NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Allu Arjun: అల్లు అర్జున్ త‌న 20 ఏళ్ల‌ కెరీర్ లో రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ఇవే!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ మూవీతో నేషనల్ వైడ్‌ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప ది రూల్‌ మూవీ తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ డైరెక్టర్ చేస్తున్న‌ ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తొలి భాగం భారీ విజయాన్ని సాధించడంతో పుష్ప 2 చిత్రాన్ని అంచనాలకు అనుగుణంగా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 2 ఈ ఏడాది ఎండింగ్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అనంతరం అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, బోయపాటి శ్రీను వంటి దర్శకులు అల్లు అర్జున్ లైన‌ప్ లో ఉన్నారు.

ఈ సంగతి పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. మెగా హీరో అన్న ట్యాగ్ తో పని లేకుండా నటుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. గొప్ప డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశాడు. అలాగే కొన్ని మూవీస్‌ను రిజెక్ట్ కూడా చేశాడు. ఈ జాబితాలో ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయ‌ని మీకు తెలుసా..? అవును నిజ‌మే.. అల్లు అర్జున్ చేతుల్లో నుంచి ఐదు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ జారిపోయాయి. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ 100% ల‌వ్‌. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2011లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ నాగచైతన్య కాదు. సుకుమార్ మొదట ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయాలని భావించాడు. కానీ ఆ సమయంలో యాక్షన్ మూవీస్ పై ఆసక్తి ఉండడం వల్ల అల్లు అర్జున్ 100% లవ్ ను రిజెక్ట్ చేశాడు. దాంతో ఈ సూపర్ హిట్ మూవీ చేసే అవకాశం నాగ‌ చైతన్యకు దక్కింది.

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో ఉన్న బెస్ట్ మూవీస్ లో అర్జున్ రెడ్డి, గీతగోవిందం ముందు వరుసలో ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రంలో శాలిని పాండే హీరోయిన్ గా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2015లో విడుదలైన అర్జున్ రెడ్డి సంచల‌న‌ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. అయితే అర్జున్ రెడ్డి మూవీ స్టోరీ విజయ్ దేవరకొండ కంటే ముందు అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. కానీ ఇటువంటి బోల్డ్ స్టోరీ తనకు సెట్ అవ్వదని ఆయన రిజెక్ట్ చేశాడు. అలాగే గీత గోవిందం మూవీ కూడా అల్లు అర్జునే చేయాల్సి ఉంది. డైరెక్టర్ ప‌ర‌శురామ్ గీతగోవిందం స్టోరీని అల్లు అర్జున్ కు నెరేట్ కూడా చేశారు. కానీ అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేక నో చెప్పారు. దాంతో ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ మూవీ చేసే అవ‌కాశం కూడా విజయ్ దేవ‌ర‌కొండ‌కే ద‌క్కింది.

అల్లు అర్జున్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం బొమ్మరిల్లు. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా నటించారు. 2006లో విడుదలైన బొమ్మరిల్లు మూవీ ఎలాంటి విషయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బొమ్మరిల్లు మూవీకి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జునే. కానీ ఏవే కారణాల వల్ల ఆయన తిర‌స్క‌రించ‌గా.. సిద్ధార్థ క‌థ‌లోకి వ‌చ్చాడు. ఇక బోయపాటి శ్రీను, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భద్ర. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. భ‌ద్ర చిత్రాన్ని దిల్ రాజు మొద‌ట‌ అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. అల్లు అర్జున్ నో చెప్పడంతో రవితేజ హీరోగా చేశాడు.

author avatar
kavya N

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju