NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami December 25 2023 Episode 235: మోక్షకి కనపడనంత దూరం వెళ్లిపో పంచమి అంటున్నా వైదేహి..

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

Naga Panchami December 25 2023 Episode 235: ఇంకా గండాలు ఉన్నాయి ప్రాణహాని ఉందని నీకు తెలిస్తే చెప్పు అప్పుడు మోక్షతో కాపురం చేయమని నిన్ను బలవంతం పెట్టను అని వైదేహి అంటుంది. అలా చెప్తే బాధపడతారు వీళ్ళని బాధ పెట్టకూడదు అని పంచమి ఆలోచిస్తుంది. మా మోక్షకి గండాలు లేనప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయడానికి అడ్డం ఏమిటి నా కొడుకులు ఏదైనా లోపం ఉంటే చెప్పు పంచమి తప్పులేదు లేదంటే నినే లోపమా అందుకే బాగా ఆలోచించి చెప్తున్నాను పంచమి మా వాడి జీవితంలో నుంచి నువ్వు పక్కకు తప్పుకో,మోక్షకి మందు పెట్టావో మాయ చేసావో అని నేను అనను పంచమి కానీ వాడు నిన్ను చూడకుండా నువ్వు కనపడకుండా ఉండలేని స్థితికి దిగజారాడు

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights
Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

ఈ విషయంలో మేము ఏం చెప్పినా మోక్షకు ఎక్కదు నాకు పంచమి తప్ప మీరు ఎవరు నాకు అక్కర్లేదు అన్న ఆశ్చర్యం లేదు అని వైదేహి అంటుంది. అత్తయ్య నాకు ప్రాణం మీద తీపి లేదు మోక్ష బాబు కోసం ఆత్మార్పణ చేసుకోవడం నుంచి నాకు వేరే ఆసక్తి లేదు త్వరలోనే మీ ఆశ నెరవేరుతుంది అని పంచమి అంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని నా మీద ఒట్టేసి చెప్పు పంచమి అని వైదేహి ఒట్టు వేయించుకుంటుంది. ఈ ఒట్లు అన్ని వేసిన వెంటనే కాలగర్భంలో కలిసిపోయేవి కానీ అంతిమ నిర్ణయం దైవనిదే మీ కోరికలో న్యాయం ఉంటే తప్పక నెరవేరుతుంది అని పంచమి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights
Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

పంచమి మోక్ష దగ్గరికి వస్తుంది తనను చూడగానే మోక్ష దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటాడు. దీనికే ఇంత బాధపడుతున్నారు శాశ్వతంగా వెళ్ళిపోతానని తెలిస్తే ఎంత బాధ పడతాడో అని పంచమి అనుకుంటుంది. పంచమి చేతులు రెండు పట్టుకొని వద్దు పంచమి నువ్వు ఇంట్లో ఉంటే నిన్ను అష్ట కష్టాలు పెడతారు నువ్వు ఇంట్లో ఉండొద్దు నీ సుకుమారమైన చేతులు తట్టుకోలేవు అని మోక్ష అంటాడు. నాకు నమ్మకం ఉంది బాబు అందుకే ధైర్యంగా చెప్తున్నాను మిమ్మల్ని కాపాడుకోగలను అని పంచమి అంటుంది.ఎలా పంచమి నన్ను కాటు వేసి చంపను అని నాగదేవత నీకు మాట ఇచ్చిందా అని మోక్ష అడుగుతాడు. ఫణీంద్ర మాట ఇచ్చాడు అని పంచమి అంటుంది. పిచ్చి పంచమి నన్ను చంపేసి నిన్ను శాశ్వతంగా నాగలోకానికి తీసుకువెళ్లాలని వాళ్ళ ప్రయత్నం అవన్నీ నమ్మకు అని అంటాడు. అలా అనకండి మోక్ష బాబు నాగమణిని తెచ్చి మిమ్మల్ని బ్రతికిస్తాను అని పంచమి అంటుంది.ఆ తరువాత నాగమణిని తీసుకొని ఫణీంద్రతో నాగలోకానికి వెళ్ళిపోతావు అలాంటీ బ్రతుకు నాకు అక్కర్లేదు పంచమి నన్ను కాటు వేసి నాగ లోకానికి హాయిగా వెళ్ళిపో అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights
Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

