Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సాహో, రాధే శ్యామ్ సినిమాల రెండు ఫ్లాప్స్ అందుకొని తీవ్ర నిరాశలో ఉన్నాడు. దాంతో ఎలాగైన ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మళ్ళీ వరుసగా హిట్స్ అందుకోవాలని, తన పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక ప్రస్తుతం ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇది డార్లింగ్‌కు ఫస్ట్ స్ట్రెయిట్ హిందీ సినిమా. ఇందులో రాముడు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్, ఇతర పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Adipurush: అభిమానులకు డిసప్పాయింట్ తప్పదు అంటున్నారు.
అయితే, ఈ శ్రీరామ నవమికి ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ నటిస్తున్న శ్రీరాముడి పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రెడీ అయినట్టు సమాచారం. అయితే, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎంత వరకు ఆకట్టుకుంటుందీ అని. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలలో మాస్ పాత్రల్లో కనిపించిన డార్లింగ్‌ను ఒక్కసారి గా స్పిరిచువల్ లుక్‌లో చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మాట్లాడుకుంటున్నారు. ఏమాత్రం తేడా జరిగినా కూడా ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్‌తో అభిమానులకు డిసప్పాయింట్ తప్పదు అంటున్నారు. ఒకవేళ దర్శకుడు ఓం రౌత్ మ్యాజిక్ చేస్తే మాత్రం ఇదే ఫస్ట్‌లుక్‌తో అసాధారణమైన అంచనాలు నెలకొనడం గ్యారెంటీ.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!