NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 09 episode 1095: ఆర్య అనుని షాపింగ్ మాల్ లో చూస్తాడా..

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

Prema Entha Madhuram November 09 episode 1095:  అలా షాపింగ్ మాల్ అంత అను కోసం వెతుకుతూ ఆర్య చీరల దగ్గరికి వెళ్తాడు. చీరల దగ్గర ఉన్న అను చీరలు సర్దుతూ ఉంటే కొన్ని చీరలు కింద పడతాయి అవి తీయడానికి కిందే కూర్చొని మడత పెడుతుంది అను. చీరల కౌంటర్ దగ్గర అనుని వెతికి ఆర్య మళ్ళీ వెళ్ళిపోయి అమ్మ షాపింగ్ చేయడం అయిపోయిందా అని అంటాడు. అయిపోయింది నాన్న రాధ కూడా ఇదే షాపింగ్ మాల్లో పనిచేస్తుందట వెళ్లి థాంక్స్ చెప్పి వద్దాం అని సుగుణ అంటుంది. అమ్మ నేను ఫోన్ మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి అని ఆర్య అంటాడు. సుగుణ దివ్య అను దగ్గరికి వెళ్లి, మా అమ్మకి రెండు చీరలు సెలెక్ట్ చేయండి అనుగారు అని ఉషా అంటుంది. సుగుణ కోసం రెండు చీరలు సెలెక్ట్ చేసి ఇవి బాగుంటాయి ఆంటీ తీసుకోండి అని అంటుంది.

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights
Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

అలాగే దివ్యకి కూడా రెండు చీరలు సెలెక్ట్ చెయ్ అమ్మ అని సుగుణ అంటుంది. నాకు ఇప్పుడే ఏమి అక్కర్లేదు తర్వాత తీసుకుంటాను మీరు తీసుకోండి అని దివ్య అంటుంది. అదేంటమ్మా అన్నయ్య తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చు కదా అని సుగుణ అంటుంది. అందుకే వద్దన్నాను నా డబ్బులతోటే నేను కొనుక్కుంటాను అని దివ్య అంటుంది. అలాగే మా అన్నయ్యకి కూడా ఒక డ్రస్సు సెలెక్ట్ చేయండి అని ఉషా అంటుంది. అంటే ఆర్య సార్ కూడా వీళ్ళతో షాపింగ్ కి వచ్చాడా అని అను ఇప్పుడే వస్తాను అని ఉష మనం అక్కడ మీ అన్నయ్యకు డ్రెస్ సెలెక్ట్ చేద్దాం రా అని తీసుకొని వెళ్తుంది. ఇంతలో ఆర్య వచ్చి అమ్మ అందరూ తీసుకున్నారా అని అంటాడు. తీసుకున్నాం సూర్య అని సుగుణ అంటుంది. ఇంకో నాలుగు తీసుకో జ్యోతి అని ఆర్య అంటాడు. ఒక్కసారి అన్ని తీసుకుంటే మొహం వాచిపోయింది అనుకుంటారు ఇప్పటికీ ఇది చాల్లే అని జ్యోతి అంటుంది.

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights
Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

దివ్య నువ్వు కూడా తీసుకో అని ఆర్య అంటాడు. నాకు ఇప్పుడే ఏమీ వద్దు ఒకేసారి పెళ్లి షాపింగ్ చేస్తాను అని దివ్య అంటుంది.అదేంటమ్మా అందరితో పాటు నువ్వు రెండు తీసుకో అని ఆర్య అంటాడు. వద్దని చెప్తున్నాను కదా విసిగిస్తారు ఎందుకు, హరీష్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వాళ్లతో మాట్లాడి వెళ్లండి అని దివ్య అంటుంది. దివ్య షాపింగ్ మాల్లో పెళ్లిచూపులు ఏంటి నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా అని సుగుణ అంటుంది. అమ్మ అబ్బాయితో మాట్లాడడానికి ఎక్కడైతే ఏముందమ్మా రానివ్వు అని ఆర్య అంటాడు. వాళ్లను మీరు ఎక్కువ ఏమీ ఫోర్స్ చేయొద్దు పెళ్లికి ఒప్పుకుంటే చాలు అని దివ్య అంటుంది. ఆమాత్రం దానికి మాకు పరిచయం చేయడం దేనికే నీ ఏడుపేదో నువ్వు ఏడవచ్చు కదా అని సుగుణ అంటుంది. ఊరుకో అమ్మ అని ఆర్య అంటాడు. హరీష్ వాళ్ళు వచ్చినట్టున్నారు నేను వాళ్ళని తీసుకొస్తాను మీరు రండి అని దివ్య వెళ్ళిపోతుంది. అనునే ఈ చీరలన్నీ సెలెక్ట్ చేసింది రా తనను కలిసి థాంక్స్ చెప్పు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights
Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

థాంక్స్ ఒక్కటి చెప్తే ఏం బాగుంటుంది అమ్మ చీర తీసుకొని ఆవిడకి ఇచ్చి థాంక్స్ చెప్తాను అని ఆర్య అనుకోసం ఒక చీరను సెలెక్ట్ చేస్తాడు. కట్ చేస్తే, ఈ షర్టు అన్నయ్యకు చాలా బాగుంటుంది చూడు అని ఉష అంటుంది. ఈ కలర్ సార్ కు సూట్ అవ్వదు అని అను అంటుంది. ఏమన్నావు అని ఉష మళ్లీ అడుగుతుంది. అంటే సారీ కలరే కదా వద్దు అన్నాను వేరే కలర్ చూడు అని అంటుంది. ఈ కలర్ చూడు ఉషా మీ అన్నయ్యకు చాలా బాగుంటుంది దీని మీదకి బ్లాక్ పాయింట్ ఏస్తే హీరోలా ఉంటాడు అని అను అంటుంది. ఆర్య రాకని గమనించిన అను ఇప్పుడే వస్తాను ఉష అని వెళ్ళిపోతుంది. ఉష, రాధా గారు ఎక్కడ చీర ఇచ్చి థాంక్స్ చెప్దాం అనుకున్నాను అని ఆర్య అంటాడు.అన్నయ్య నీకు డ్రెస్సు రాధ గారు సెలెక్ట్ చేశారు ఒకసారి ట్రైల్ వేసి రా అని అంటుంది ఉష. ఆ బట్టలు వేసుకొని వస్తే ఇప్పుడు నీకు సంతోషమేనా అని ఆర్య అంటాడు. అను చెప్పినట్టు నీకు ఈ డ్రెస్సు సూపర్ గా ఉంది అన్నయ్య అని ఉష అంటుంది. దూరం నుంచి ఆర్యను చూసిన అను చాలా సంతోష పడిపోతుంది.

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights
Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

అమ్మ దివ్య ఈ చీర రాధ కు నువ్వే ఇచ్చి థాంక్స్ కూడా నువ్వే చెప్పి రా అని ఆర్య వెళ్ళిపోతాడు. ఏంటి అను గారు మా అన్నయ్య నువ్వు కలవడం నీకు ఇష్టం లేనట్టుంది మా అన్నయ్య వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటున్నారు ఏంటి అని ఉష అంటుంది. అంటే ఉష మొగవాళ్ళను కలవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకే అలా తప్పించుకుంటున్నాను నాకు మొహమాటం ఎక్కువ అని అను అంటుంది. అవునా అయితే ఇదిగో ఈ చీర తీసుకో థాంక్స్ కూడా మా అన్నయ్య చెప్పాడు వెళ్ళొస్తాను అను గారు షాపింగ్ మాల్ లో దివ్యక్క పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అని ఉష అంటుంది. కట్ చేస్తే,  అతను హరీష్ వాళ్ళ అమ్మ సుజాత అని వాళ్లను పరిచయం చేస్తుంది దివ్య. ఈవిడ మా అమ్మగారు ఆవిడ మా అక్క అని దివ్య హరీష్ వాళ్లకి పరిచయం చేస్తుంది. వీడు నా పెద్ద కొడుకు సూర్య అండి సుగుణ వాళ్ళకి పరిచయం చేస్తుంది. బాబు ఏం చదువుకున్నావు అని సుగుణ అంటుంది. సివిల్ ఇంజనీరింగ్ చేశాను అండి  అని హరీష్ అంటాడు. ఏ కంపెనీలోనైనా డీల్ కుదుర్చుకొని కాంట్రాక్ట్ చేస్తున్నావా అని ఆర్య అంటాడు. అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు కదా నీకెందుకు అని దివ్య అంటుంది. దివ్య ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావే అన్నగా అది వాడి బాధ్యత నువ్వు ప్రేమించినంత మాత్రాన ఎవరికీ పడితే వాళ్లకు అప్పగిస్తాం అనుకుంటున్నావా తిక్క తిక్కగా మాట్లాడకు నోరు మూసుకొని ఉండు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights
Prema Entha Madhuram today episode November 09 2023 episode 1095 highlights

ఇదిగోనండి డాక్యుమెంట్స్ ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకొని ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను అని హరీష్ అంటాడు. మా దివ్య చూడడానికి గాంబీర్యంగా కనబడుతుందే కానీ మనసు వెన్న ఏ చిన్న బాధ కలిగిన తట్టుకోలేదండి అని సుగుణ అంటుంది. మీ దివ్య కు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటానండి నన్ను నమ్మండి అని సుజాత అంటుంది. ఆ మాట అన్నారు చాలా సంతోషం అండి మా దివ్య మీ అబ్బాయి తో సంతోషంగా ఉంటుందని అనుకుంటుంది అంతే హ్యాపీగా ఉంటుందని మేము ఆశిస్తున్నాను అండి అని ఆర్య అంటాడు. సరేనండి ఒక మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకొని ముహూర్తం నిర్ణయిద్దాము అని సుజాత అంటుంది. అంతేకానీ నన్ను పరిచయం చేయరా అని ఉష అంటుంది. అది మా చిన్న చెల్లెలు ఉషా అండి అని దివ్య అంటుంది. హాయ్ బావగారు ఇక మీరు బలైపోయినట్టే అని ఉష అంటుంది. ఎందుకు అని హరీష్ అంటాడు. ఎందుకంటే మా దివ్యక్కని చేసుకుంటున్నారు కదా అందుకు అని ఉష అంటుంది. ఉష నన్ను అంత మాట అంటావా అని దివ్య ఉష చెవిని మెలుపెడుతుంది. సరేనమ్మా మీరు వెళ్లండి నేను ఇందాక ట్రయల్ రూమ్లో ఫోన్ మర్చిపోయాను తీసుకొని వస్తాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, హరీష్ ఛాయా కి ఫోన్ చేసి హలో మేడం ఇప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయి అంతా మాట్లాడుకున్నాము ఇక తొందరలో పెళ్లికూడా అయిపోతుంది అని అంటాడు. పెళ్లి అయ్యే అంతవరకు నువ్వు ఆర్యని నమ్మించే ప్రయత్నం చేయి ఎక్కువ తక్కువ చేస్తే తోక కత్తిరించేస్తాడు అని ఛాయా అంటుంది. సరేనండి అని హరీష్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella