Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి మాంచి జోరు మీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా యంగ్ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చిరు ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగామెగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఈ మూవీని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల మాదిరిగా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు చిరంజీవి. ఇందులో హీరోయిన్గా తమన్నా చిరు సరసన హీరోయిన్గా నటిస్తోంది. కీర్తి సురేశ్ చెల్లిగా కనిపిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తమిళ హిట్ సినిమా వేదాళం రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్‌గా గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్నారు. నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా 60 శాతానికి పైగా పూర్తైనట్టు సమాచారం.
Shruti Haasan: ఈ సినిమాలో చిరుకి జోడీగా శృతి హాసన్..?
ఇక చిరు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బాబీ రూపొందిస్తున్న సినిమా ఒకటి. ఇందులో ఆయన ఊర మాస్ గెటప్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చిరు లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. మాస్ మహారాజ రవితేజ ఇందులో చిరు తమ్ముడిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో చిరుకి జోడీగా శృతి హాసన్‌ను తీసుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్లో బాలయ్యతో గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్. ఇప్పటికే గోపీచంద్ సినిమాలలో ఆమె నటించింది కూడా. ఇలా కామన్ మూవీస్ ఉండటంతో చిరు సినిమాలోనూ శృతి హాసన్‌ను తీసుకోనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వస్తేగానీ తెలీదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!