళ్లి చేసుకుంటా అని చెప్పుకొచ్చింది. కానీ అలా అంటూనే ఆమె భారీ ట్విస్ట్ ఇచ్చింది. “బిగ్‌బాస్ నుంచి ఇప్పుడే కదా వచ్చింది. పెళ్లి చేసుకుంటానా ?? లేదా?? అనేది తెలియదు. చోటుతో మాట్లాడితే గానీ దాని గురించి ఇప్పుడప్పుడే చెప్పలేను. అతడు ఇప్పుడు ఏమంటాడో కూడా నాకు తెలియదు. నాకే క్లారిటీ లేదు. అందుకే పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తాను.” అని సిరి భారీ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో ఆమె శ్రీహాన్ ను పెళ్లి చేసుకోవడం కష్టమేనన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయింది. దీంతో షన్ను లాగానే సిరి కూడా భగ్న ప్రేమికురాలు అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!