నామీద నీకు అంత ప్రేమ ఉంటే నాకు ప్రాణం పోయేక్కర్లేదు నా బిడ్డకు ప్రాణం పోయి మనం కలిస్తే నా ప్రాణానికి ప్రమాదం అని నువ్వు భయపడితే టెస్ట్ బేబీ ద్వారా అయినా నువ్వు తల్లి కావచ్చు పంచమి అని మోక్ష అంటాడు. పనింద్ర చెప్పేది నీ చేతుల్లో లేదు పంచమి కానీ నేను చెప్పేది నీ నిర్ణయంలో ఉంది ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం కూడా లేదు పంచమి నాకు గండం దగ్గర పడుతుంది అందుకే కొంచెం గట్టిగా చెప్తున్నాను అని మోక్ష అంటాడు. నాకోసం మన ఇద్దరి ప్రాణాలు బలి పెట్టడం కరెక్ట్ కాదు రేపన్న రోజు నేను నీకు కనిపించను పంచమి, నిర్ణయం ఈరోజు రాత్రి తీసుకో శాశ్వతంగా నా బిడ్డకు తల్లిగా భూలోకంలో ఉండిపోతావా నాగలోకానికి వెళ్ళిపోతావా అని మోక్ష అంటాడు. మీరు తొందర పడుతున్నారు మోక్ష బాబు అని పంచమి అంటుంది.నేను తొందర పడడం లేదు పంచమి నా చావు నన్ను తొందర పెడుతుంది నీ పని నువ్వు త్వరగా పూర్తిచేసుకొని నాగులోకానికి వెళ్ళిపో అని మోక్ష నిరాశతో వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న పంచమి కుమిలిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights
Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

ఏంటి మేఘన ఏదో ఆలోచిస్తున్నావు మన యువరాణి ఏమైనా చెప్పిందా అని ఫణీంద్ర అంటాడు. మన యువరాణి పూర్తిగా నన్ను నమ్మినట్టు లేదు ఫణీంద్ర అని మేఘన అంటుంది. మోక్షనీ బ్రతికించే అవసరం కూడా నాకు లేదు మేఘన మోక్షని చంపి నేను నాగులోకానికి యువరాణిని తీసుకువెళ్లడమే నా కర్తవ్యం అని ఫణీంద్ర అంటాడు. కానీ అది అంత సులభం కాదు యువరాజా అని మేఘన అంటుంది. అందుకే కదా మోక్ష ప్రాణాలు కాపాడుతానని యువరానికి ఆశపెట్టాను అని ఫణింద్ర అంటాడు. అంటే ఆశ పెట్టావా నిజంగా నాగమణిని తీసుకురావా అదంతా అబద్ధమా అని మేఘన అంటుంది. నేను అలా చెప్పలేదు యువరానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను అని ఫణీంద్ర అంటాడు. చూడు యువరాజా నువ్వు తనని మోసం చేస్తే మోక్షప్రాణాలు పోయినందుకు యువరాణి అయి ఆ శక్తులతో నిన్ను క్రూరంగా హింసిస్తుంది అని మేఘన అంటుంది.

Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights
Naga Panchami Today Episode December 25 2023 Episode 235 Highlights

నేను చేస్తాను మేఘన కానీ నా మాటల్ని ఎవరైనా నమ్మట్లేదు అన్నావు కదా అని ఫణీంద్ర భయపడుతూ అంటాడు. ఎవరైనా అబద్ధం చెప్తే నోరు అబద్ధం చెప్తుంది కానీ నుదురు మాత్రం అబద్ధం చెప్పదు అందుకే నువ్వు పంచమిని మోసం చేయలేవు తను నీ మోసాన్ని పసిగడితే తను ఒప్పుకోదు అని మేఘన అంటుంది. ఒప్పుకోకపోతే మోక్ష నా చేతిలో చావడం ఖాయం కదా అని ఫణీంద్ర అంటాడు. యువరాణిని పెళ్లి చేసుకోవాలని ఆశ నీకు లేకపోతే  వెళ్లి ఇప్పుడే మోక్షని కాటు వేయి అని మేఘన అంటుంది. ఆ మాటలు విన్న ఫణీంద్ర మౌనంగా ఉండిపోతాడు. మీరేమీ కంగారు పడకండి యువరాజా యువరాణిని ఒప్పించే బాధ్యత నాది అని మేఘన వెళ్ళిపోతుంది.వీళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి నా మనసులో మాటలు కనిపెట్టేస్తున్నారు అని ఫణీంద్ర ఆలోచించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri