NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami November 09 episode 196: సిసిరా ని ఇలా ఎందుకు నెట్టేసావు మోక్ష అని నిలదీసిన చిత్రా. మోక్ష ఏం సమాధానం చెప్తాడు..

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

Naga Panchami November 09 episode 196: మోక్ష ఆలోచిస్తూ ఉండగా సిసిరా వచ్చి బాబాయ్ నాకు ఒక హోమ్ వర్క్ ప్రాబ్లెమ్ అర్థం కావట్లేదు చెప్పవా అని అడుగుతుంది. నేను చెప్పను నువ్వు వెళ్ళు అని మోక్ష అంటాడు.బాబాయ్ అది నాకు అర్థం కావట్లేదు బాబాయ్ హోంవర్క్ బాబాయ్ చెప్పవా అని చేయి పట్టుకుని అంటుంది సిసిరా. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని నెట్టేస్తాడు. మోక్ష చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది నీకు పిచ్చి పట్టిందా అని చిత్ర అంటుంది. అవును నాకు పిచ్చి పట్టింది అని మోక్ష గట్టిగా అరుస్తాడు. ఏంటి మోక్ష ఎప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించలేదు అని వాళ్ళ అమ్మ అంటుంది. మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటాడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని కోపంగా అంటాడు మోక్ష. మోక్ష ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావ్ ఏదైనా ప్రాబ్లమా అని రఘు అంటాడు.

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights
Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

అవును ప్రాబ్లమే తీరుస్తారా దయచేసి మీరు వెళ్లిపోండి ప్లీజ్ అని మోక్ష అంటాడు. నాన్న మోక్ష ఏమైందిరా అని శబరి అంటుంది. నువ్విలా మాట్లాడుతుంటే చాలా భయమేస్తుంది మోక్ష అని వాళ్ళ అత్తయ్య అంటుంది.నాకేమైంది బాగానే ఉన్నాను ఎప్పటికీ ఒకేలాగా ఉండడం కుదరదు అని మోక్ష అంటాడు. మోక్ష నువ్వు చెప్పేది మాకు అర్థమైందిరా సడన్గా నువ్వు ఇలా మారిపోవడం మాకు వింతగా అనిపిస్తుంది అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను బాగానే ఉన్నాను మీకే వింతగా అనిపిస్తుంది దానికి నేనేం చేయను అని మోక్ష అంటాడు. మోక్ష నీ మాటల్లోనూ నీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతుంది అని జ్వాల అంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని బాగున్న వాళ్ళు ఎవరైనా ఇలా అంటారా అని చిత్ర అంటుంది. చావు ముంచుకొచ్చి కాటికి కాళ్లు చాపుకునే మాట్లాడే వాళ్ళ మాటలు అవి నిజం చెప్పు మోక్ష, ఆ పాము వచ్చేస్తుంది కాటేస్తుంది చచ్చిపోతానని భయం కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నది అని జ్వాల అంటుంది.

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights
Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

చచ్చిపోతాను అని భయం నాకు లేదు,కానీ ముందో వెనుకో నాకు తెలియదు గానీ ఆ వరుసలో నేను ఉంటాను అని మోక్ష అంటాడు. మోక్ష నోటి నుంచి చావు మాట వస్తుంటే నా గుండెల్లో కత్తితో పొడిచినట్టు అనిపిస్తుంది ఎప్పుడు వాడిలా మాట్లాడలేదండి అని వైదేహి అంటుంది. అంతా నీ వల్లే వైదేహి నీ మూర్ఖత్వాన్ని తీసుకెళ్లి వాడి మీద రుద్దాలని చూసావు, మోక్షకి పెళ్లి చేసి తీసుకొచ్చావు కోడలుగా వచ్చిన పంచమిని ఎప్పుడైనా మంచిగా చూసావా ఈ ఇంటికి పనమ్మాయిగానే చూసావు తల్లిగా నీకు ఏమీ అనిపించకపోవచ్చు నువ్వు అన్న మాటలు మోక్షకి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అని రఘు అంటాడు. నేను ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా అని వైదేహి అంటుంది. వాడి పెళ్లి అయ్యి సంవత్సరం అవుతుంది ఒక ముద్దు లేదు ముచ్చట లేదు వాళ్ళిద్దరినీ కలపడానికి మనకున్నది ఒకటే భయం నాగ గండం నుంచి పంచమి ఒక్కతే మోక్షని కాపాడుతుంది పంచమిని ఎప్పుడు కోడలుగా గుర్తిస్తావో అప్పుడే ఈ ఇల్లు మారుతుంది ఆలోచించుకో అని రఘు వెళ్లిపోతాడు.

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights
Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

ఈశ్వర నంబూద్రుని కాటు వేసి చంపాను అంటే మోక్ష బాబును కూడా కాటు వేసి చంపేస్తాను ఈ పరిస్థితి నుంచి నువ్వే నన్ను గట్టెక్కించు అని పంచమి ఏడుస్తుంది. ఇంతలో సుబ్బు వచ్చి పంచమి కన్నీళ్లు తుడుస్తాడు. సుబ్బు నువ్వు నా పక్కన ఉంటే ఆ భగవంతుడే నాకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ జీవితంలో కష్టాలు ఎలా దాటడం అని పంచమి అంటుంది. నది ఒడ్డున నువ్వు నిలబడ్డావు పడవ లేదు ఓడలు లేవు అప్పుడు సముద్రాన్ని ఎలా దాటుతావు అని సుబ్బు అడుగుతాడు. ఏముంది ఆ భగవంతుడి మీద భారం వేయడమే అని పంచమి అంటుంది. భగవంతుడే వచ్చి నదిని దాటిస్తాడని అనుకోవడం  ఆ భగవంతుడు దాటియకపోతే భగవంతున్ని నిందించడం భక్తులు చేసే మంచి పని కాదు అని సుబ్బు అంటాడు. నాకు మంచి చేయలేదని నేను ఎప్పుడూ భగవంతున్ని నిందించను సుబ్బు,కానీ కష్టాల్ని దాటుకోవడం ఎలా అని పంచమి అంటుంది.

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights
Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

నీ భర్త ఆరోగ్యం బాగుపడాలని కొండలు, గుట్టలు ఎక్కి సాధించావు కదా ప్రయత్నిస్తే పోయేదేముంది విజయం లభిస్తుందేమో ప్రయత్నించకుండానే ఎందుకు నిరాశ పడతావు అని సుబ్బు అంటాడు. కట్ చేస్తే,మోక్షకి పిచ్చి పట్టిందా అక్క చావు అంటూ మాట్లాడుతున్నాడు అని చిత్ర అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు చిత్ర ఎలాగో చావు వస్తుందని మోక్ష అందరితో చెప్పాడు కదా, మనమే ఒక పామును తెచ్చి మోక్ష గదిలో వదిలేస్తే ఆ పాము కాటేసి మోక్షని చంపేస్తుంది అని జ్వాల అంటుంది. మన మీద డౌట్ వచ్చి పోలీస్ కేసు పెడితే ఆ పాములవాడు మన పేరు చెప్తే మనం జైలుకి వెళ్తాం కదా అక్క అని చిత్ర అంటుంది.

Naga Panchami today episode November 09 2023 episode 196 highlights
Naga Panchami today episode November 09 2023 episode 196 highlights

ఇలా భయపడితే నేను ఏమి చెప్పను అని జ్వాల అంటుంది. ప్లీజ్ అక్క చెప్పు అక్క అని చిత్ర జ్వాలని బ్రతిమలాడుతుంది. అక్క ఆ పాము మోక్షను కాటు వేయకుండా పంచమిని కాటు వేస్తే అప్పుడు ఎలా అని చిత్ర అంటుంది. అప్పుడు మోక్షని కాపాడడానికి పంచమి ఉండదు కాబట్టి వచ్చే పౌర్ణమికి వచ్చే పాము వచ్చి కాటేసి మోక్షని చంపేస్తుంది అని జ్వాల అంటుంది.అయితే ఇప్పుడే వెళ్లి ఆ పాములవాడిని వెతుకుదాం పద అని చిత్ర లేవడానికి ప్రయత్నిస్తుంది . అప్పుడు ఎంత ప్రయత్నించినా ఆ చిత్ర కుర్చీలో నుంచి లేవలేక పోతుంది. ఏంటి చిత్ర కుర్చీలో నుంచి లేవలేక పోతున్నావు అని జ్వాల లేస్తుంది. తను కూడా లేవలేక కుర్చీలోనే కూలబడుతుంది. వాళ్ళిద్దరూ కుర్చీలో నుంచి లేవడానికి నానా తంటాలు పడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri