NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 08 2023 Episode 77: పార్టీ చేసుకుంటున్నా ఇంట్లో వాళ్ళని చంగయ్య కనిపెడతాడా?.

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

Mamagaru December 08 2023 Episode 77: చంగయ్య పడుకున్నది చూసి దేవమ్మ మెల్లగా లేసి మేడ మీదికి వెళుతుంది. అమ్మ నాన్న నిజంగానే పడుకున్నాడా నాన్న ను అసలు నమ్మలే మామ్మ అని పాండురంగ అంటాడు. మనకు ఉద్యోగాలు వచ్చిన సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నాము అని ఇంట్లో వాళ్ళందరూ సంబరపడిపోతారు. అత్తయ్య మా విజయానికి కారణం మీరే కాబట్టి కేక్ మీరే కట్ చేయండి అని గంగ అంటుంది. దేవమ్మ కేక్ కట్ చేస్తుంది. ఇంతలో చ0గయ్య కి మెలకువ వస్తుంది. ఇంట్లో దేవమ్మ కనిపించపోయేసరికి అటు ఇటు చూసి పైకి వెళ్తాడు చ0గయ్య. పైకి వెళ్లేసరికి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపిస్తారు. గాలి బలే చల్లగా ఉందని అటు ఇటు తిరుగుతా ఉంటాడు చంగయ్య.

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights
Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

కేకు కనిపించకుండా ఇంట్లో వాళ్ళందరూ కవర్ చేస్తూ ఉంటారు. ఏంటి అందరూ కట్టకట్టుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు చ0గయ్య. ఏవో మా సమస్యలు చెప్పుకుంటున్నాం మామయ్య గారు అని శ్రీలక్ష్మి అంటుంది. అంటే నీకున్న సమస్యల కోసం అందరూ ఇక్కడ సమావేశమయ్యారా అని చ0గయ్య అంటాడు. అవునండి అందరూ ఇక్కడ సమావేశమై కాస్త  ప్రాబ్లం తీర్చుకుంటారు అందుకే నేను కూడా ఇలా వచ్చాను అని దేవమ్మ అంటుంది. నాకు దేవుడు కాస్త తెలివిని ఇచ్చాడు నన్ను కూడా పిలుచుంటే బాగుండేది కదా అని చ0గయ్య అంటాడు. మీరేంజికి తగ్గట్టు ఈ సమస్యలు లేవండి అని దేవమ్మ అంటుంది. చ0గయ్య ఎటు నడిస్తే అటు అందరూ నడుస్తూ ఉంటారు. ఏంటో మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు తలపోటుగా ఉంది కానీ ఏదో ఉంది మీ వ్యవహారం నాకు అంతుపట్టడం లేదు అని చ0గయ్య అంటాడు. ఏమీ లేదు నాన్న అని అందరూ అంటారు. ఏదో ఉంది అదేంటో కనిపెడతా అనుకుంటూ చ0గయ్య కిందికి వెళ్ళిపోతాడు.

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights
Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

కట్ చేస్తే, ఇంకో గంట సేపు  వర్క్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి ఈ లాప్టాప్ వసంత అక్కకి ఇచ్చి రావాలి మామయ్యకు తెలియకుండా జాబ్ లు చేయడం కొంచెం భయంగా ఉంది సంతోషంగా ఉంది ఈ లక్ష రూపాయలు వస్తే మా ఆయనకి మంచి గిఫ్ట్ కొనియాలి అని గంగ అనుకుంటుంది. అక్క నా వర్క్ అయిపోయింది నువ్వు నీ వర్క్ చేసుకో అని వసంతకి లాప్టాప్ ఇస్తుంది గంగ. అప్పుడే నీ ప్రాజెక్ట్ అయిపోయిందా గంగ అని వసంత అడుగుతుంది. అవును అక్క ఒక్క గంట వర్క్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి అని గంగ చెప్తుంది. ఎంత మంచి మాట చెప్పావు గంగ ఇన్ని రోజులు మిమ్మల్ని ఉద్యోగాలు చేయనీయకుండా మీ మామయ్య గారు కట్టడి చేశారు గంటలో లక్ష రూపాయలు సంపాదించావా అని గంగని మెచ్చుకుంటుంది దేవమ్మ. అత్తయ్య మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి  20 వేల రూపాయలు ఇచ్చేసి వస్తాను అని గంగ వెళ్ళిపోతుంది.

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights
Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

కట్ చేస్తే, వసంత నాకు లంచ్ బాక్స్ కట్టు టైం అవుతుంది అని సుధాకర్ అంటాడు. వసంత సుధాకర్ కి లంచ్ బాక్స్ కట్టి ఇస్తుంది. ఏం కర్రీ వండావు వసంత అని సుధాకర్ అడుగుతాడు. ఇప్పుడే చెప్తే తినేటప్పుడు కిక్కు పోతుందండి అని వసంత అంటుంది. ఇదెప్పటినుంచి వసంత అని సుధాకర్ అంటాడు. గంగ నాకు చెప్పిందండి అందుకే ఫాలో అవుతున్నాను అని వసంత అంటుంది. సుధాకర్ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights
Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

గంగ గంగాధర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. హాయ్ బావగారు ఎలా ఉన్నారు అని వర్షా అడుగుతుంది. బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అత్తయ్య అని గంగాధర్ అంటాడు. మేము బాగానే ఉన్నాం బాబు ఏంటి మీరు ఇలా వచ్చారు అని అంజమ్మ అడుగుతుంది. ఏమీ లేదమ్మా నేను ఆన్లైన్లో జాబ్ చేస్తున్నాను వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారు మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాము అని గంగ అంటుంది. ఇదేంటి గంగ నీకు వచ్చిన అడ్వాన్స్ కూడా మాకు ఇస్తే ఎలాగమ్మా అని అంజమ్మ అంటుంది. ఆ లాప్టాప్ గొడవేంటి గంగ అని అంజమ్మ అడుగుతుంది. ఏమీ లేదమ్మా  ఆన్లైన్ జాబ్ కోసమే ఆ లాప్టాప్ మీ అల్లుడుగారు తెచ్చారు దాన్ని చూసి మామయ్య అడిగితే మా ఇంటి కాడ నుంచి తెచ్చుకున్నాను సినిమాలు చూడడానికి అని చెప్పాను అని గంగ అంటుంది. అందుకే మన ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేశాడు మామయ్య గారు అని గంగ అంటుంది. అందుకే అక్క నేను కూడా ఆ లాప్టాప్ నాదే మా అక్కకు ఇచ్చాను అని చెప్పాను అని వర్షం అంటుంది. బాగా కవర్ చేసావు వర్ష అని గంగ అంటుంది. ఏంటోనమ్మా ఎప్పుడు మీ మామగారు మాడుతాడో నీ సమస్యలు తీరుతాయో అని అంజమ్మ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights
Mamagaru Today Episode December 08 2023 Episode 77 Highlights

ఇదేంటి గంగ ఇచ్చిన లాప్టాప్ ఇక్కడే పెట్టాను కదా కనిపించట్లేదు ఏంటి అని వసంత రూమంతా వెతుకుతుంది. కంగారు పడిపోయి అక్క అత్తయ్య ఇక్కడ లాప్టాప్ పెట్టాను మీరు ఏమైనా చూసారా అని అంటుంది వసంత. లాప్టాప్ కనిపించకపోవడం ఏంటమ్మా వెళ్లి వెతుకుదాం పదండి అని దేవమ్మ అంటుంది. సరే వెళ్లి వెతుకుదాం పదండి అని శ్రీలక్ష్మి అంటుంది. వాళ్ళ ముగ్గురు హాల్ అంతా రూమంతా వెతుకుతారు కానీ లాప్టాప్ కనిపించలేదు. ఇంతలో చ0గయ్య వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని తిరుగుతూ వాళ్లని గమనిస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి చూసి మామయ్య గారు వచ్చాడు అత్తయ్య అని సైగ చేస్తుంది. వెతుకుతున్న ముగ్గురు సడన్గా ఆగిపోతారు. ఏం చేస్తున్నారు అని చ0గయ్య సైగ చేసి అడుగుతాడు. వాళ్ళు ముగ్గురూ ఏమీ మాట్లాడకుండా నిలబడి పోతారు..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella