Sivaji: నటుడు, రాజకీయ నాయకుడు శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చిన శివాజీ.. జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. కొద్దిరోజులకు అదే ఛానల్ లో యాంకర్ గా మారారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల ద్వారా సినిమాల్లోకి వచ్చిన శివాజీ హీరోగా నిలదొక్కుకున్నాడు. మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సినిమాలు అతనికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
కథానాయకుడిగా ఫామ్ కోల్పోయిన తర్వాత శివాజీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక చాలాకాలం తర్వాత శివాజీ మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల 90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యాడు.
ప్రస్తుతం శివాజీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు శివాజీ ఒకానొక సందర్భంలో `నాకే కనుక శోభాశెట్టి లాంటి కూతురు ఉంటే.. పీకమీద కాలేసి తొక్కేవాడ్ని` అంటూ నోరు జారాడు. అతని కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అదే తరుణంలో నటుడు సమీర్.. శివాజీకి కూతురు ఉందంటూ బాంబ్ పేల్చాడు. నిజానికి శివాజికి ఉన్నది ఇద్దరు కొడుకులు.. వారే కెన్నీ, రిక్కీ. వీరిద్దరూ చదువుకుంటున్నారు. మరి కూతురు ఉందని సమీర్ ఎందుకు చెప్పాడో ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఈ క్రమంలోనే మరొక భార్య ద్వారా శివాజీ కూతురికి జన్మనిచ్చి ఉండొచ్చనే అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు శివాజీ అసలు నిజం బయటపెట్టారు. తన రమష్య కూతురిపై ఫస్ట్ టైమ్ నోరు విప్పారు. తాజాగా ఆలీతో సరదాగా షోలో శివాజీ పాల్గొన్నాడు. ఈ షోలో ఆలీ స్క్రీన్‌పై ఓ పాప ఫోటోను చూపించి మీ కూతురేనా? అని ప్రశ్నించగా.. శివాజీ అవునని సమాధానం చెప్పారు. అయితే తాను ఎక్కడా విత్తనాలు చల్లలేదని.. నిజానికి నాకు ఉన్నది ఇద్దరు అబ్బాయిలు మాత్రమే అని శివాజీ పేర్కొన్నారు. తనకే కాకుండా ఫ్యామిలీలో అందరికీ అబ్బాయిలే ఉన్నారని.. అమ్మాయిలు లేరని తెలిపారు. ఇక ఫొటోలో ఉన్నది చిన్న కొడుకు రిక్కీ అని.. వాడికి అమ్మాయి గెటప్ వేశాము. బహుశా ఈ ఫోటో చూసే సమీర్ తనకు కూతురు ఉందని పొరపాటు పడి ఉండొచ్చని శివాజీ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి శివాజీకి కూతురు లేదన్న విషయం తేలిపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!