BrahmaMudi November 10 Episode 250: నిన్నటి ఎపిసోడ్ లో, సీతారామయ్యకు ప్రమాదం అని తెలిసి ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు కావ్య మాత్రం తన డ్యూటీ తాను చేస్తూ ఉంటుంది. ఇక ఇందిరా దేవి సీతారామయ్య ప్రాణాలు కాపాడమని ఇంట్లో వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న నగలు డబ్బు బంగారం ఆస్తి మొత్తం తీసుకొచ్చి, కొడుకులకు ఇచ్చే సీతారామయ్య ప్రాణాలు కావాలని అడుగుతుంది. ఇక ఇంట్లో అందరూ చాలా బాధపడతారు. రాజ్ ఇందిరా దేవికి ధైర్యం చెప్పి తాతయ్య ప్రాణాలకు ఏమీ కాదు నేను నీకు మాటిస్తున్నాను నానమ్మ అని చెప్తాడు.ఇక ఆస్తి మొత్తం ఎక్కడ సీతారామయ్య ఆరోగ్యానికి ఖర్చు పెడతారు అని రుద్రాణి వాళ్ళ అమ్మ ముందే బయట పడుతుంది. ఇందిరా దేవి కోపంతో రుద్రాణి చెంప పగలగొడుతుంది. ఇది ఈవిడతో పెట్టుకుంటే లాభం లేదని రుద్రాణి సీతారామయ్య దగ్గరకు ఆస్తి పత్రాలతో వెళ్తుంది.

Nuvvu Nenu Prema: విక్కీ పుట్టినరోజు సెలబ్రేషన్స్.. పద్మావతిని దెబ్బ కొట్టాలనుకున్న కృష్ణ..
ఈరోజు250 వ ఎపిసోడ్ లో, ఆస్తి పత్రాలతో సీతారామయ్య దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. మీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తున్నాను నాన్న అయినా అన్నయ్యలు గురించి నీకు తెలిసిందే కదా వాళ్లకు దైవభక్తి ఉండదు ఇక కోడలుగా వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు లే కానీ మనవాళ్లు కాదు ఇక నేనే కదా మీ కూతుర్ని మీరు నన్ను ఎంత బాగా పెంచారు చిన్నప్పటినుంచి అన్ని నేనే మీరు నన్ను ప్రేమగా చూసుకున్నారు కదా అందుకోసమే మీకోసం దేవుని ప్రార్థిస్తున్నాను నాన్న అనే సీతారామయ్య ముందు నాటకం స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. రుద్రాణి అంత మాట్లాడుతున్న సీతారామయ్య మాత్రం సైలెంట్ గా ఉంటాడు.
Krishna Mukunda Murari: మురారికి గతం గుర్తు రాకుండా ప్రయత్నిస్తున్న భవాని.. రేపటికి సూపర్ ట్విస్ట్

ఆస్తి తన పేరు మీద రాయమన్న రుద్రాణి..
