డిజిపి గౌతమ్ సవాంగా.. మజాకా? బ్లాస్టింగ్ నిర్ణయం !

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కిందనే సామెత వినే ఉంటారు.ప్రస్తుతం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అదే మాదిరి వ్యవహరిస్తున్నారన్న విషయం వెలుగుచూసింది.

dgp gautham sawang sensational decission
dgp gautham sawang sensational decission

ఈ విషయాన్ని బయట పెట్టింది ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కావటం ఇక్కడ టర్నింగ్ పాయింట్ .ఎప్పుడైతే డిజిపి అసలు రహస్యాన్ని బయటపెట్టారో చంద్రబాబునాయుడు సైలెంట్ అయిపోయారు..అసలు మేటరు ఏమిటంటే చిత్తూరు జిల్లా మదనపల్లిలో సస్పెన్షన్లో ఉన్న వివాదాస్పదుడైన జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర పై ఇటీవల దాడి జరిగింది.వెనువెంటనే టిడిపి తీవ్రంగా స్పందించింది.రామచంద్ర పై వైసిపి కార్యకర్తలు దాడి చేశారంటూ రచ్చ చేసింది.. ఉద్దేశ్యపూర్వకంగానే రామచంద్రపై వైసిపి గుండాలు దాడులు చేసినట్లు ట్విటర్లోను టిడిపి నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో కూడా చంద్రబాబు ఆరోపణలు చేశారు.అంతటితో ఆగకుండా ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపి దోషులను తక్షణం అరెస్టు చేయాలంటూ చంద్రబాబు నాయుడు నేరుగా డిజిపికి ఒక లేఖ కూడా రాశారు.

విషయం రాజకీయం కూడా కావడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.ఇక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది.రామచంద్ర పై దాడి చేసింది టిడిపి కార్యకర్తనని స్పష్టమైపోయింది.అసలేం జరిగిందంటే మదనపల్లిలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి టిడిపి కార్యకర్త. ఈయన మార్కెట్లో  వెళుతుంటే ఎదురుగా తోపుడుబండి అడ్డొచ్చింది. బండిని తీయమని చెప్పిన క్రమంలో బండి అతనికి ప్రతాప్రెడ్డికి మధ్య గొడవ జరిగింది. ఇంతలో అదే దారిలో వెళుతున్న రామచంద్ర కూడా అక్కడికి చేరుకున్నారు. అవసరం లేకపోయినా వివాదంలో జోక్యం చేసుకుని తోపుడుబండి వ్యాపారికి మద్దతుగా నిలిచారు. దాంతో రామచంద్రకు ప్రతాప్ రెడ్డికి మద్య గొడవ పెద్దదయిపోయింది. దాంతో ప్రతాపరెడ్డే ఇనుపరాడ్ తో రామచంద్ర తలపై బలంగా కొట్టారు. గొడవజరిగిన సమయంలో రామచంద్ర ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారని కూడా పోలీసులు తేల్చారు.

జరిగిన విషయాన్ని ప్రతాప్ రెడ్డే పోలీసులకి వివరించాడు . దాంతో గొడవ ఎందుకు జరిగింది ఎవరిమధ్య జరిగిందనే విషయాలన్నీ బయటకు వచ్చాయి. అంటే రామచంద్రపై దాడి చేసింది టిడిపి కార్యకర్త ప్రతాప్ రెడ్డే అన్న విషయం బయటపడింది. ఇదే విషయాన్ని వివరిస్తూ డిజిపి చంద్రబాబుకు లేఖ రాశారు.అంటే చంద్రబాబు సహా టిడిపి నేతలందరి వాయిస్ పడిపోయింది.ఏదేమైనా ఏ సంఘటన జరిగినా దాన్ని వైసిపికి వీలయితే ముఖ్యమంత్రి జగన్ కి ముడిపెడుతూ ఆరోపణలు చేసే చంద్రబాబు,ఇతర టిడిపి నేతలకి ఇలాంటి సంఘటనలతోనైనా కనువిప్పు కలిగేనా?