మెగా హీరో సినిమా నుంచి తమిళ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారా? అవుననే వార్తలు నిన్నమొన్నటిదాకా వినిపించాయి. కానీ ‘లేదు’ అని ఇప్పుడు అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆగస్ట్ 16 నుంచి విజయ్ సేతుపతి నటించే సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టూ తెలిసింది. ఇంతకీ మెగా హీరో అని అనగానే ‘సైరా’ అని అనుకుంటున్నారా? కాదు. ‘సైరా’లో విజయ్ సేతుపతి పోర్షన ఎప్పుడో తెరకెక్కింది. తాజాగా మాట్లాడుతున్నది సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘ఉప్పెన’ గురించి. ఇందులో విజయ్ సేతుపతి విలనగా నటిస్తారని వార్తలు వచ్చాయి. వాటిలో నిజం లేదని కూడా అన్నారు. కానీ ఆయన నటిస్తున్న మాట నిజమేనని తాజాగా తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ కజిన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!