NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

Amrapali IAS: ఆమ్రపాలి అసలు రహస్యం…నర్తకి నుండి బౌద్ధ సన్యాసిని దాకా ఎదిగిన ఆమ్రపాలి కథ స్ఫూర్తిదాయకం!

Amrapali IAS: True Story and Meaning Behind Amrapali Kata Name by Her Father

Amrapali IAS / Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలి పేరు వెనుక అర్ధం ఏమిటో తెలుసా? ఆమ్రపాలి తండ్రి వెంకట్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫసర్ గా పని చేసేవాడు, అతనికి చరిత్ర పట్ల మక్కువతో పాటు అపారమైన అవగాహన ఉండేది. బౌద్ధ సాహిత్యం పట్ల అవగాహన ఉన్న ఆమ్రపాలి తండ్రి, అలాంటి సాహిత్యంలోని ఒక అద్భుతమైన కథ ఆధారంగా తన ముద్దుల కూతురికి ఆమ్రపాలి అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే… బౌద్ధ కథలలో ఎలా జరిగిందో ఆమ్రపాలి జీవితంలో కూడా అలానే జరిగింది. అసలు ఆమ్రపాలి పేరు వెనుక ఉన్న రహస్యం ఏమిటో…బౌద్ధ చరిత్రకు ఆమ్రపాలికి ఉన్న సంబంధం ఏమిటో న్యూస్ఆర్బిట్ నుండి ఈ ప్రత్యేక కథన చదివి తెలుసుకోండి.

Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali
Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali

ఆమ్రపాలి అనే పేరు గౌతమ బుద్ధుడి కాలం నాటి కథలలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది, ఇలా బుద్ధుడి కాలం నాటి అమ్రపాలి గురించి చదివి ప్రేరణ పొంది తన కూతురికి కూడా ఆమ్రపాలి అని పేరు పెట్టారు…అసలు కథలోకి వెళ్తే… కథ వైశాలి సామ్రాజ్యం లో మొదలవుతుంది.

Amrapali IAS Special Story on How She Got Her Name
Amrapali IAS Special Story on How She Got Her Name

బుద్ధుడి కాలంలో ఉత్తర భారత దేశంలో ప్రధానంగా 16 సామ్రాజ్యాలు ఉండేవి, అందులో ఒకటైన వైశాలి సామ్రాజ్యం బీహార్ భూభాగంలో ఉండేది. బుద్ధుడి జీవితంలో ఎదురైనా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికి చివరికి జ్ఞానోదయం అయింది ఇక్కడే. క్రీస్తు పూర్వము 600 లో వైశాలి సామ్రాజ్యం రాజమందిరంలోని ఒక మామిడి చెట్టు కింద జన్మించింది ఆమ్రపాలి.

 

The story of royal dancer Amrapali who went on to become Arihant in Buddhism
The story of royal dancer Amrapali who went on to become Arihant in Buddhism

సంస్కృతం లో ఆమ్ర అంటే మామిడి పండు అందుకే ఈమెకు ఆమ్రపాలి అని పేరు వచ్చింది, రాజమందిరంలో మామిడి చెట్టు కింద జన్మించిన ఆమ్రపాలి ఆ తరువాత అక్కడే పెరిగింది. కన్యగా ఉన్నపటినుండే ఆమ్రపాలి అందం గురించి అందరూ మాట్లాడుకునేవారు, కొన్ని కథలలో ఆమ్రపాలి కోసం రాజ్యాలు వొదిలేసి వైశాలి వచ్చిన రాకుమారులు ఎందరో.

 

Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali
Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali

అలాంటి అరుదైన అందం కలిగిన ఆమ్రపాలి ఒక రోజు సరదాగా నాట్యం చేస్తుండగా వైశాలి రాజు అయిన మనుదేవుడు చూసి మనసు పారేసుకుంటాడు. ఆమ్రపాలి చిన్ననాటి మిత్రుడిని చంపేసి తన సొంతం చేసుకోవాలనుకుంటాడు మహా రాజు మనుదేవుడు. ఆమ్రపాలిని ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోకుండా నగరవదు గా మారుస్తూ ఆజ్ఞ ఇస్తాడు. నగరవదు అంటే వైశాలి సామ్రాజ్యానికి పెళ్లికూతురు లాంటి వారు, వీరు నగరాన్ని పెళ్ళిచేసుకుని మిగిలిన జీవితం అంతా రాజమందిరంలో నాట్యం చేస్తూ అందరికి విశ్రాంతి సమయంలో వినోదాన్ని అందిస్తారు.

Amrapali: తెలంగాణ సర్కార్ లో ఆంధ్రా ఆడపడుచుకు కీలక బాధ్యతలు

 

Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali
Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali

అతి త్వరలోనే ఆమ్రపాలి వైశాలి సామ్రాజ్యంలో అందరినీ ఆకర్షించే రాజనర్తకి గా తన అందం అభినయంతో పెద్ద పేరు ప్రజాదరణ గెలుచుకుంది. ఎంత పేరు తెచ్చుకుంది అంటే, ఒక్క రాత్రి ఆమ్రపాలి ప్రదర్శన చూడాలి అంటే 50 కార్షాపణలు(అప్పటి డబ్బు) చెల్లించాలి, ఆమ్రపాలి సంపాదన కొంత మంది రాజులను కూడా మించిపోయింది.

మహారాజులతో ప్రేమ వ్యవహారాలు అంతులేనంత సంపద… ఇలా జీవితం నడుస్తున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా బుద్ధుడిని కలుస్తుంది ఆమ్రపాలి. వైశాలి నగరంకి చనిపోవడానికి ముందు చివరిసారిగా వచ్చిన బుద్దుడుకి రాజమందిరంలో భోజనం వడ్డిస్తూ అనుకోకుండా కలుస్తుంది ఆమ్రపాలి. ఆ తరువాత రాత్రి బుద్ధుడిని మళ్లీ కలిసి చాలా సేపు మాట్లాడుతుంది, ఆ మాటలకు జ్ఞానోదయం అయ్యి తన సంపదనంతా బౌద్ధ సన్యాసులకు ఇచ్చేస్తుంది. ఇలా బౌద్ధ మతం వైపు తిరిగిన ఆమ్రపాలి ఇంకెప్పుడు నాట్యం చేయలేదు, ఒక మహిళగా అతి తక్కువ సమయంలో అరిహంత్ స్థాయి జ్ఞానోదయం తెచ్చుకుని బౌద్ధ కథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆమ్రపాలి.

Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali
Amrapali Kata: Real story of Amrapali IAS on Why her Father Named Her Amrapali

అప్పటి ఆమ్రపాలి వైశాలిలో మామిడి చెట్టుకింద పుట్టింది, ఇప్పటి ఆమ్రపాలి ఐఏఎస్ విశాఖపట్నంలో పుట్టింది. వీరి మధ్య వేల సంవత్సరాల దూరం ఉన్నపటికీ, ఆ అమ్రపాలినే మళ్ళీ పుట్టిందా అనేలా వీరి కథ చాలా దెగ్గరగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమ్రపాలి ఐఏఎస్ కూడా అందం తెలివితేటలతో చిన్నవయసు నుండే అందరిని ఆకర్షింది, ఐఐటీ ఐఐఎం లాంటి కఠినమైన పరీక్షలు రాసి చదువు అయిన తరువాత ఏబీన్ బ్యాంకులో ఉద్యోగం మొదలుపెట్టింది. కానీ అక్కడ సంతృప్తి లేదు, ప్రజాసేవ చేయాలి అంటే సివిల్స్ అయితేనే సబబు అని జ్ఞానోదయం కలిగిన తరువాత సివిలాస్ పరీక్ష రాసింది. అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించి దేశమంతా ప్రజాదరణ తెచ్చుకుంది. అంతేకాదు వరంగల్ జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్ కూడా అయింది, తన తండ్రి ఆమ్రపాలి అని పేరు పెట్టినప్పుడు ఇంత పైకి ఎదుగుతుంది అని అస్సలు ఉహించిఉండడు…బౌద్ధ కాలం నాటి ఆమ్రపాలి అయినా ఇప్పటి ఆమ్రపాలి ఐఏఎస్ అయినా వీరి జీవితాలు మాత్రం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయం.

 

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri