NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

Mamagaru:  అన్నయ్య గంగాధర్ మన పై పోర్షన్లు ఉంటున్నాడు వాణ్ణి కూడా పిలువు పనైపోతుంది అని పాండురంగ అంటాడు. నాకు పని ఉంది రా అంటూ సుధాకర్ వెళుతూ ఉంటాడు. అదేంటండీ ఇక్కడ దాకా వచ్చి గంగాధర్ ని పిలవకపోతే ఎలా అంటున్న వినిపించుకోకుండా వసంతను తీసుకొని వెళ్ళిపోతాడు. అన్నయ్య ఏంటి గంగాధర్ ని పిలవకుండా వెళ్ళిపోయాడు అని పాండురంగ అంటాడు. పనుందన్నాడు కదండి మళ్లీ వచ్చి పిలుస్తాడేమో లే అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

చంగయ్య రైస్ మిల్లు ఓనర్ కి అప్పిచ్చిన పిచ్చయ్య కాడికి వెళ్తాడు. ఏంటి చంగయ్య ఎలా వచ్చావ్ అని అతను అంటాడు. అప్పు వసూలు చేద్దామని వచ్చాను అని చంగయ్య అంటాడు. నీకు నేను అప్పు లేను కదా చంగయ్య అని అతను అంటాడు. నువ్వు నాకు అప్పు లేవు కాని నేను రైస్ మిల్లులో పనిచేస్తున్నాను ఆ ఓనర్ కి నువ్వు 50,000 అప్పు ఇవ్వాలంట కదా నన్ను వసూలు చేయమన్నాడు డబ్బులు కడతావా నీ సామానంతా బండిలో వేసుకొని వెళ్లిపోమంటావా అని చంగయ్య బెదిరిస్తాడు. చంగయ్య నా దగ్గర డబ్బులు లేవు అని అతను అంటాడు. లేకపోతే నన్నేం చేయమంటారు  ట్రక్కు ఉంది మనుషులు ఉన్నారు సామాన్లు వేసుకుని వెళ్లిపోతాను అని చంగయ్య అనడంతో నా దగ్గర అంత డబ్బు లేదు కానీ 40 వేలు ఇస్తాను అని అతను అంటాడు. చంగయ్య వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్లి సార్ అప్పు 30 వేల ఇస్తానన్నాడు లేదంటే నీ మీద నా మీద కేసు పెడతానన్నాడు అని చంగయ్య చెబుతాడు. ఇద్దరం జైలుకు వెళ్లడం అవసరమంటావా సార్ ఇచ్చిన డబ్బు తీసుకుందాం అని చంగయ్య నచ్చ చెబుతాడు. సరే ఏం చేస్తాం ఆ 30000 వేలు వసూలు చేసుకోరా అని వాళ్ళ ఓనర్ అనగానే మళ్లీ అతని దగ్గరికి వెళ్లి ఆ 40 వేలు తీసుకొని ఓనర్ దగ్గరికి వచ్చి 25000 వేలు ఇస్తాడు. ఇదేంటయ్యా 25000 వేలు ఇచ్చావు అని వాళ్ళ ఓనర్ అంటాడు. నీ దగ్గర కమిషన్ తీసుకున్నాను నాన్న నేరం నాకెందుకండీ అందుకే నేనే తీసుకొని 25000 వేలు మీకు ఇచ్చాను అని చంగయ్య వెళ్ళిపోతాడు. కమిషన్ 5000 మనం నొక్కేసింది 10000 పెళ్లి ఖర్చులకు ఫోను ఇంకా మిగులుతాయి అని చంగయ్య అనుకుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

సుధాకర్ గంగాధర్ కి ఫోన్ చేసి మన సిరికి పెళ్లి సంబంధం కుదిరింది రా నువ్వు రా అని చెబుతాడు. అవునా అన్నయ్య చాలా మంచి శుభవార్త చెప్పావు నేను గంగ వస్తాం అని గంగాధర్ అంటాడు. రేయ్ పాండు కి కూడా చెప్పాను ఇద్దరు కలిసి రండి నువ్వు మాత్రమే  రా అని సుధాకర్ అంటాడు.అలాగే అన్నయ్య మేము తప్పకుండా వస్తాం అని గంగాధర్ అంటాడు. నేను ఒక్కడినే రా అంటుంటే వీడేంటి మేము వస్తాము అంటున్నాడు నాన్నేమో గంగను వద్దన్నాడు వీడేమో గంగను తీసుకొని వస్తానంటున్నాడు ఇది పెద్ద ధర్మ సంఘటన లాగా ఉందే ఏం జరుగుతుందో చూద్దాం అని సుధాకర్ అనుకుంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

అదేంటి వసంత ఇంటిదాకా వెళ్లి గంగాధర్ ని పిలవకపోవడమేంటి అని దేవమ్మ అంటుంది. నాకేమీ తెలియదు అత్తయ్య ఇంతలో మామయ్య గారు ఫోన్ చేశాడు ఈయన పని ఉందంటూ బయటికి వచ్చాడు అని వసంత అంటుంది.సుధాకర్ గంగాధర్ కి చెప్పలేదంట ఎందుకురా అని దేవమ్మ అడుగుతుంది. అమ్మ నేను ఆఫీస్ లాకర్ నా దగ్గరే ఉంది అందుకే వెళ్లాల్సి వచ్చింది గంగాధర్ కి ఫోన్ చేసి చెప్పానమ్మా అని సుధాకర్ అంటాడు. అదేంట్రా ఇంటిదాకా వెళ్లి ఫోన్ చేయడమేంటి ఇంటికి వెళ్లి చెప్తే బాగుండేది అని దేవమ్మ అంటుంది.కావాలంటే చూడమ్మా ఫోన్ చేశాను వసంత నువ్వు చూడు అమ్మ నమ్మడం లేదు అని సుధాకర్ అంటాడు. నీ మీద నమ్మకం లేక కాదురా నాది భయం పిలిచాను అంటున్నావు గా అది చాల్లే అని దేవమ్మ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

మహేష్ రోడ్డు మీద వెళ్తూ ఉండగా అప్పిచ్చిన వాళ్ళు వచ్చి బండిని పట్టుకుంటారు. అన్నా మీరేంటన్న ఇలా వచ్చారు అని మహేష్ అంటాడు.అప్పు తీసుకుని ఎన్నిరోజులు అయ్యింది రా ఎప్పుడు ఇస్తావు అని అతను అంటాడు. డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నయ్య తర్వాత ఇస్తాను అని మహేష్ అంటాడు. అయితే అప్పటిదాకా నీ బండి మా దగ్గరే ఉంటుంది రా అని అతను అంటాడు. ఇంతలో రాజేష్ ఫోన్ చేస్తాడు. వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి అంటూ మహేష్ ఫోన్ ఎత్తి జగనన్న చెప్పన్నా ఏంటి సినిమాలో నీకు ఒక యాక్టర్ కి మనిషి కావాలా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తాను లే అన్న అని అంటాడు.

Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights
Mamagaru Today Episode April 19 2024 Episode 191 highlights

మహేష్ అన్న నీకు పూరి జగన్నాథ్ అన్న తెలుసా నాకు ఒక్క సినిమాలో రౌడీ గా యాక్టింగ్ చేసే అవకాశం ఇప్పించిన్న అని అంటాడు అతను. చూస్తుంటే నువ్వు కూడా బాగానే ఉన్నావ్ సరే జగన్ అన్నతో చెప్పి నిన్ను హైదరాబాద్ పంపిస్తా పెద్ద స్టార్ అయిపోతావ్ అని మహేష్ అంటాడు. మరి నా అప్పు సంగతి అని మహేష్ అంటాడు. అన్నా నీ అప్పు ఎప్పుడో మాఫీ చేశాను అన్న నువ్వు వెళ్లొచ్చు అని అతను అంటాడు. బండిలో పెట్రోల్ లేదు అని మహేష్ అంటాడు. అన్నా బండిలో పెట్రోల్ ఫుల్ గా కొట్టించుకో అన్నా అని అతను డబ్బులు ఇస్తాడు.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu