NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 12 2024 Episode 107: పిల్లలు కిడ్నాప్ అయ్యారని బాధపడుతున్న శ్రీలక్ష్మి, పిల్లల కిడ్నాప్ సంగతి మీ నాన్నకు చెబుదాం అంటున్న దేవమ్మ..

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

Mamagaru January 12 2024 Episode 107: ఏంటక్కా నీ కేసు వల్ల పిల్లలు కిడ్నాప్ అయ్యారు అని శ్రీలక్ష్మి అంటుంది. వదిన వాళ్లు ఏమంటున్నారు అని పాండురంగ అంటాడు. రేపు కోర్టుకు వెళ్లకుండా ఉంటే మీ పిల్లలు మీ ఇంటికి వస్తారని చెప్తున్నారయ్యా అని వసంత అంటుంది. ఇంతలో దేవమ్మ ఫోన్ చేస్తుంది. రేయ్ సుధాకర్ పిల్లలు దొరికారా మీ నాన్న ఇంటికి వచ్చాడు రా శ్రీలక్ష్మి ఎక్కడ అని అడుగుతున్నాడు తొందరగా పిల్లల్ని తీసుకొని రండి రా అని దేవమ్మ అంటుంది. అమ్మ ఇంకా పిల్లలు దొరకలేదు దొరకగానే తీసుకొని వస్తాము ఏం టెన్షన్ పడకు అని సుధాకర్ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights
Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

శ్రీలక్ష్మి నాన్న మిమ్మల్ని అడుగుతున్నాడు అంట మీరు ఇంటికి వెళ్ళండి మేము పిల్లల్ని తీసుకుని వస్తాము అని సుధాకర్ అంటాడు. పిల్లలు లేకుండా నేను వెళ్ళను బావగారు అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి నువ్వు అలా అంటే ఎలా చెప్పు పద అని పాండురంగ అంటాడు. చూశారా ఆంటీ ఈ కేసు వల్ల మన పిల్లలు కిడ్నాప్ అయ్యారు కోర్టు కేసు లని వసంత అక్క తిరగడం వల్ల ఇదంతా జరిగింది అని శ్రీలక్ష్మి ఏడుస్తుంది. అక్క నువ్వు అలా బాధపడకు పిల్లల్ని వెతికి మేము తీసుకొస్తాము మీరు ఇంటికి వెళ్ళండి అని గంగా నచ్చ చెప్తుంది. పాండురంగడు శ్రీలక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వదిన మన పిల్లల్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్లి బతిమిలాడుకుందాం అని గంగాధర్ అంటాడు. ఇదేదో బాగుంది అని వసంత అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights
Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

పాండురంగ శ్రీ లక్ష్మీ ఇంటికి వస్తారు. రేయ్ రంగా పిల్లలు దొరికారా అని దేవమ్మ అడుగుతుంది. లేదమ్మా పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు అని జరిగిందంతా పాండురంగా దేవమ్మకి చెప్తాడు.రే పాండురంగ ఈ విషయం మీ నాన్నకు చెబుదాం రా అని దేవమ్మ అంటుంది. ఈ విషయం నాన్నకు తెలిస్తే వీళ్ళని ఉద్యోగాలు మానేపిస్తాడమ్మా వద్దు అని పాండురంగా అంటాడు. ఇంతలో చంగయ్య వచ్చి శ్రీలక్ష్మి చూడు పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో వెళ్లి వాళ్ళ సంగతి చూడు అని చ0గయ్య అంటాడు. అలాగే మామగారు అని శ్రీలక్ష్మి పిల్లల దగ్గరికి వెళ్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights
Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

