NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 27 2023 Episode 93: తాగిన మైకంలో మహేష్ ని కొడుతున్న గంగాధర్..

Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights

Mamagaru December 27 2023 Episode 93: మీ కళ్ళ ముందు నేను తిరుగుతూ ఉంటే అయ్యో పాపం పిల్లకి అబద్ధం చెప్పాము ఒక్క నిజం చెప్తే బాగుంటుంది అనిపించలేదు కదా మీ అందరికీ అని గంగా అడుగుతుంది. గంగ అడిగిన ప్రశ్నకి ఎవరికి నోట మాట రాక మౌనంగా నిలబడిపోతారు. కట్ చేస్తే, రేయ్ మహేష్ నేను దుబాయి వెళ్లడానికి డిగ్రీ సర్టిఫికెట్ కావాలని దొంగతనం చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదరా నాకు పెళ్లి వద్దు మరో అంటే మా నాన్నతో కుమ్మక్కయి నాకు పెళ్లి చేసిది నువ్వే కదరా అని మహేష్  గంగాధర్ ని కొడతాడు.రేయ్ గంగ ఏది చేసిన పెద్ద వాళ్ళు మన మంచికే కదరా ఏదో మీ నాన్న మాట సహాయం చేయమంటే చేశాను అని మహేష్ అంటాడు. రేయ్ మహేష్ నువ్వు అలా చేయకపోతే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా గంగముందు తలదించుకునే వాడిని కాదు కదరా అని ఆ చంప ఈ చెంప  వాయిఇస్తాడు గంగాధరం. రేయ్ గంగ నువ్వు మందు కొడుతున్నావా నన్ను కొడుతున్నావా ఏదో చిన్న తప్పు చేస్తే ఇంతలా కొడతా రారా నీకు మందు ఎక్కువైంది ఇంటికి వెళ్దాం పద అని మహేష్ అంటాడు. మా నాన్నతో నువ్వు కుమ్మకై నాకు పెళ్లి చేశారు కదరా నిన్ను జీవితాల్లో క్షమించంను రా నీ గంగాధర్ అంటాడు. చెప్పిందే పదేపదే చెప్తావ్ ఏంటి రా నీకు మందు ఎక్కువైంది వెళ్దాం పద అని మహేష్ ఆటో బుక్ చేసుకుని ఆటోలో ఇంటికి తీసుకువస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights
Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights

ఏంటమ్మా గంగాధర్ ఎటో వెళ్లి ఇంతవరకు రాలేదు ఇంత నైట్ అయిపోయింది అని పాండురంగ అంటాడు. నాకేం తెలుసురా ఎటు వెళ్ళాడో వస్తాడు అనుకున్నాను కానీ ఇంత చీకటి దాకా రాకుండా ఉంటాడా నేను మాత్రం ఎందుకు అనుకుంటాను అని దేవమ్మ అంటుంది. ఇంతలో మహేష్ గంగాధర్ ని తీసుకొని లోపలికి వస్తాడు. రేయ్ మహేష్ నువ్వు కూడా ఏంట్రా అవన్నీ తాగుబోతుని చేసావు నీతో పాటు వాడు మందు తాగడం నీకు తెలుసు కదా అని సుధాకర్ అంటాడు. మందు తాగే కాడనేమో వీడు కొట్టాడు ఇప్పుడేమో వీలు తిడుతున్నారు మందు తాగింది వాడైతే నాకు తిట్లు దెబ్బలా అని మహేష్ అనుకుంటాడు. అన్నయ్య నేను చెప్పేది వినండి అన్నయ్య నేను వాడికి మందు పోయలేదు అని మహేష్ అంటాడు. రేయ్ గంగాధర్ ఏంట్రా ఈ పిచ్చి పని ఎందుకురా ఇంత తాగావ్ నిలబడలేకపోతున్నావు ఎంత తాగావ్ రా అని పాండురంగ అంటాడు.రేయ్ నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు రావు నాన్న చూస్తే కోప్పడతాడు అని సుధాకర్ మహేష్ ని అంటాడు. రేయ్ గంగ ఏంట్రా ఈ కొత్త అలవాటు రా గంగ చూస్తే ఇంకెంత బాధపడుతుంది రా అని దేవమ్మా అంటుంది. అమ్మ నేను గంగ దృష్టిలో దుర్మార్గుడ్డునైపోయాను గంగ దగ్గర నిన్ను జీరో అయిపోయానమ్మా ఏం చేయను తట్టుకోలేక తాగేశాను అని గంగాధర్ అంటాడు. రేసుధాకర్ వాడు నడవలేకుండా ఉన్నాడు తీసుకువెళ్లి పైన పడుకోబెట్టి రండి అని దేవమ్మా చెప్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights
Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights

