Krishnamma Kalipindi Iddarini: ఆదిత్య నా కోసం ఇంత త్యాగం చేసావా నీ ప్రేమ విషయం నా దగ్గర దాచి పెట్టి నీకు అఖిల నిచ్చి పెళ్లి చేశారని నాకు ఒక్క మాట చెబితే బాగుండేది కదరా నేను ఏదో ఒకటి చేసి ఆ పెళ్లిని ఆపి అమృతతో నీ పెళ్లి జరిపించే వాడిని కానీ ఏం లాభం నాకు తెలిసే లోపే నీకు అఖిలకు పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఎంత బాధ పడితే ఏం లాభం ఏం చేసినా మన జీవితాలు మారిపోవు ఇంతకాలం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అనుకున్నాను కానీ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని నాకు తెలిసిన తర్వాత ఎంత మరిచిపోదామని ట్రై చేసినా గౌరీ చేసిన మోసం వెంటాడి బాధపెడుతుంది నువ్వు నా లైఫ్ లోకి రావడం ఒక వరం అనుకున్నాను కానీ నా జీవితాన్ని నువ్వు శూన్యం చేసి పడేసావు అని ఈశ్వర్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఉజ్వల వస్తుంది ఏంటి బావ ఒక్కడివి ఏం చేస్తున్నావు అని ఉజ్వల అడిగింది.

ఏమీ లేదు ఉజ్వల అని ఈశ్వర్ అంటాడు. క్షమించు బావా చిన్నప్పటి నుండి మన ఇద్దరికీ పెళ్లి అని పెద్దవాళ్లు అనుకున్నారు కానీ నేను నీకు చూపు లేదని నిన్ను చేసుకోను అన్నాను అని ఉజ్వల అంటుంది. అదంతా జరిగిపోయిన సంఘటనలు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు అని ఈశ్వర్ అంటాడు. అలా అనకు బావ నిన్ను అవమానించానన్న బాధ నాకు ఇంకా ఉంది క్షమాపణ చెబితే మనసు కుదుటపడుతుంది ఈ లోకంలో డబ్బే శాశ్వతం అనుకున్నాను కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే చాలు అని తెలుసుకోలేకపోయాను అందుకే నిన్ను అవమానించి నిన్ను దూరం చేసుకున్నాను అది ఎంత తప్పు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది గౌరీ నిన్ను చేసుకోవడం ఎంతో అదృష్టం బావ అని ఉజ్వల అంటుంది. కట్ చేస్తే గౌరీ అక్కడికి వచ్చి ఏమండీ మిమ్మల్ని మావయ్య గారు అడిగారు తీసుకురమ్మని నన్ను పంపించారు అని గౌరీ అంటుంది.

నాకోసం ఎవరినో ఒకరిని పంపించు దయచేసి నువ్వు నా దగ్గరికి రాకు ప్లీజ్ అని ఈశ్వర్ అంటాడు. ఏవండీ మీరు నా తప్పునే చూస్తున్నారు ఆ తప్పుని చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని నాకు ఇవ్వండి అని గౌరీ అంటుంది. నీకు నాతోటి మాట్లాడే అవకాశం ఇస్తే నా గుండెకు ఇంకెన్ని గాయాలు చేస్తావో అని భయం నువ్వు వెళ్ళు నేను వస్తాను అని ఈశ్వర్ అంటాడు. ఏడుస్తూ గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మ గౌరీ నీకోసమే వెతుకుతున్నాను నిన్న మీ ఇంట్లో శోభనం జరిగింది కదా ఇవ్వాల మన ఇంట్లో మీ శోభనం ఇది చెబుదామనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఈ చీర కట్టుకొని రామ్మా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అలాగే అత్తయ్య అని గౌరీ చీర తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే భవాని అఖిలను రెడీ చేస్తుంది ఇంతలో వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి అఖిలకి నగలు వేస్తుంది. గౌరీని పట్టించుకోకపోతే సునంద తోక తొక్కిన పాముల బుసలు కొడుతుంది ఎందుకైనా మంచిది గౌరీని ప్రేమగా చూసుకున్నట్టు నటిద్దాం అని గౌరీ ఈ చీర నీకు చాలా బాగుందమ్మా అని భవాని అంటుంది. ఈశ్వర్ ఆదిత్య రెడీ అయ్యారో లేదో ఒకసారి వెళ్లి చూస్తావా అని సునంద అంటుంది.

అలాగే అక్క అని వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోతుంది. అఖిల ఇంకా పూలు పెట్టుకోలేదే అని వాళ్ళ అమ్మ పూలు పెడుతూ చూపు మార్చు లేకుంటే మీ అత్తయ్య గారికి అనుమానం వస్తుంది నువ్వు గౌరీని ఉరిమి చూడడం కాదు మీ ఆయనని వలపులతో ఆకట్టుకో అని భవాని అంటుంది. సునంద గౌరీని రెడీ చేస్తుంది అది చూసిన అఖిల అత్త గౌరిని ఎలా చూసుకుంటున్నావో అన్ని రాసి పెట్టుకుంటున్నాను నీ సంగతి తర్వాత చెప్తాను నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది గా అప్పుడు నీ కాళ్లు విరగొట్టి నిన్ను వీల్ చైర్ లో కూర్చోపెట్టకపోతే నా పేరు అఖిలే కాదు బస్తీ మీద సవాల్ అని అఖిల అనుకుంటుంది తన మనసులో ఇంతలో అక్కడికి ఉజ్వల వచ్చి గౌరీ ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు మా ఈశ్వర్ బావకి నువ్వు దొరకడం చాలా అదృష్టం అని ఉజ్వల అంటుంది. గౌరీ అందంలోనే కాదు రూపంలో కూడా గుణవతి అందంలో శిల్పి చెక్కిన శిల్పి లా ఉంటుంది ఏంటి గౌరీని పొగుడుతుంటే అఖిలకి కోపం వచ్చి రెచ్చిపోతుంది అనుకుంటే తను సైలెంట్ గా ఉంది అని సౌదామిని అనుకుంటుంది.

గౌరీ నువ్వు ఇప్పుడు ఎంత అందంగా రెడీ అయి వెళ్తున్నావు అంత ఏడుస్తావు ఈశ్వర్ బావ దగ్గర మంట పెట్టాను ఆ మంటల్లో నువ్వు కాలి బూడిది అవడం ఖాయం అని ఉజ్వల అనుకుంటుంది. కట్ చేస్తే గౌరీ భయపడుకుంటూ గదిలోకి వస్తుంది ఏంటి ఈయన గదిలో లేరు ఎక్కడికి వెళ్లి ఉంటాడు నేను కనబడితేనే తనకు కోపం వస్తుంది మోసం చేశానని బాధపడతాడు నువ్వు నా దగ్గర నిజం దాచావు నా తమ్ముడి జీవితం ఇలా కావడానికి నువ్వే కారణం నిన్ను ఎప్పుడూ నా జీవితంలో క్షమించను అని నన్ను దగ్గరికి కూడా రానివ్వడు నేను ఇలా రెడీ అయ్యానని ఆయనకి తెలిస్తే కోప్పడతారు మన మధ్య ఏమీ లేదు కదా నువ్వెందుకు ఇలా రెడీ అయి వచ్చావు అని నన్ను ప్రశ్నిస్తాడు ఆయన వచ్చే లోపే నేను పడుకొని ఉంటే మా ఇద్దరి మధ్య గొడవ ఉండదు అని గౌరీ కింద పక్క వేసుకుని పడుకుంటుంది. ఇంతలో ఈశ్వర్ గదిలోకి వస్తాడు