Beast: తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా తొలిసారి నటించిన చిత్రం `బీస్ట్`. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రేపు తమిళంతో పాటు తెలుగులోనూ అట్టహాసంగా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. అయితే తాజాగా `బీస్ట్` ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. దాదాపు రెండు వంటల కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. తమిళనాట ఏకంగా రూ. 75 కోట్ల వరకు బిజినెస్ చేసిందట.
ఇక తెలుగులో ఈ మూవీ రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఏరియాల వారీగా చూస్తే.. నైజాం హక్కులు 3.50 కోట్లకు, సీడెడ్ హక్కులు 2.1 కోట్లకు, ఆంధ్రా – 4.40 కోట్లకు అమ్ముడుపోయాయట. దీంతో `బీస్ట్` క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ఇక్కడ రూ. 10.50 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి విజయ్ ఆ టార్టెట్‌ను అందుకుంటాడో.. లేదో.. తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
కాగా, తెలుగు రాష్ట్రాలలో బీస్ట్ రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ను గమనిస్తే.. నైజాంలో 175, సీడెడ్ లో 90, ఆంధ్రాలో 240 మొత్తం 505 థియేటర్లు లభించాయి. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ రేంజ్లో థియేటర్స్ లభించడం నిజంగా విశేషమే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!