NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sreemukhi: ఎట్ట‌కేల‌కు ఓ ఇంటిది కాబోతున్న శ్రీ‌ముఖి.. టాలీవుడ్ యంగ్ హీరోతో రాముల‌మ్మ పెళ్లి ఫిక్స్‌..!?

Sreemukhi: బుల్లితెర రాములమ్మ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు శ్రీముఖి. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బిజీ యాంకర్స్ లో శ్రీముఖి ముందు వ‌రుస‌లో ఉంటుంది. త‌న చ‌లాకీ మాట‌లు, అందచందాల‌తో తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపుల‌ర్ అయింది. ఈటీవీ మాటీవీ జీ తెలుగు ఇలా దాదాపు అన్ని మెయిన్ ఛానల్స్ లో శ్రీముఖి యాంకర్ గా షోలు చేస్తోంది. అలాగే సినిమా ఈవెంట్స్ ను హోస్ట్ చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇలాంటి త‌రుణంలో శ్రీ‌ముఖికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

టెలివిజ‌న్ రంగంలో బిజీ యాంక‌ర్ గా స‌త్తా చాటుతున్న శ్రీ‌ముఖి.. త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంద‌ట‌. మూడు ప‌దుల వ‌య‌సులోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఈ ఏడాదిలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతోంద‌ట‌. టాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీ‌ముఖి పెళ్లి ఫిక్స్ అయింద‌ని ప్ర‌స్తుతం టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి స‌ద‌రు హీరోతో సీక్రెట్ గా శ్రీ‌ముఖి ప్రేమాయ‌ణం న‌డిపిస్తోంద‌ట‌.

ఇటీవ‌ల త‌మ ల‌వ్ మ్యాట‌ర్ ను ఇరువురి ఇంట్లో తెలియ‌జేయ‌గా.. వారు కూడా అంగీక‌రించారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపిన నేపథ్యంలో.. స‌ద‌రు యంగ్ హీరోతో శ్రీ‌ముఖి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో శ్రీముఖి పెళ్లి ఉంటుంద‌ని అంటున్నారు. అయితే శ్రీ‌ముఖితో ప్రేమ‌లో ఉన్న హీరో ఎవ‌రు అన్న‌ది మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. అయితే గ‌తంలో కూడా శ్రీ‌ముఖి పెళ్లి వార్త‌లు గుప్పుమ‌న్నాయి. స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్ తో శ్రీ‌ముఖి వివాహం జ‌ర‌గ‌బోతోందంటూ ప‌లుమార్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు అవి పుకార్లుగానే మిగిలాయి.

ఇప్పుడు మ‌రోసారి శ్రీ‌ముఖి పెళ్లి వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే శ్రీ‌ముఖి స్పందించాల్సిందే. కాగా, శ్రీ‌ముఖి బుల్లితెర‌తో పాటు వెండితెర ప్రేక్ష‌కులకు కూడా సుప‌రిచిత‌మే. నిజామాబాద్ లో శ్రీ‌ముఖి జ‌న్మించింది. ఆమె తండ్రి రామ్‌ కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి కాగా.. తల్లి లత బ్యూటీషియన్. శ్రీ‌ముఖికి శుశ్రుత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

డాక్ట‌ర్ చ‌ద‌వాల‌ని శ్రీ‌ముఖి భావించింది. బి. డి. ఎస్ లో సీటు కూడా సంపాదించింది. కానీ అంత‌లోనే టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో శ్రీ‌ముఖి చ‌దువు మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు యాంక‌ర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ముఖి.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే 2012లో జులాయి మూవీతో శ్రీ‌ముఖి వెండితెర‌పై అడుగు పెట్టింది. ఆపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, నేను శైల‌జ‌, సావిత్రి, జెంటిల్ మేన్, బాబు బాగా బిజి తో స‌హా అనేక చిత్రాల్లో శ్రీ‌ముఖి న‌టించింది. ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డపా సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా దూసుకుపోతోంది.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu