NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 26 2024 Episode 170: రాముడు అడవికి వెళ్ళిన సహాయం కోరలేదు అంటున్న చంగయ్య, గృహప్రవేశం చేసిన గంగా గంగాధర్..

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

చాలా థాంక్స్ సార్ అని గంగ అంటుంది. పర్వాలేదమ్మా మంచి రోజు చూసుకుని ఇంట్లోకి వచ్చేయండి రెండు నెల అడ్వాన్స్ ఇవ్వండి అని అతను చెబుతాడు. సార్ మీకు ఏ రోజైనా ఒక విషయం తెలియాల్సిందే అని గంగంగాధర్ ప్రెసిడెంట్ కొడుకుని కొట్టిన విషయం అంతా చెబుతుంది. దాందేముంది గంగ దేని దారి దానిదే మీరు మా ఇంట్లో మంచిగా ఉండి నా ఇల్లును మంచిగా చూసుకొని అద్దగడితే చాలు ఆ విషయం గురించి నాకెందుకు అని పంతులుగారు అంటారు.చాలా థాంక్స్ పంతులుగారు రేపే ఇంట్లోకి వస్తాం అంటూ వెళ్లిపోతారు గంగ గంగాధర్. కట్ చేస్తే, దేవమ్మ అన్నం తినడం లేదని గంగాధర్ కి ఫోన్ చేసి అత్తయ్యతో మాట్లాడిద్దామనుకున్న వసంత గంగాధర్ కి ఫోన్ చేస్తుంది.

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights
Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

ఇంటి నుండి ఫోన్ అండి మాట్లాడండి అని గంగ గంగాధర్ కి ఫోన్ ఇస్తుంది. గంగాధర్ మాట్లాడదామని ఫోన్ తీసుకునేలోపు చ0గయ్య వస్తాడు ఇంతలో వసంత టక్కన ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ ఒకసారి ఫోన్ చేస్తాడు గంగాధర్. వసంత చంగయ్యను చూసి ఫోన్ కట్ చేస్తుంది. చ0గయ్య వసంత మంచి నీళ్లు తీసుకురమ్మని అంటాడు. వసంత మంచినీళ్లు తీసుకువచ్చి చంగయ్యకు ఇస్తూ ఉండగా మళ్లీ ఫోన్ చేస్తాడు గంగాధర్. ఆ ఫోన్ ఎత్తి చంగయ్య నీకు ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను నీకు అర్థమైందా అర్థం కాకపోయినా విను శ్రీరాముని దశరథ మహారాజు అరణ్యవాసం చేయమని అడవులకు వెళ్ళగొట్టినప్పుడు సీత కూడా తన వెంట పోయింది అక్కడికి వెళ్ళాక రావణుడు సీతాపాహరణం చేశాడు అప్పుడు రాముడు  అయోధ్యని సహాయం కోరలేదు రాయబారాలు పంపలేదు వానరసైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు గెలిచాడు అది పౌరుషం అంటే ఛీ అన్న తూ అన్న ఎందుకురా రాయబారాలు నడుపుతూ ఇలాంటి ఫోన్లు చేస్తున్నావ్ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకెప్పుడు ఫోన్ చేయకు అని చ0గయ్య ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, గంగాధర్ బాధపడుతూ ఉంటాడు గంగ నవ్వించడానికి నా చేతిలో ఒక రేఖను చూడండి ఇది చూసిన పంతులుగారు  నాకు మంచి మొగుడు వస్తాడని చెప్పాడు అలాగే మంచి మొగుడు వచ్చాడు అని చెక్కిలిగింతలు పెట్టి నవ్విస్తుంది గంగాధర్ ని. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights
Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

అమ్మ గంగాధర్ అన్నయ్యకి ఇల్లు అద్దెకు దొరికిందంట మనం పాలు పొంగిచ్చేటప్పుడు వెళ్దాం పద అని సిరిఅంటుంది.సరే పద వెళ్దాం అని సిరి దేవమ్మ బయలుదేరుతూ ఉండగా వసంత అక్కడికి వచ్చి అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. గంగాధర్ అన్నయ్యకి ఇల్లు దొరికిందంట పాలు పొంగించడానికి వెళ్తున్నాం వదిన అని సిరి చెబుతుంది.  మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మీకు మనశ్శాంతి కలుగుతుందేమో కానీ గంగాధర్ కి మామయ్య గారికి ఇంకా దూరం పెరుగుతుంది కొన్నాళ్లు మీరు గాని మేము గాని గంగాధర  కలవకుండా ఉంటే మంచిది ఇలా మనం కలుస్తున్నామని తెలిస్తే మామయ్యకి గంగాధర్ మీద దేశం పెరిగి ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వడు అని వసంత చెప్పడంతో దేవమ్మ నువ్వు చెప్పింది మంచిదేనా అమ్మ అని అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights
Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

గంగ కొత్తింట్లో పాలు పొంగించి దేవుడికి దీపారాధన చేస్తుంది. వెంకటరమణ అంజమ్మ అక్కడికి వస్తారు గంగకి ఇల్లు కిరాయి కట్టమని డబ్బులు ఇస్తారు. గంగను హగ్ చేసుకొని సంతోషిస్తుంది అంజమ్మ. అక్కడికి ఇంతలో మహేష్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పట్టుకొచ్చి నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను రా అని చూపెడతాడు. అది చూసిన గంగాధర్ బాధపడతాడు. ఇది అమ్మ నీకు ఇచ్చి రమ్మంది రా అని మహేష్ చెబుతాడు.అల్లుడుగారు ఈ ఇంట్లో అద్దెకు దిగిన వాళ్ళు కు బాగా కలిసి వస్తుందంట డబ్బులు సంపాదిస్తారంట అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights
Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

రేయ్ గంగాధర్ నీకు ఇప్పుడు ప్రాజెక్టు తప్పకుండా వస్తుంది రా ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే నాకు ఏమిస్తావురా అని మహేష్ అంటాడు. కమిషన్ కావాలా రా అని గంగాధర్ అంటాడు. కాదురా  ఒక్క పెగ్గు మందు ఇప్పించరా చాలు అని మహేష్ అంటాడు. మహేష్ కాంట్రాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి గంగాధర్ ని పరిచయం చేస్తాడు. చూడయ్యా ఈ బిల్లింగ్ చూసావుగా ఈ వర్క్ అంతా నీకే ఇస్తాను నువ్వు బాగా పని చేస్తావ్ అంట కదా కాస్ట్లీ సామాన్లు తెప్పించి పని చెయ్ కొంత అడ్వాన్స్ ఇస్తాను అని అతను చెబుతాడు. అలాగే సార్ మళ్లీ మళ్లీ పనులు చెయ్యం కాబట్టి మంచి మెటీరియల్ తెచ్చి ఫిట్టింగ్ చేస్తాను అని గంగాధర్ చెబుతాడు. సరే రేపు వచ్చి పని మొదలు పెట్టు అని ఆ బిల్డర్ చెప్పడంతో గంగాధర్ మహేష్ బయటికి వెళ్తారు.

Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights
Mamagaru Today Episode March 26 2024 Episode 170 highlights

బిల్డర్ దగ్గరికి ఒక అతను వచ్చి గంగాధర్ ని చూసి జరిగిన విషయం అంతా చెబుతాడు. వెంటనే గంగాధర్ ని పిలిచి ఏంటి గంగాధర్ ప్రెసిడెంట్ కొడుకుని కొట్టింది నువ్వేనంట కదా ఆ విషయం ఒక మాట నాకు చెప్పాలి కదా నీకు ఈ కాంట్రాక్టర్ ఇవ్వట్లేదు అని అతను అంటాడు. దానికి దీనికి పొంతన ఏంటి సార్ అని గంగాధర్ అంటాడు. చూడయ్యా ప్రెసిడెంట్ తో పెట్టుకుని ఏ పని చేయలేను నాకు కాంట్రాక్టర్లు రావు ఇక నీకు పని లేదు వెళ్ళిపో అని బిల్డర్ అంటాడు.  చాలా మంచిగా చేస్తాను పని నాకు ఈ పని ఇప్పించండి సార్ ని గంగాధర్ బ్రతిమిలాడిన అతను వినకుండా గంగాధర్ ని వెళ్ళగొడతాడు. గంగాధర్ మహేష్ బాధపడుతూ వెళ్లిపోతారు. కట్ చేస్తే,

గంగ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. నీలాంటి వాళ్ల కోసమే మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి గంగ నీకు జాబ్ వచ్చినట్టే అని వాళ్ళ సార్ చెబుతాడు..

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri