NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: గంగా మహల్ ని చూసిన చంగయ్య కోపంతో రగిలిపోతాడు..

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

Mamagaru:  గంగని పైకి తీసుకువచ్చి ఈ గంగా మహల్ ని కోసం కట్టిందే గంగ అని గంగాధర్ అంటాడు. ఆనందంతో బంగిపోయిన గంగా గంగాధర్ ని గట్టిగా వాటేసుకొని థాంక్స్ అండి అని సంతోషంతో చెప్తుంది. ఇప్పుడే అయిపోలేదు గంగా ఇంకా చాలా ఉన్నాయి చూద్దువు గాని రా అని గంగాధర్ ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అయ్యో ఎంత బాగుందో ఇల్లు ఇంత తక్కువ టైంలో ఇంత బాగా ఎలా అరేంజ్ చేశారు అని గంగా మురిసిపోతుంది. ఇంకా ఒకటి ఉంది చూడు అని గంగాధర్ చప్పట్లు కొట్టగానే లైట్ వెలుగుతుంది. థాంక్స్ చాలా థాంక్స్ అండి అని గంగ అంటుంది. ఒక్క ట్యాంక్స్ ఏనా అని గంగాధర్ అంటాడు. ఇంకేం కావాలి అంటూ గంగా సిగ్గుపడుతూ గంగాధర్ నుదుటిమీద ముద్దు పెడుతుంది. గంగాధర్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడు.గంగ ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఈ గంగా మహల్ ముందు ముగ్గు చాలా సూపర్ గా వేశావు గంగ అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights
Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

అంతేనా అని గంగా సిగ్గుపడుతూ అంటుంది. సారీ వీటన్నిటికంటే మా గగ చాలా ముద్దుగా ఉంది అంటాడు గంగాధర్. కట్ చేస్తే, గంగాధర్ ఫోటోలు వర్షా ఫోన్ కి పెడతాడు. అది చూసి అంజమ్మ వర్షా వాళ్ళ నాన్న ముగ్గురు సంతోషిస్తారు. ఎక్కడికైనా పిక్నిక్ వెళ్లారా చాలా బాగుంది గుడిస అని అంజమ్మ అంటుంది. గుడిసె కాదమ్మా గంగా మహల్ అంట అని వర్షా అంటుంది. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు మనం సంతోషించాలి అంజమ్మ మనకు కష్టాలు ఉన్నాయని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాము ఇలాంటి అల్లుడు దొరికినందుకు సంతోషపడాలి అని వాళ్ళ ఆయన అంటాడు. సరే మనం కూడా ఒక సెల్ఫీ దిగుదాము అని వాళ్ళు ముగ్గురు ఒక సెల్ఫీ దిగుతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights
Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

గంగాధర్ ఇల్లు చూడడానికి వసంతా శ్రీలక్ష్మి పాండురంగడు అందరూ వస్తారు. సూపర్ గా కట్టాడు కదా శ్రీ లక్ష్మీ ని పాండురంగడు అంటాడు. గంగాధర్ నిజంగా నీ ఇల్లు సూపర్ గా ఉందిరా అని సుధాకర్ అంటాడు. ఎంతైనా గంగ వదిన లక్కీ ఫెలో అని వాళ్ళ చెల్లెలు అంటుంది.ఇంతలో చoగయ్య వస్తాడు. చూశారా అండీ మన గంగాధర్ ఎంత బాగా కట్టాడో అని అంటుంది దేవమ్మ. దేవమ్మ నీకోసం ఎప్పుడైనా ఇలా ఆలోచించాడా పెళ్ళాం కోసం చేశాడు అని కోపంగా అంటాడు చంగయ్య. నాకోసం చేయకపోతే ఏముందండి గంగ కోసం చేశాడు అది చాలు అని దేవమ్మ అంటుంది. రేయ్ మీ ఇద్దరికీ ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని చoగయ్య అంటాడు. అంటే అది కాదు నాన్న అని సుధాకర్ అంటాడు. మీ కన్నా గంగాధర్ చాలా నైపుణ్యం కలవాడు ఒరేయ్ గంగాధర్ నీకు ఆలోచన ఎలా వచ్చింది రా అని చoగయ్య అడుగుతాడు.