చూడు నాన్న వీళ్ళందరూ నన్ను పరాయి దానిలాగా చూస్తున్నారు నేనేమన్నా పరాయి దాన ఈ ఇంటి కూతుర్నే కదా ఈ ఇంటి ఆడపడుచునే కదా అయినా వాళ్ళు నన్ను ఏ రోజు లాలా గౌరవంగా చూడట్లేదు. నేను మీ కూతుర్నే కదా నాన్న అని రుద్రాణి అంటే ఇప్పుడు ఎవరు కాదన్నారమ్మా అని అంటాడు సీతారామయ్య అనడం కాదు వాళ్ళ చూపులన్నీ అలానే ఉన్నాయి నన్ను చీదరించుకుంటున్నారు నా కొడుకు ఇక్కడ గౌరవం లేదు అని రుద్రాణి కాస్త నాటకం డోస్ పెంచుతుంది. నన్ను మనిషిలా చూడట్లేదు నా భర్తతో తగదు నింపులు చేసుకొని వచ్చినప్పుడు మీరు నాకు ఏం చెప్పారు నాకు ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పారు కదా అని రుద్రాణి సీతారామయ్యతో అంటుంది. నేను వాళ్ళ అందరితో మాట్లాడతానులే మా అని అంటాడు సీతారామయ్య మాట్లాడటం కాదు నాన్న నా వంతు ఆస్తి రాసి ఇస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు నాకు ఒక ధైర్యం ఉంటుంది నా పేరు మీద ఆస్తి ఉంది ఇక వీళ్ళతో నాకు అంతగా ఇబ్బంది వస్తే బయటికి వెళ్లి బతకచ్చు అన్న ధైర్యం ఉంటుంది నాకు నా కొడుక్కి దారి చూపించినట్లు అవుతుంది అని పేపర్స్ మీద మీరు ఆలోచించి సంతకం పెట్టండి నాన్న అని రుద్రా అని చెబుతుంది. అయినా ఈ దిక్కుమాలిన ప్రాణాంతక వ్యాధి మీకు కూడా ఎందుకు వచ్చిందో మీకు రాకుండా ఉంటే నేను అడిగేదాన్ని కాదు కానీ ఒకవేళ మీకు జరగరానిది ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి నాన్న మీరు ఉన్నప్పుడే నాకు ఏదో ఒక దారి చేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రుద్రాణి. ఆస్తిలో ఏమేమి రాయాలో కూడా రుద్రాణి ఏ డిసైడ్ చేస్తుంది. ఏర్పాటు దగ్గర ఉన్న స్థలం మామిడి తోట ఆ రెండు నా పేరు మీద రాస్తే నేను చాలా సంతోషిస్తాను నాన్న అని అంటుంది రుద్ర అని ఇదంతా ధాన్యలక్ష్మి బయటి నుంచి చూస్తూ ఉంటుంది. ఆస్తి తండ్రిని అడుగుతుంది అని ధాన్యలక్ష్మికి అర్థం అయిపోతుంది. సీతారామయ్యకి పేపర్ సీట్ చేసి రుద్రాణి బయటకు వెళ్ళిపోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాన్న అని అంటుంది.

కొడుకుతో కలిసి మందు కొట్టిన రుద్రాణి..
ఇక రుద్రాణి నాటకం అంతా తండ్రి దగ్గర ఆడి కొడుకు దగ్గరికి వస్తుంది. ఈ మంచితనం ఏంట్రా మరీ ఇంత ఘోరంగా ఉంది అని అంటుంది. నటించలేక చస్తున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇద్దరూ కలిసి మందు కొడుతూ ఉంటారు. తోడేళ్ల లాగా ఉండాల్సిన మనం కుందేలు లాగా ముసుగు వేసుకొని బతకడం చాలా కష్టం రా అని అంటుంది రుద్ర అని రాహుల్తో మనకు వాటా రాసి ఇచ్చేలా ఉన్నాడా అని అడుగుతాడు రాహుల్ రాసి ఇవ్వక ఏం చేస్తాడు. యమధర్మరాజు ఎత్తుపోతాను అంటే దానికి టోల్గేట్ వేయను అని రుద్రాణి అంటుంది.మనం మరి నికృష్టంగా మాట్లాడుతున్నాం మమ్మీ అని అంటాడు ఇవన్నీ వింటే చస్తారు ఎంత మంది చస్తే మనకు అంత లాభం అని అంటుంది రుద్రాణి కొడుకుతో, నువ్వు చేసిన నాటకానికి తాత ఏమనికి వాటా ఇస్తే నేను నా పెళ్ళాన్ని వదిలించుకొని వరల్డ్ టూల్ వెళ్తాను మమ్మీ అని అంటాడు రాహుల్. అలాగే చదువు కానీ అని అంటుంది రుద్రాణి .
Madhruranagarilo November 09 episode 205: హాస్పటల్లో ఉన్న పండు ఆరోగ్యంతో ఇంటికి వస్తాడా లేదా..

లాయర్ ని పిలిపించిన సీతారామయ్య..
మరుసటి రోజు అందరూ హాల్లో ఉంటారు మీకు అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. ఇక అప్పుడే అక్కడికి లాయర్ వస్తాడు. లాయర్ ని చూసి సుభాష్ ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు మీ నాన్నగారు రమ్మన్నారండి. ఏదో పని ఉందని చెప్పారు అని అంటాడు లాయర్. ఆయన లోపల ఉన్నారు అని అంటుంది రుద్రాణి. మీరు ఇక్కడే ఉండండి మా నాన్నని పిలుస్తాను అని అంటాడు సుభాష్ లేదండి తన గదిలోకి రమ్మన్నారు అని అంటాడు లాయర్ సరే మీరు వెళ్ళండి అంటాడు సుభాష్ ఎందుకొచ్చారు అని అడిగితే ఆయనే అడగండి అని అంటాడు లాయర్ ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ప్రసాద్ లాయర్ ఎందుకు వచ్చాడు అన్నయ్య అని అడుగుతాడు నీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు అని అంటాడు సుభాష్. రుద్రాణి రాహుల్ తో రెండు కన్నీటి బోట్లు కార్చేటప్పటికీ ముసలాయన పొద్దున్నే లాయర్ ని పిలిచాడు రా అని అంటుంది. నీకు ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు మమ్మీ అని అంటాడు రాహుల్. ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక లాయర్ లోపలికి వెళ్లేసరికి సీతారామయ్యకు మందులు ఇస్తూ ఉంటుంది ఇందిరాదేవి. చిట్టి లాయర్ వచ్చాడు నువ్వు బయటికి వెళ్ళు అని అంటాడు సీతారామయ్య వెళ్తూ వెళ్తూ తలుపు వేసుకొని వెళ్ళు అని అంటాడు అలానే వచ్చి హాల్లో కూర్చుంటుంది అప్పుడే సుభాష్ అమ్మ లాయర్ ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు ఏమోరా నాకు తెలియదు మీ నాన్న ఎందుకు పిలిపించాడు అని అంటుంది ఇందిరా దేవి. నువ్వెందుకు బయటికి వచ్చావు అని అంటాడు సుభాష్ మీ నాన్ననే బయటకు వెళ్ళిపోమన్నాడు అని అంటుంది ఇందిరా దేవి. ఇంట్లో అందరూ లాయర్ ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు. రుద్రాణి ఆస్తి పంపకాల కోసం వచ్చి ఉంటారు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అని అంటుంది. నీ నోటికి మంచి మాటలు రావా అని అంటుంది ఏందిరా దేవి ఇక్కడ అందరు మనసులో అదే ఉందమ్మా నేను బయటపడ్డాను వీళ్ళు బయటపడట్లేదు అని అంటుంది.

వీలునామా రాయించిన సీతారామయ్య..
ఇక సీతారామయ్య గదిలోకి వెళ్లిన లాయర్ తో వీలునామా రాయండి నేను చెప్పినట్లుగా అని అంటాడు సీతారామయ్య సరే అని లాయర్ సీతారామయ్య చెప్పిన విధంగా వీలునామా రాస్తూ ఉంటాడు. నేను చెప్పినట్టుగా సిద్ధం చేయండి అని అంటాడు సరే అని లాయర్ మీరు చెప్పినట్టుగానే వీలునామా సిద్ధం చేసి మళ్లీ తీసుకు వస్తాను మీ చేత సంతకానికి అని అంటాడు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు లాయర్ ఇక సీతారామయ్య మంచిది వెళ్లి రండి అని అంటాడు. బయటికి వచ్చిన లాయరు వెళ్ళొస్తానమ్మ అనిందిరా దేవి చెప్పేసి వెళ్లిపోతాడు ఎవరితో ఏమీ చెప్పడు. రుద్రణి సంతోషిస్తుంది మిగిలిన అందరూ అలానే ఆలోచిస్తూ ఉంటారు.
