RC16: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘RC16’ మరో స్థాయిలో ఉంటుందని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. ‘RC16′ మూవీలో శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ…’బుచ్చిబాబు విజన్ ఉన్న దర్శకుడు. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడు ఆయనకు అరగంటే టైమ్ ఇచ్చాను. కానీ గంటన్నర పాటు వింటూ ఉండిపోయాను. స్టోరీ అంత బాగుంది’ అని తెలిపారు. చరణ్ అద్భుతమైన నటుడే కాక చాలా మంచి మనిషని కొనియాడారు. ఇదిలా ఉంటే “RC16” ప్రాజెక్టు పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు సాంగ్స్ కంప్లీట్ చేయడం జరిగిందట. రామ్ చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే అథ్లెటిక్ గేమ్స్ పరంగా గ్రామీణ నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. అందువల్లే ఏ సినిమాలో చాలామంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారితో నటింప చేసే పనులు చేస్తున్నారట. బుచ్చిబాబు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఈ నెల ఆఖరిలో ప్రకటించబోతున్నట్లు సమాచారం.
“RC16” మూవీ షూటింగ్ మాత్రం చాలా వేగవంతంగా జరగనుందని సమాచారం. ఈ సినిమా కోసం పక్కా షెడ్యూల్ తో మొత్తం అంతా దర్శకుడు బుచ్చిబాబు ప్రిపేర్ చేసుకోవడం జరిగిందట. మార్చి 27 చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఆరోజు “గేమ్ చేంజర్” విడుదల తేదీతో పాటు బుచ్చిబాబు సినిమా టైటిల్ ప్రకటన అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “RRR” విడుదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది. దీంతో చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!