Venkatesh: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు చాలా వరకు కుర్ర డైరెక్టర్లకు అవకాశాలు అందిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్లంతా కుర్ర దర్శకులకే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని మరికొంతమంది సన్ డైరెక్ట్ లను లైన్ లో పెట్టడం జరిగింది. ఇదే సమయంలో చిరంజీవి కూడా కుర్ర దర్శకులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టు ఓకే చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఈ తరహా ఐడియా తో సీనియర్ హీరోల అందరి కంటే ముందుగా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే యంగ్ డైరెక్టర్ లేదా మల్టీస్టారర్ సినిమాలు వెంకటేష్ ఒప్పుకుంటూ… ఆడియన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా జాతీయ రత్తాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అనుదీప్ వెంకటేష్ కి స్క్రిప్ట్ వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో “ఎఫ్ త్రీ” సినిమా చేస్తున్నారు. ఈ వేసవిలో సినిమా రిలీజ్ కానుంది.
ఈదైనా వెంటనే అనుదీప్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. గత ఏడాది అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన “జాతిరత్నాలు” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన “జాతి రత్నాలు”.. రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు సాధించి నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ తో కూడా ఇదే తరహాలో ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ తో సరికొత్త స్క్రిప్ట్ అనుదీప్ చేయబోతున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!