ధాన్యలక్ష్మి ఆలోచన..
ధాన్యలక్ష్మి తన భర్తకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్ అని అంటాడు. ధాన్యలక్ష్మి ఆస్తి గురించి చెప్తే ఇప్పుడు ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు ప్రసాద్. ఇందాక మావయ్య గారు లాయర్ ని పిలిపించారు కదా రుద్రాణి అని చెప్పిన మాటలు విని ఆస్తి పంపకాలు చేస్తారేమో అని అంటుంది. అయితే ఏంటి అని అంటాడు ప్రసాద్, ఆరుద్ర అని చెప్పిన మాటలు విని మన అబ్బాయి కళ్యాణ్ కి ఏమన్నా అన్యాయం చేస్తారేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంది ధాన్యలక్ష్మి . ఆలోచన ఎందుకు వచ్చింది నీకు అని అంటాడు ప్రసాద్ అయినా నాకు మా అన్నయ్య మీద చాలా నమ్మకం ఉంది. నీకు రాజు గురించి తెలియదా ఒకవేళ అన్యాయం చేస్తే రాజు ఊరుకుంటాడా అని అంటాడు ప్రసాద్.నాకు కళ్యాణ్ ఎంతో రాజు కూడా అంతే రాజు నా పెద్ద కొడుకు లాంటివాడు అని అంటుంది. మరి ఇంకా అలాంటప్పుడు సందేహం ఎందుకు అని అంటాడు. నేనే తప్పుగా ఆలోచించాను అని మనసులో అనుకుంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఎక్కువ ఆలోచించకు నాన్నకి మేము కట్టుబడి ఉంటాము. ఆయన ఏది చెప్తే అదే ఇంట్లో వేదం ఇక దానికి తిరుగులేదు అని అంటాడు ప్రసాద్ ధాన్యలక్ష్మి కూడా సరే అని అనుకుంటుంది.
మామయ్యకు సలహా ఇచ్చిన కోడలు..
అపర్ణ సీతారామయ్య దగ్గరికి వస్తుంది మామయ్య గారు లోపలికి రమ్మంటారా అని అంటుంది రమ్మని అంటాడు సీతారామయ్య అక్కడే ఇందిరా దేవి కూడా ఉంటుంది. నేను మీతో ఒక మాట మాట్లాడదామని వచ్చాను అని అంటుంది అపర్ణ చెప్పమ్మా అని అంటాడు సీతారామయ్య. రుద్రాణి మీ దగ్గరికి ఓ పేపర్స్ పట్టుకొని వచ్చిందని విన్నాను నిజమేనా అని అంటుంది అవును అని అంటాడు సీతారామయ్య. నేను చెప్పేది మీరునా అభిప్రాయంగా భావిస్తారని అనుకుంటున్నాను ఇది నా నిర్ణయం మాత్రం కాదు అని అంటుంది మీకు నేను ఇచ్చే సలహా అనుకోండి అని అంటుంది అపర్ణ పర్వాలేదమ్మా ఈ ఇంట్లో ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది నువ్వు మాట్లాడొచ్చు అని అంటాడు సీతారామయ్య. ఇంట్లో ఇలాంటి ఆపద ఇంత వరకు రాలేదు మొదటిసారి వచ్చింది. ఇది దుగ్గిరాల వారి కుటుంబం అంటే చాలా మందికి ఆదర్శం. ఈ కుటుంబంలో లోపల ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయి గడప దాటి బయటికి వినిపించకూడదు అని అనుకునే దాన్లో నేను మొదటి దాన్ని ఇప్పుడు మీ ఆరోగ్యం ఆసరాగా తీసుకొని ఈ ఇంట్లో తను ఉనికిని ప్రశ్నార్థకంగా ఊహించుకొని రుద్రాణి జాలి కథ వినిపిస్తుంది. తనకి తన కొడుక్కి ఒక వాటా కావాలని నినాదాలు లేవదీస్తుంది. ఇందులో సందేహం లేదు ఈ సంగతి మీకు తెలుసు మీ కష్టార్జి దాన్ని మీ పూర్వీకులకు కష్టార్జి దాన్ని మీ వారసులు ఎక్కువ చేస్తున్నారు. మీలాగే మీ మనవళ్లు కొత్త ఆస్తులు కొనడమే తప్ప అమ్ముకునే పరిస్థితి ఇంతవరకు రాలేదు. కాబట్టి మీరు లాయర్ తో వీలునామా రాయించదలుచుకుంటే మాత్రం దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి అని అంటుంది అపర్ణాదేవి. రుద్రానికి మీరు ఆస్తి రాసించిన అది అపత్రాదానమే అవుతుంది రాహుల్ నిలబెట్టుకోలేడు. రుద్రాణి రాహుల్ కి ఖర్చుపెట్టడమే నేర్పించింది కానీ ఎప్పుడూ నిలబెట్టుకోవడం నేర్పించలేదు అని అంటుంది. నేను చెప్పాలనుకుంటున్న చెప్పాను. ఈ ఆస్తిని ఉమ్మడిగా ఉంచడమే నాకిష్టం ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది అపర్ణ ఇక తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వెళ్తుంది. కోడలు చెప్పిన మాట బానే ఉంది కదా బావ అని అంటుంది. రేపటి వరకు ఆగు తెలుస్తుంది అని అంటాడు సీతారామయ్య.

రాజ్ కోపం..
ఇక రాజ్ సీతారామయ్య కోసం డాక్టర్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు ఆ డాక్టర్ని పిలిపించండి అని ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. మీరు నాకు అనుకున్న తర్వాత ఫోన్ చేయండి అని పక్కకు తిరుగుతాడు రాజ్ కావ్యం చూసి ఏంటి సీక్రెట్ గా వింటున్నావా అని అంటాడు లేదు అని వెటకారంగా సమాధానం చెబుతుంది కావ్య. మీకోసమే అన్నం తీసుకొచ్చాను తినండి అని అంటుంది కావ్య నీ చేతితో ఇచ్చింది నేను తినను అని అంటాడు రాజ్. నా మీద కోపం ఉంటే అన్నం తినడం మానేయాలి అని అంటుంది కావ్య. అవన్నీ నీకు అనవసరం అని అంటాడు రాజ్. తినాలో లేదో కూడా నువ్వే చెప్తావా అని అంటాడు.
రేపటి ఎపిసోడ్ లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. లాయర్ అప్పుడే అక్కడికి వస్తాడు సీతారామయ్య నేను చెప్పినట్టు రాసుకు వచ్చారు కదా అని అంటాడు. అంతా మీరు చెప్పినట్టే రాసానండి అని అంటాడు లాయర్. రుద్రాణి రాహుల్ చాలా సంతోషిస్తూ ఉంటారు. మీరు రాసిన వీలునామా ఇంట్లో అందరికీ వినిపించండి అని అంటాడు సీతారామయ్య. లాయర్ వీలునామా తీసుకొని చదవబోతూ ఉండగా రాజ్ వచ్చి లాయర్ చేతిలో ఉన్న వీలునామా తీసుకొని చింపి పడేస్తాడు. ముక్కలవుతున్న వీలునామా చూసి రుద్రాణి రాహుల్ షాక్ అవుతారు. ఇంట్లో ఇలాంటివి జరగడం నాకు ఇష్టం లేదు దీన్ని ఇక్కడితో ఆపేయండి అని అంటాడు రాజ్. ఇంట్లో అందరూ షాక్ అవుతారు.