శ్రీలక్ష్మి పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఏడుస్తుంది. చ0గయ్య ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చి హలో వినపడట్లేదు పద్మాకర్ గారు చెప్పండి అని అంటాడు. ఏమిటో నండి మన కాలంలోనైతే ల్యాండ్ ఫోన్లు చాలా బాగా వినపడేవి అని ఫోన్లో మాట్లాడుతాడు చంగయ్య. శ్రీ లక్ష్మీ పిల్లలకు ట్యూషన్ చెప్పి ఇక మీకు ట్యూషన్ ఈరోజుతో అయిపోయింది వెళ్ళండి అని శ్రీ లక్ష్మీ పిల్లల్ని పంపించేస్తుంది. చ0గయ్య ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోతాడు. పాండురంగ వచి శ్రీ లక్ష్మీ ఎందుకు ఏడుస్తున్నావ్ శ్రీలక్ష్మి ఏడవకు అని ఓదార్చి తనని లోపలికి తీసుకువెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights
Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

గంగ గంగాధర్ వసంత సుధాకర్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు.  నేను కిడ్నాప్ చేశానని అంటున్నారు చిన్నపిల్లలు నాకు చాలా ఇష్టం మేడం నేనెందుకు కిడ్నాప్ చేస్తాను నేను అసలే అహింసవాదిని మీ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు వాళ్ళు చెప్పినట్టు చేయండి మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు అని శ్రీధర్ అంటాడు. అంటే మీరు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకుంటున్నారా అని గంగా అడుగుతుంది. నీకు ఇంత క్లియర్ గా చెప్పిన అర్థం కావట్లేదా మేడం నేను పిల్లల్ని కిడ్నాప్ చేయలేదు ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళు ఏం చెప్పారో అది చేయండి అని వసంతను పిల్లలుని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమన్నారు అమ్మ అని అడుగుతాడు శ్రీధర్. రేపు కోర్టుకు వెళ్లకుండా ఉంటే మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు అని చెప్పారండి అని వసంత అంటుంది. మరి అయితే ఇంకేంటి కోర్టులో విషయం తేలేదాకా మీ పిల్లలు మీ ఇంటికి రారు వాళ్ళు చెప్పినట్టు చేయండి ఇలా మా ఇంటికి వచ్చి మీరు నన్ను బెదిరించారని తెలిస్తే కేస్ అవుతుంది నీకు తెలియందేముందమ్మా లాయర్ అమ్మ అని శ్రీధర్ అంటాడు. రేయ్ పిల్లల్ని నువ్వే కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావా అని గంగాధర్ అతని మీదకి వెళ్తాడు.

Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights
Mamagaru Today Episode January 12 2024 Episode 107 Highlights

మీరు నా మీదికి వస్తే కేసు పెట్టాల్సి ఉంటుంది మర్యాదగా వెళ్లి మీ పిల్లల్ని వెతుక్కోండి అని శ్రీధర్ అంటాడు. గంగాధర్ నువ్వు కాసేపు ఆగయ్య అని వసంత అంటుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం చెప్పారో అది చేయండి మేడం మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు వాళ్ళు క్లియర్ గానే చెప్తున్నారు కదా అని అతను అంటాడు. అర్థమైంది వసంత అతనికి మనం చెప్పేది అర్థమైనా తెలియనట్టు నటిస్తున్నాడు పదండి అని సుధాకర్ అంటాడు.  ఒక్క నిమిషం మేడం ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారాలు చేయలేదు క్షమించండి మీరేమో బాధలో ఉన్నారు వెళ్లి పిల్లల్ని వెతుక్కోండి మీ పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శ్రీధర్ అంటాడు. వాళ్లు నలుగురు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అహింసో పరమో ధర్మః అని శ్రీధర్ అనుకుంటాడు.కట్ చేస్తే,చంగయ్య తన షర్ట్ ను చూసి అరెరే పిల్లలకు చాక్లెట్ తెచ్చాను ఇవ్వడం మర్చిపోయాను అని పిల్లలు ఎక్కడ ఉన్నారు మీ కోసం చాక్లెట్ తెచ్చాను రండి అని పిలుస్తాడు..

 

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella