Madhruranagarilo November 09 episode 205: సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్స్ అంటుంది. డాక్టర్ గారిని కలవడానికి శ్యామ్ వెళ్తాడు. అక్క నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు పండు బాగానే ఉన్నాడుగా ఊరుకో రా మా అత్త మామయ్య నీ పరిచయం చేస్తాను అని రాధా తీసుకెళ్తుంది. మా అత్తయ్య గారు మా మామయ్య గారు అని రాధా వాళ్ళ అక్కకి పరిచయం చేస్తుంది. మీలాంటి అత్తమామలు దొరకడం మా రాధా అదృష్టం అండి మా చెల్లి చెప్పింది మీరు చాలా మంచివారు అని పండుని సొంత మనవడిలా చూసుకుంటున్నారు నిజంగా మీ అబ్బాయి లాంటి భర్త దొరకడం మా రాదా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమండి అని రుక్మిణి అంటుంది. నిజానికి మేము చేసుకున్న పుణ్యం వల్లే రాదా మా ఇంటికి కోడలు అయిందమ్మ రాదా లాంటి అమ్మాయి మా కోడలు కావడం మా అదృష్టం అని మధుర అంటుంది. కట్ చేస్తే, చూడండి ఇప్పుడు బాగా అయిపోయాడని అలాగే నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళ నాన్నగారిని కనిపెట్టి పండు ఆరోగ్యం కుదుటపడేలా చూడండి లేదంటే ప్రమాదం జరుగుతుంది అని డాక్టర్ చెప్తుంది.

అలాగేనండి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని శ్యామ్ అంటాడు. ఈ మెడిసిన్ తీసుకొని రండి అని డాక్టర్ మెడిసిన్ రాసి ఇస్తుంది. శ్యామ్ మెడిసిన్ కోసమ వెళ్తాడు. కట్ చేస్తే, రాదా మ కాలనీలో దిగాక పండు మాకు మనవడయ్యాడు ఆ తరువాతే రాదా మాకు కోడలు అయింది అని ధనంజయ్ అంటాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తమామలు ఉండడం నేను ఎక్కడా చూడలేదండి మా పండు నీ సొంత మనవడిలా చూసుకుంటున్నారు మీకు చాలా థాంక్స్ అండి అని రుక్మిణి అంటుంది. పండు మీ వాడు కాదమ్మా మాకు మనవడు నువ్వేమీ టెన్షన్ పడకు పండు సంగతి మేము చూసుకుంటాం అని మధుర అంటుంది. కట్ చేస్తే, రుక్మిణిని హైదరాబాద్ ఎందుకు పంపించావు అక్కడ అల్లుడు గారిని చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని మురళి కోప్పడతాడు.

నేను ఎంత చెప్పినా వినలేదండి రుక్మిణి అని వాళ్ళ ఆవిడ అంటుంది.అల్లుడు గారుని చూస్తే ఇద్దరు కూతుర్ల బతుకులు బండలైపోతాయి అని టెన్షన్ పడుతే గుండెపోటు వస్తుంది.ఏవండీ మీరు టెన్షన్ పడకండి ఇలా వచ్చి కూర్చోండి అని మురళిని మంచం మీద కూర్చోబెట్టి డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మంటుంది. డాక్టర్ గారు వచ్చి చూసి ఈయన దేనికో టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ తగ్గిస్తే మామూలు మనిషి అయిపోతాడు, ఇప్పటికైతే ఈ మెడిసిన్ వాడండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది. ఏవండీ ఎందుకండీ మీరు టెన్షన్ పడతారు చూశారా డాక్టర్ గారు ఏం చెప్పారు అని వాళ్ళ ఆవిడ అంటుంది. నువ్వు ముందు రుక్మిణికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు అని మురళి అంటాడు. రుక్మిణి కి ఫోన్ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదు త్వరగా రామా అని అంటుంది. రుక్మిణి ఫోన్ మాట్లాడుకుంటూ అలా బయటికి వస్తుంది.

