KGF 2: సాధారణంగా లోకల్ ఇండస్ట్రీకి చెందిన హీరోలకు అభిమానులు.. భారీ ఎత్తున తమ అభిమానం రకరకాల రూపంలో చాటుతారు. వాళ్ల జన్మదిన వేడుకలు లేదా అభిమాన హీరో సినిమా రిలీజ్ ఈ సమయంలో భారీ ఎత్తున కటౌట్ లు.. థియేటర్ ల వద్ద కడతారు. మరికొంతమంది అయితే ఏకంగా పాలాభిషేకాలు.. చేయటం మాత్రమే కాదు కొంతమంది ఏకంగా ఇటీవల మేకలని కూడా థియేటర్ల వద్ద బలి ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే “కేజిఎఫ్” హీరో యాష్ కి కన్నడలో మాత్రమే కాదు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయువుపట్టు లాంటి నగరం ముంబాయిలో … అభిమానం పీక్ స్టేజ్ లో ఉంది. మేటర్ లోకి వెళ్తే ఏప్రిల్ 14 వ తారీకు “కేజిఎఫ్” సెకండ్ చాప్టర్ సినిమా రిలీజ్ కావడం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ కంటే అదరగొట్టే రీతిలో రెండో భాగం ఉండటంతో… జనాలు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ మొదట కన్నడ లో రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ తర్వాత అనేక భాషలోకి డబ్ అయి అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ ప్రేక్షకులైతే సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. ఈ తరుణంలో కేజిఎఫ్ 2 సినిమా రిలీజ్ నేపద్యంలో ముంబైలో ఏకంగా వంద అడుగుల హీరో యాష్ కటౌట్…కేజిఎఫ్ 2 థియేటర్ వద్ద అభిమానుల పెట్టడం సంచలనం రేపింది.
సినిమా చూడటానికి కంటే ఈ యాష్ వంద అడుగుల కటౌట్ చూడటానికి థియేటర్ వద్ద కి ముంబై వాసులు రావటం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఆశ్చర్య పడేటట్లు చేసింది. వాస్తవానికి ముంబాయి అంటే ఎక్కువగా బాలీవుడ్ హీరోలకు అక్కడి జనాలు బ్రహ్మరథం పడతారు కానీ ఒక సౌత్ హీరో.. అది కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోకి ముంబై వాసులు… 100 అడుగుల కటౌట్ కట్టడం.. చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇదంతా కేజిఎఫ్ మానియానే.. రాఖీ బాయ్ గా యాష్ అదరగొట్టడంతో …. జనాలు బ్రహ్మరథం పడుతున్నారు అంటూ.. తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాకి ప్రాంతం భాష.. ఉండదు అని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!