NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్రానికి భారీ ఊరట ..ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకి నిరాకరణ

Supreme Court: లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టు లో పిటిషన్ లు దాఖలైయ్యాయి. దీనిపై ఇవేళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సంథు నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావిస్తూ.. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. అయితే నియామక ప్రక్రియపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఇంత హడావుడిగా ఎందుకు చేశారంటూ ప్రశ్నించింది. నియామక ప్రక్రియను స్వీకరించడానికి మరి కొంత సమయం ఇవ్వాలని, తద్వారా ప్రక్రియను మెరుగైన పద్ధతిలో పూర్తి చేయవచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

పిటిషనర్ జయ టాకూర్ తరుపున కోర్టుకు హజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఇప్పుడు తీర్పు వెలువడినందున అందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 ఉల్లంఘనలు జరిగాయని ఆయన వాదించారు.

ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, అది పాలనాయంత్రాంగం కింద పని చేస్తుందని చెప్పకూడదని అలానే ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యమని పేర్కొంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

2023 చట్టం రూపొందించకముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్ సభ లో విపక్ష నేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐ కు చోటు కల్పించకపోవడాన్ని సమర్ధించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరి కాదని తెలిపింది.

Lok Satta Party: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు అంటూ సంచలన ప్రకటన చేసిన లోక్ సత్తా జేపీ

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!