ఇంతలో శ్యామ్ మెడిసిన్ తీసుకొని రాదా దగ్గరికి వచ్చి మీ అక్క వచ్చింది అన్నావు కదా ఏది అని అడుగుతాడు. ఫోన్ వస్తే ఇక్కడ సిగ్నల్ లేదని అక్కడికి వెళ్లిందండి అని రాదా చెప్తుంది. ఇంతలో నర్స్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని శ్యామ్ ని పిలుస్తుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయాక వచ్చి రాధా నేను వెంటనే వెళ్ళిపోతాను మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చిందంట అది ఒక్కతే ఉంది ఆవిడకి తోడుగా నేను ఉండి ధైర్యం చెప్పాలి అని అంటుంది. అలాంటి సమయంలోనే అమ్మ మనిషికి ఒకరికి ఒకరు తోడు ఉండాలి నువ్వు పండు గురించి ఏమీ ఆలోచించకు మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అని మధుర అంటుంది. చాలా థాంక్స్ అత్తయ్య గారు అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది.

మళ్లీ శ్యామ్ వచ్చి మీ అక్క ఏది రాదా అని అడుగుతాడు. ఇప్పుడే వెళ్లిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగోలేదంట అని రాదా అంటుంది. అయితే మీ అక్కను నేను డ్రాప్ చేసే వాడిని కదా రాదా అని శ్యామ్ అంటాడు. అరేయ్ కొద్ది దూరమే వెళ్లి ఉంటుంది మీరు వెళ్ళండి అని మధుర అంటుంది. అలాగే అని వచ్చి చూసేసరికి రుక్మిణి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటి నాన్న మీరు టెన్షన్ పడడానికి కారణం ఏంటి నేను వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను నాకు చెప్పరా అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా అంటూ మాట తడబడతాడు మురళి. ఎప్పుడూ నన్ను పెద్ద కొడుకు అని అంటారు కదా, ఆ పెద్ద కొడుకు స్థానంలో ఉండి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసుకుంటాను అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే పండును తీసుకొని ఇంటికి వస్తారు. ఏంటి డాడీ నేను అసలు ఎందుకు అలా పడిపోయాను నాకేమైంది అని పండు అడుగుతాడు.

అంతా మీ డాడీ వల్ల లేరా నిన్ను కోప్పడడం వల్ల నీకు జ్వరం వచ్చింది అని మధుర అంటుంది. సారీ నాన్న ఇంకెప్పుడు అలా చేయను అని శ్యామ్ అంటాడు. మీరు దానికి ఎందుకు డాడీ సారీ చెప్పడం ఏదో పనిలో ఉంటే నేను డిస్టర్బ్ చేసి ఉంటాను మీరు నన్ను కోప్పడి ఉంటారు దానికి ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు అని పండు అంటాడు. చూశారా చిన్నవాడైనా వాడు ఎంత పెద్ద మనసు చేసుకొని మాట్లాడుతున్నాడు అని మధుర అంటుంది.నేను పండు దగ్గర ఉంటాను మీరు వంట సంగతి చూడండి అని ధనంజయ్ అంటాడు. అత్తా కోడలు ఇద్దరు వంట చేయడానికి కిందికి వస్తారు. శ్యామ్ కూడా కిందికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు.
చూసావా రా చిన్నపిల్లడైనా నిన్ను ఎలా అర్థం చేసుకున్నాడో ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకు నువ్వంటే వాడికి అంత ఇష్టం అని మధుర అంటుంది. ఏదో డిస్టర్బ్ అయి అలా మాట్లాడిన అమ్మ ఇంకెప్పుడూ చేయను అని శ్యామ్ అంటాడు. ఆయన ఎప్పుడూ ఇలా పండుని విసుక్కోలేదా అత్తయ్య గారు ఏదో టెన్షన్ లో ఉండి చేశారేమో అని రాదా అంటుంది.నువ్వు ఒకదానివి ఎప్పుడు చూసినా మీ ఆయన వెనకేస్తూ వస్తావు మనం వంట సంగతి చూసుకుందాం రా అని వెళ్ళిపోతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది