NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

టీవీ9 ఊహించని పతనం.! షేర్ల ఢమాల్..!! రీ ఎంట్రీకి రవి ప్రకాష్ స్కెచ్.!!

టీవీ 9 తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకి ఓ శకాన్ని, ఓ నవ రూపుని అందించింది. మీడియాలో ఓ వెలుగు వెలిగి, తిట్టించుకుంది. న్యూస్ ప్రెజెంటేషన్ లో కొత్తదనం చూపించింది. మాయలు చేసింది, కంత్రీలు నడిపింది. ఎలాగోలా నంబర్ వన్ అనిపించుకుంది..!! ఆ టీవీ 9 గోల ఇప్పుడు ఎందుకయ్యా అంటే..?? షేర్లు పడిపోతున్నాయి. కార్యాలయాలు మూతపడుతున్నాయి. తోక చానెళ్లు మూతపడ్డాయి. షేర్ ఏకంగా 60 శాతానికి పైగా పడిపోయింది. ఇది మొత్తం ఉండగా.., మాజీ సీఈవో రవిప్రకాష్ తాజాగా టీవీ 9 లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇప్పుడు మనకు పెద్ద వార్త..!!

రవి ప్రకాష్ పిటిషన్ లో ఏముందంటే..??

టీవీ 9 ని అమ్మేయండి. నేను కొనేస్తాను. నేను సంస్థలో ఉన్నప్పుడు లాభాల్లో ఉండేది. షేర్ విలువ భారీగా పెరిగింది. ఇప్పుడు అమాంతం పడిపోతుంది. రూ. 270 నుండి రూ. 78 కి పడిపోయింది. మరో నాలుగేళ్ల పాటు సంస్థకి నష్టాలు తప్పవు అని ఆ సంస్థ తన వాల్యుయేషన్ రిపోర్ట్ లో చెప్తుంది. అందుకే వాళ్ళు చెప్తున్న షేర్ ప్రైస్ కి అమ్మేస్తే మొత్తం నేనే కొనేస్తాను. టీవీ 1 , న్యూస్ 9 చానెళ్లు మూసేసారు. బ్రాండ్ విలువ పడిపోయింది. జర్నలిజం ఏ మాత్రం తెలియని వాళ్ళే దీనికి కారణం. అందుకే నాకు అమ్మేయండి, కొనేస్తాను” అంటూ టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేశారు. ఇదే ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చ.

కార్పొరేట్ పెత్తనం దెబ్బ కొట్టిందా..??

ఏమో టీవీ 9 ని అమ్ముతారో, లేదో… ఒకవేళ అమ్మినా రవి ప్రకాష్ కి అమ్ముతారో.., లేదో తర్వాత విషయం. కానీ..! ఒక టాప్ తెలుగు మీడియా ఛానెల్ దెబ్బ తిన్న మాట వాస్తవం. టీవీ 9 ఇప్పుడు మై హోమ్, మెఘా అనే కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉంది. వీళ్ళు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇంజనీరింగ్ బిల్డర్లు. కానీ కేసీఆరు చలవ, స్వామిజి దీవెనతో టీవీ 9 కి అధిపతులుగా మారిపోయారు. కానీ గడిచిన ఆరు నెలలుగా టీవీ 9 పతనం తట్టుకోలేకపోతున్నారు. కిందికి దిగజారుతుంటే ఆపలేకపోతున్నారు. రూ. 270 ఉన్న షేరు ధర రూ. 78 అయిపొయింది. యూట్యూబ్ లో వ్యూయర్స్ తగ్గిపోతున్నారు. రాజనీకాత్ డిబేట్ కి కనీసం 2 వేల మంది చూడడం లేదంటే ఇక పతనం ఊహించుకోవచ్చు.

ఛానెల్ కి మార్కెట్ లో పేరు మసకబారింది. ర్యాంకింగ్స్ లో ఏదో మాయలు చేసి నెట్టుకొస్తున్నప్పటికీ యాడ్లు రావడం లేదు. మొత్తానికి గడిచిన ఆరు నెలల కాలంలోటీవీ 9 లో ఊహించని పతనం ఆరంభయింది. స్వతహాగా ఒక జర్నలిస్టు లేదా ఒక కీలక వ్యాపారవేత్త ఎవరైనా ఇటువంటి బ్రాండెడ్ చానెళ్లకు అధిపతులుగా ఉంటె కొత్త ఆలోచనలు చేసే వారు, పైకి లేపేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ యజమానులు ఆ ఆలోచనలు చేయడం లేదు. “చూద్దాం, చేద్దాం” అంటూ పెత్తనం కోల్పోతున్నారు. అందుకే రవి ప్రకాష్ తనకు ఇచ్చేయాలి అంటూ పిటిషన్ వేశారు.

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju