Brahma Mudi November 9 Episode 249: నిన్నటి ఎపిసోడ్ లో, స్వప్న,నీ కావ్య ని ఇంట్లో నుంచి పంపించాలనుకున్న అపర్ణాదేవి,రుద్రాణి.ఇక సీతారామయ్య గారి నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సీతారామయ్య నిర్ణయం చెప్పేలోపే రాహుల్ అడ్డుపడతాడు. ఇక మొత్తానికి సీతారామయ్యకి క్యాన్సర్ అన్న విషయం ఇంట్లో అందరికీ తెలియజేయాల్సి వస్తుంది. ఆ మాట విని తట్టుకోలేక పోతారు ఇంట్లో వాళ్ళు. స్వప్ననికావ్య నీ ఇంట్లోనే ఉండమని తీర్పు ఇచ్చిన ఇందిరా దేవి. రాజ్ కీ ఇష్టం లేకపోయినా తాత గారి కోసం ఒప్పుకుంటాడు. కవిని స్వప్న నీ ఇంట్లోనే ఉండడానికి అందరూ ఒప్పుకున్నట్టే, కానీ తాత గారికి బాలేనందుకు ఇంట్లో అందరూ ఫీలవుతూ ఉంటారు.

ఈరోజు249 ఎపిసోడ్ లో,కావ్య రాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇలా చేయడానికి ఒక కారణం ఉందని చెప్తే మీరు నమ్మట్లేదు కదా అంటుంది కావ్య. నువ్వు ఇప్పుడు ఇలాంటి మాటలు ఎన్ని అయినా చెప్తావు అంటాడు రాజ్. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా కారణం ఉంటుంది. అంతమాత్రాన వాడు మంచివాడు అయిపోయాడు కదా అంటాడు రాజ్. ఉరిశిక్ష పడిన ఖైదీ మాటైనా వింటారు గానీ నా మాట మీరు వినట్లేదు కదా అంటుంది కావ్య. ఇన్నాళ్లు అదే తప్పు చేశాను నీకోసం మా అమ్మని కూడా ఎదిరించి నిలబడ్డాను కానీ నువ్వు మాత్రం నా నమ్మకాన్ని చంపేశావు నేను ఎంత పిచ్చి వాని కాకపోతే మా అత్త నువ్వు అబద్ధం చెప్తున్నావంటే, లేదు కావ్య ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఏదైనా చేస్తుంది కానీ నా దగ్గర అబద్ధం చెప్పదు అని నా భార్య గురించి గొప్పగా నేను ఊహించుకున్నాను చూడు అందుకు నేను పిచ్చివాడిని అని అంటాడు రాజ్. అయినా మంచితనం ముసుగు వేసుకొని నటించడం నీకు అలవాటైపోయింది అని రాజు కోపంగా అక్కడి నుంచి చెప్పివెళ్లిపోతాడు.

ఎప్పటిలాగా కావ్య డ్యూటీ..
ఇక రాజ్ అన్ని మాటలు అన్నా బాధగా కావ్య అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు అని మనసులో అనుకుంటుంది. ఇక మరునాడు ఉదయమే అంతా హాల్లోకి వచ్చి కూర్చుంటారు స్వప్న కూడా ఏమీ గొడవ జరగనట్టు హాల్లో వచ్చి కూర్చొనిఫోన్ చూసుకుంటూ ఉంటుంది.కానీ కావ్య మాత్రం తన డ్యూటీ తన ఎక్కేస్తుంది.అందరికీ ఎప్పట్లాగా కాఫీ పట్టుకొని వచ్చి ఇవ్వబోతూ ఉంటుంది కానీ ఏ ఒక్కరూ కాఫీ తీసుకోరు. అందరూ జరిగిన గొడవ గురించి కాకుండా సీతారామయ్య గారి ఆరోగ్యం బాలేనందుకు బాధపడుతూ ఉంటారు. రుద్రాణి తీసుకుందామనుకొని కూడా కాఫీ కానీ అందరూ తీసుకోలేదు కదా నేను తీసుకుంటే బాగోదులే అని తీసుకోదు. ఇక స్వప్న వేరే వాళ్ళతో మనకెందుకు అని కాఫీ తాగుదాం అనుకుంటుంది కానీ కావ్య స్వప్న కి కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది.

నా భర్త ప్రాణాలు నాకు ఇవ్వండి..
ఇంతలో ఇందిరా దేవి అక్కడికి వస్తుంది. వస్తూనే చాలా బాధగా ఆస్తి పత్రాలు డబ్బు డాక్యుమెంట్స్ బంగారం అన్ని తీసుకొని వస్తుంది. అంత హాల్లో కూర్చుని ఉండగా వచ్చి అదంతా హాల్లో పెట్టి బాధపడుతూ ఉంటుంది. రాజ్ గౌతమ్, కావ్య అందరూ అమ్మమ్మ గారి దగ్గరికి వస్తారు. ఇక ఆవే బాధపడుతూ నేను సుమంగళిగా పోవాలి అనుకుంటున్నాను నా ఐదోతనం నాకు కావాలి దుఃఖం వల్ల మనసులో బలహీనమైపోతుంది మీరంతా ఎదిగిన వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు నా భర్త ప్రాణం నాకు దానం చేయండి అంటూ చీర కొంగు చాపి అడుగుతూ ఉంటుంది ఇందిరా దేవి. ఇందిరా దేవి ఏడుస్తూ ఉంటే కావ్య ధాన్య లక్ష్మీ వచ్చి ఓదారుస్తూ ఉంటారు ఇంతలో అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ కట్ చేస్తూ ఉంటాడు. అమ్మమ్మ గారు ఏం కాదు ఏడవకండి, అని కావ్య ఓదారుస్తూ ఉంటుంది. అత్తయ్య ఏం కాదు మీరు ఏడవకండి అని అపర్ణాదేవి కూడా ఓదారుస్తుంది నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదు పరిష్కారం ఇదిగో మనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఇంత నగలు ఉన్నాయి ఇంత బంగారం ఉంది ఏ దేశంలో అయినా వీటన్నిటిని అమ్మేసి నా భర్తని కాపాడండి. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించి అమెరికా వెళ్లిన సరే నా భర్తప్రాణాలు కాపాడాలి అని అంటుంది. ఈ బంగారం కూడా అమ్మేసేయండి కావాలంటే ఇంకా ఎంత ఆస్తి అయినా సరే మొత్తం అమ్మేసి నా భర్తని కాపాడండి అని అంటూ ఉంటుంది ఇందిరా దేవి.
Prema Entha Madhuram November 09 episode 1095: ఆర్య అనుని షాపింగ్ మాల్ లో చూస్తాడా..
రుద్రాణి చెంప చెల్లు మనిపించిన తల్లి..
ఇక వెంటనే ఆస్తి అమ్మేయాలి అన్నమాట రుద్రానికి వినపడగానే అమ్మ ఎంత ఖర్చు పెట్టైనా ఆస్తిక అరిగిపోవడం తప్ప ప్రయోజనం ఏముంటుంది అలాంటిదే ఏదైనా అవకాశం ఉంటే అన్నయ్య వాళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళు కదా అలాంటిదేం లేదమ్మా అని చాలా కూల్ గా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇందిరా దేవికి ఎక్కలేని కోపం వస్తుంది వెంటనే రుద్రాణి దగ్గరికి వెళ్లి లాగి ఒక్కటి చెంప మీద ఇస్తుంది. అంతే రుద్ర నీ చెంప చెల్లి మనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏమన్నావే ఇప్పుడు నువ్వు ఆస్తి కరిగిపోతుందా, అందరం రోడ్డున పడతామా ఇవన్నీ ఆలోచించడానికి నేను చేస్తుంది వ్యాపారం కాదు నా భర్తకి ఆయుష్ పోసే యజ్ఞం చేస్తున్నాను అని అంటుంది ఇందిరా దేవి. నేనేం తప్పు మాట అన్నానమ్మా అని రుద్రాణి అనే లోపు అయినా ఇక్కడ ఎవరికీ రాని ఆస్తులు ఆలోచన నీకు ఎలా వచ్చింది రుద్రాణి కడుపుకి అన్నం కదా తింటున్నావు అని అంటుంది అపర్ణాదేవి. వదిన అంటూ గట్టిగా అరుస్తుంది రుద్ర అని ఆపు రుద్రాణి నీ బోడి సలహాలు ఎవరు ఇక్కడ అడగట్లేదు అని అంటుంది అపర్ణాదేవి. అయినా నేను మన మంచి కోసమే అన్నాను అంటుంది రుద్రాణి. మన మంచి కోసం అనలేదు నీ మంచి కోసం అన్నానని చెప్పు అంటాడు సుభాష్. అయినా అత్తయ్య గారు అంత బాధలో ఉంటే ఇప్పుడు నీ బుద్ధి చూపించుకోవడం అవసరమా రుద్రాణి అని గడ్డి పెడుతుంది ధాన్యలక్ష్మి.

ఇందిరా దేవిని ఓదార్చిన రాజ్..
ఇక ఇందిరా దేవి బాధపడుతుంటే రాజు వచ్చి ఈ అనవసరమైన మనిషి కోసం కాలయాపన చేయొద్దు నా భర్త ప్రణాళి నాకు కావాలి అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నా భర్త లేని రోజు ఈ చిట్టి కూడా లేదు అని ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటుంది. ఇందిరా దేవి మాటలు విని బాధగా లోపలికి వెళ్లి పోతాడు సీతారామయ్య వెంటనే రాజ్ ఇందిరాదేవి దగ్గరికి వచ్చి నానమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచించి తాతయ్య ప్రాణాల కన్నా ఆస్తి ఏం పెద్ద అవసరం లేదు అని, మా అందరిని ముందుకి నడిపించడానికి ఈ ఆస్తినంతా దార పోయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము నానమ్మ అని అంటాడు రాజ్. అయినా నీవు ధైర్యంగా నిలబడితే మేమంతా నీ వెనకే ఉంటాము అని అంటాడు రాజ్. ఇలాంటి కలుపు మొక్కల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని రుద్రా నిన్ను చూస్తూ ఉంటాడు రాజ్.
తాతయ్య లేనిదే ఇక్కడ ఇల్లే లేదు అసలు తాతయ్య లేకపోతే కుటుంబమే లేదు ఇన్ని ఆస్తులు దక్కేవా చెప్పు ఇప్పుడు తాతయ్యని దక్కించుకోవడానికి ఏం చేయాలో అన్ని నేను చేస్తాను మీకు ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఇన్నాళ్లు రహస్యంగా దాచాల్సి వచ్చింది ఇప్పుడు అందరికీ విషయం తెలిసిపోయింది కాబట్టి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నానమ్మ అని రాజ్ మాట ఇస్తాడు ఇందిరా దేవికి. తాతయ్య ప్రాణానికి ఎలాంటి డాక్టర్ కావాలో అలాంటి డాక్టర్ని మేము కలుస్తాము. ఎంత డబ్బు ఖర్చైనా సరే తాతయ్యకి ట్రీట్మెంట్ చేయిస్తాము అని రాజ్ మాట ఇస్తాడు ఇందిరా దేవికి, వెంటనే సుభాష్ అవునమ్మా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము డాక్టర్స్ ని కూడా మాట్లాడాము అమెరికాలో ఉండే డాక్టర్ ఒకళ్ళు మాట్లాడి ఇంతకి ఇస్తాము అని చెప్పారు.అని సుభాష్ కూడా అంటాడు ఇక తాతయ్య పూర్తిగా ఆరోగ్యంతో మీకు అప్పగిస్తానని నేను మాటిస్తున్నాను నానమ్మ అని రాజు అంటాడు వెంటనే ఇందిరాదేవి రాజు గుండెల మీద వాలిపోతుంది ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

అప్పు ఇంటికి అనామిక రాక..
ఇక ఇంట్లో గొడవ జరుగుతుండడంతో కళ్యాణ్ అనామిక ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక అనామిక డైరెక్టుగా అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు డల్లుగా పడుకొని ఉంటుంది అది చూసి కనకం ఈమధ్య ఇదేంటో తేడాగా ఉంటుంది ప్రేమించిందా అంటే దీని నోటికి ఎవడు దడిచి ప్రేమించాడు కదా, మరి అలాంటిది ఇది ఎందుకు అలా ఉంటుంది అని వాళ్ళ వదినతో అంటూ ఉంటుంది. ఇదంతా వింటూ ఉంటుంది అప్పు ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది అనామికని చూసి రామ్మా కూర్చో వెళ్లి కాఫీ తీసుకొస్తాను అని కనకం ఉంటుంది ఇక అనామిక అప్పు దగ్గరికి వెళుతుంది. ఏంది ఒక్కదానివే వచ్చావా అంటుంది అప్పు అవును అంటుంది అనామిక మరి నీ దోస్తీ ఎడి అని అడుగుతుంది అనామిక. నాకేం తెలుసు అని అంటుంది అప్పు నా ఫోన్ కట్ చేస్తున్నాడు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది అనామిక. ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం అని అంటుంది అప్పు నీ ఫోన్లో నుంచి ఒకసారి ఫోన్ చెయ్ అని అంటుంది అనామిక., నా ఫోన్లో నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తాడా ఏంటి నీ ఫోన్లో నుంచి చేస్తేనే చేయలేదు ఇక నేను ఎంత అని అంటుంది అప్పు. బలవంతంగా అప్పు ఫోన్ తీసుకొని అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ ఫోన్ రింగ్ రాగానే చూసి అప్పు కాల్ చేసింది అని లిఫ్ట్ చేసి చెప్పు బ్రో అని అంటాడు వెంటనే అనామిక షాక్ అవుతుంది. అనామిక తో పాటు అప్పు కూడా షాక్ అవుతుంది. నేను మాట్లాడుతుంది అప్పు కాదు అనామికని అంటుంది వెంటనే కళ్యాణ్ షాక్ అవుతాడు. అనామిక నువ్వేంటి ఎక్కడున్నావు అని అంటాడు వెంటనే అనామిక నేను అప్పు వాళ్ళ ఇంటికి వచ్చాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అయినా ఇప్పటిదాకా బిజీగా ఉన్న నువ్వు ఇప్పుడు ఖాళీ అయిపోయావా అని అంటుంది. సారీ అనామిక ఇంట్లో కొంచెం కంగారుగా ఉంది ఇంట్లో ఉండే బాధల వల్లనే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అని అంటాడు కళ్యాణ్ అయితే ఇప్పుడు బాధలన్నీ పోయాయా అని అంటుంది అనామిక అలా అని కాదు నువ్వు ఫోన్ చేస్తే ఎక్కువ సేపు మాట్లాడాలి కదా అందే అప్పు అయితే ఏదైనా విషయం ఇట్లే చెప్పేసి పెట్టేయొచ్చు కదా అందుకే అప్పు ఫోన్ లిఫ్ట్ చేసాను సారీ అని అంటాడు కళ్యాణ్ ఇక అనామిక సరే అంటుంది. అనామిక ఫోన్ లిఫ్ట్ చేయకుండా అప్పు ఫోన్ లిఫ్ట్ చేసే సరికి అప్పు కొంచెం సంతోషపడుతుంది

ఊహించని ప్రమాదాన్ని తెస్తున్న రుద్రాణి..
ఇక అందరూ లోపలికి వెళ్తారు కాసేపటికి సీతారామయ్య ఒక్కడే పుస్తకం చదువుకుంటూ గదిలో ఉంటాడు. రుద్రాణి ఒక్కతే సీతారామయ్య గదిలోకి ఏవో పేపర్స్ పట్టుకొని వెళుతుంది. ఇక్కడ నీతులు చెప్పడానికి ఇందిరా దేవి లేదు ఆమె వచ్చేలోపే నా పని నేను కానీ చేయాలి అని మనసులో అనుకొని రుద్రాణి సీతారామయ్య గదిలోనికి ఎంట్రీ ఇస్తుంది. ఏంటి రుద్ర నీలా వచ్చావు అని అడుగుతాడు సీతారామయ్య ఏంటి ఖాళీ పత్రాలు అని అడుగుతాడు. ఇక రుద్రాణి నాటకం స్టార్ట్ చేస్తుంది నీ మనసులో ఎంత సంచలనం రేగుతుందో నాకు తెలుసు నాన్న మీ ఆరోగ్యం కోసం నేను ప్రతిక్షణం దేవుని ప్రార్థిస్తున్నాను మీరు క్షేమంగా ఉండాలి క్యాన్సర్ లేకుండా క్యాన్సర్ని జయించాలి. అని అంటూ రుద్రాన్ని ప్రేమగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది నా కోసం నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం రుద్రాణి అని అంటాడు సీతారామయ్య. నేను కాకపోతే నీకోసం ఎవరు ప్రార్థిస్తారు నాన్న అన్నయ్యలు బొత్తిగా దైవభక్తి లేదు ఈ ఇంట్లో కోడలు బయట నుంచి వచ్చారు కానీ నేను మాత్రం మీ కూతుర్నే కదా మీరు నన్ను ఎంతలా పెంచారు ఎంతలా అభిమానిస్తూ నన్ను పెద్దదాన్ని చేశారు అంటూ నటిస్తూ ఉంటుంది రుద్రాణి. రేపటి ఎపిసోడ్లో రుద్రాణి నటించిన పేపర్స్ మీద వాళ్ళ నాన్నజాత సంతకం పెట్టించుకుంటుందా లేదంటే ఈలోపే ఎవరైనా వస్తారాతెలియాల్సి ఉంది.