సుధాకర్ పాండురంగ గంగాధర్ ని తీసుకొని పైకి వెళ్లి మంచంలో పడుకోబెట్టి వస్తారు. గంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించు గంగా అని కలవరిస్తూ ఉంటాడు గంగాధర్. గంగాధర్ ని రూమ్ లో పడుకోబెట్టి వస్తూ ఉండగా చంద్రయ్య చూస్తాడు రే పాండురంగ ఇలా రా తాగావా రా అని వాసన చూసి చెంప మీద ఒకటి ఇచ్చి ఎప్పటినుంచి తాగుతున్నావ్ రా ఇంట్లో కూడా తాగుడు మొదలు పెట్టావా అని చ0గయ్య తిడతాడు. చూసావా శ్రీలక్ష్మి తాగింది ఆ గంగాధర్ అయితే నాకు దెబ్బలు తగిలాయి అని పాండురంగ అంటాడు. మీకు ఈ తాగుడు అలవాటు లేకపోతే దెబ్బ పడేది కాదు కదా అండి అయినా మందు తాగని వాడిలా మాట్లాడుతున్నారు ఏంటి చేసిన దానికి బాగానే శిక్ష పడింది ఇంక సర్ది చెప్పుకోకండి అని శ్రీ లక్ష్మీ వెళ్ళిపోతుంది. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే ఇక గంగాధర్ గాడి పరిస్థితి ఎలా ఉంటుంది పురాణాలలోనే భార్య భర్త మాట విన్నట్టు మనకు అనిపిస్తుంది కానీ ఈ కలియుగంలో మాత్రం భార్య మాట భర్త వినాలి అని పాండురంగ  డుఅనుకుంటాడు. కట్ చేస్తే

Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights
Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights

గంగా ఏడుస్తూ కూర్చుంటుంది గంగాధర్ కొద్దిసేపటికి లేసి కళ్ళు తుడుచుకొని గంగా దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుంటాడు. నన్ను ముట్టుకోకండి అని గంగా కోపంగా అంటుంది. గంగ నీకు నిజం చెప్పాలని ప్రతిసారి ఎన్నో ఆటంకాలు వచ్చి చెప్పలేకపోయాను అని గంగాధర్ అంటాడు. చూశారా ఇప్పుడు కూడా నేను నిజం చెప్పాలని ప్రయత్నించానని సమర్థించుకుంటున్నారే కానీ గంగా నాది తప్పు అయిపోయింది క్షమించు ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని మీ నోట వస్తుందా ఆ నిజం తెలియగానే గంగా నది తప్పు అయిపోయిందని అంటారని అనుకున్నాను కానీ మీరు ఇప్పటికీ కూడా తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారుపైగా తాగు వచ్చి మళ్లీ నాతో మాట్లాడుతున్నారా అని గంగా అంటుంది.గంగ బాధ తట్టుకోలేక తాగాను అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights
Mamagaru Today Episode December 27 2023 Episode 93 Highlights

మీకేనా బాధ ఉండేది నాకు లేదా మరి నాకు కూడా బాటిల్ తీసుకురాక పోయారు నేను కూడా తాగే దాన్ని ఓ ఎందులో కూడా మీ పురుష సహకారమేనా మగవాళ్ళు అయితే మందు తాగాలి ఆడవాళ్ళు అయితే తాగకూడదు ఇంత దాకా వచ్చిన కానీ నీకు నన్ను మోసం చేశానని అనిపించట్లేదు కదా రేపటినుంచి లోకం దృష్టిలో మనం భార్యాభర్తలం కానీ మనం మాత్రం ఎప్పటికీ భార్యాభర్తలం కాలేము అని గంగా అంటుంది. గంగా ఏంటి అలా అంటావు నేను చేసింది తప్పే కావచ్చు కానీ ఎందుకు చేశాను నాకు తెలుసు అని గంగాధర్ అంటాడు. చూడండి మీరు చేసిన పనికి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లి పోవాల్సింది కానీ ఎందుకు వెళ్లట్లేదు తెలుసా నేను పుట్టింటికి వెళ్తే మా అమ్మ నాన్న నన్ను చూసి బాధపడతారు వాళ్ళ బాధ చూడలేక ఇంకా ఇక్కడే ఉంటున్నాను రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడకూడదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని గంగా తెగేసి చెప్తుంది. కట్ చేస్తే,

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N