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights
Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

అంటే ఒకరోజు వర్షం వచ్చి గంగా తడిసిపోయింది నాన్న అందుకే ఇలా ఆలోచన చేశాను అని గంగాధర్ అంటాడు. నీలో టాలెంట్ గంగ గుర్తించింది ఏమాత్రం ఖర్చయిందేంటి అని చoగయ్య అంటాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు నాన్న అని గంగాధర్ అంటాడు. ఇది ఇంకా సంతోషించాల్సిన విషయం రా అని చoగయ్య అంటాడు. రేయ్ గంగాధర్ నీ టాలెంట్ నచ్చింది గంగ మీద నీకున్న ప్రేమ నచ్చింది కానీ రెండు విషయాలు నచ్చలేదు రా ఈ గుమ్మం ఇంటి ముందు ముగ్గు అసలు నచ్చలేదు అని గడపని తన్నేస్తాడు ముగ్గుని చెడిపేస్తాడు చంగయ్య. నాన్న ఏం చేస్తున్నారు అని గంగాధర్ అంటాడు. పిచ్చెక్కిపోయిన వాడిలా చంగయ్య గంగా మహల్ అని బోర్డును తీసి విరగొట్టి మీరెవరు మాట్లాడకండి చంగయ్య ఇంటికి ఒకే గుమ్మం ఒకే ముగ్గు ఈ ఇంట్లో రెండో గుమ్ము రెండో ముగ్గు ఉండకూడదు నేను అది భరించలేను అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights
Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

నాన్న మాకు గది లేదు అందుకని నేను ఇలా కట్టాను అని గంగాధర్ అంటాడు. నీకు గది కావాలంటే గుడిసె వేసుకుంటావో ఇల్లే కట్టుకుంటావో కానీ దానికి ఇంకో పేరు ఉండకూడదు ఇంటికి సింహద్వారం ఒకటే ఉండాలి వేరొకటి ఉండకూడదు ఏంటి కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారా అని చoగయ్య కోపంతో అంటాడు. చూడు గంగ వాడి తెలివితేటల్ని ఇంకొక రకంగా ఉపయోగించుకో అని చంగయ్య శ్రీలక్ష్మి వసంతల వైపు చూస్తూ ఏంటమ్మా కోడళ్ళు ఇదంతా చూసి  సంబరం పడిపోతున్నారా ఈ తప్పు చేయకండి, ఏం దేవమ్మ  అన్ని చూస్తూ నువ్వు నోరు మెదపకుండా ఊరుకున్నావా ఇది నువ్వు చేస్తున్న పెద్ద తప్పు చంగయ్య ఇంటికి ఒకటే గుమ్మం ఒకటే ముగ్గు అందరూ గుర్తుంచుకోండి అని అంటాడు చoగయ్య. చంగయ్య చేసిన పనికి అందరూ బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే వర్షా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి

Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights
Mamagaru Today Episode December 02 2023 Episode 72 Highlights

చదువుకుందాం అని వెళుతుంది. వెళ్తుండగా బ్యాగు చినిగి బుక్కులు కింద పడిపోతాయి. బ్యాగు కుట్టించుకోవడానికి అమ్మను డబ్బులు అడగాలని లోపలికి వస్తుంది వర్ష. ఏంటి  అంజమ్మ ఈరోజు మందులు ఇవ్వలేదు అని అంటాడు వర్షా వాళ్ళ నాన్న అంటాడు. ఏమీ లేదండి హాస్పిటల్ నుంచి వచ్చాక అమ్మాయి ఇచ్చిన డబ్బులు అయిపోయాయి ఇంట్లో సామాన్లు కూడా నిండుకున్నాయి అని అంజమ్మ అంటుంది. ఈ పరిస్థితుల్లో అమ్మను డబ్బులు ఎలా అడగను అని వర్షా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఇలా అయితే బాగోలేదు ఈ పరిస్థితి మార్చాలి అని ఆలోచిస్తుంది వర్ష. కట్ చేస్తే గంగ వాళ్ళ ఇంట్లో అందరూ అన్నం తినడానికి కూర్చుంటారు..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella