NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ సంతోష పడే మాట చెప్పిన మురారి.. ముకుంద ప్లాన్..రేవతి కంగారు..నిజం రాబట్టిన మధు..

Krishna Mukunda Murari Today Episode Serial 09 November 2023 Episode 309 Highlights

Krishna Mukunda Murari November 9 Episode 309 Highlights: నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ ఎప్పటికైనా మురారి మారతాడు, తనకి గతం గుర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. కృష్ణ ఇంట్లో కాఫీ తాగుదామని వచ్చిన మురారి కి, ఇంట్లో గ్యాస్ అయిపోవడం వల్ల కృష్ణ కాఫీ ఇవ్వలేను అని అంటుంది. మా ఇంట్లో కాఫీ తాగుదాం రండి అని కృష్ణుని తీసుకొని మురారివాళ్ళ ఇంటికి వెళ్తారు.ఇదంతా చూసి రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ ఒకేసారి కుడికాలు లోపల పెట్టి రావడం ముకుంద చూస్తుంది. వాళ్ళని అలా చూసి ముకుందా కోపంతో రగిలిపోతుంది. మురారిని స్వయంగా వెళ్లి కృష్ణ కి కాఫీ చేసి తీసుకు వస్తాడు. మురారి లో మార్పు చూసి ముకుంద ఏదో ఒక విధంగా వీళ్ళని విడదీయాలి అని డిసైడ్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights

ఈరోజు 309 వ ఎపిసోడ్ లో, కృష్ణ దేవుడి ఎదుట దండం పెట్టుకుంటూ, స్వామి నువ్వు ఇంత తొందరగా నా మొరాలకిస్తావని అనుకోలేదు, ఏసీబీ సార్ నాకు ఇంత తొందరగా దగ్గర అవుతారని కూడా అనుకోలేదు అని అనుకుంటూ ఉండగా అక్కడికి రేవతి వస్తుంది. ఇక కృష్ణ రేవతిని పట్టుకొని గిరగిరా తిప్పేస్తూ చాలా సంతోషపడుతూ అత్తయ్య అని అరుస్తూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మా ఏసీబీ సార్ కి గతం గుర్తొచ్చేటట్టుంది. ఏసీబీ సార్ కి తెలియకుండానే వాళ్ళ రూంలోకి నన్ను తీసుకెళ్లాడు అంటే ఏమిటి అర్థం ఇది ఒక డాక్టర్ గా చెప్తున్నాను అత్తయ్య కచ్చితంగా ఆయనకి గతం గుర్తొచ్చేటట్టు ఉంది అని అంటుంది కృష్ణ. ఆయనకు తెలియకుండానే నాతోఆయన ఏదో ఒక బంధాన్ని ఊహించుకొని ఇక్కడికి వస్తున్నారు అత్తయ్య. నాకోసం నేను నిద్రలేచేసరికి వాకిలి ముందు ఉంటున్నాడు. కచ్చితంగా ఆయనకి గతం గుర్తొస్తుంది అని అంటుంది కృష్ణ రేవతి తో, అంతే అంటావా తింగరి పిల్ల అని అంటుంది రేవతి. ఆయన మెదడులో కొట్టుకుంటున్న నేను మనసులోకి వచ్చేసి బయటపడితే అంతే చాలు అని అంటుంది. అప్పుడే అక్కడికి ముకుంద ఎంట్రీ ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode  November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights

మీ ఆటలు ఇంకా సాగవు అన్న ముకుందా..

కృష్ణ చెప్పే మాటలు వింటూ అది జరగదు అని అంటూ ముకుంద ఎంట్రీ ఇస్తుంది. ముకుందని చూసి కృష్ణ ఇలాంటి తాటాకు చప్పులకి మనం దడవాల్సిన అవసరం లేదు అత్తయ్య అని అంటుంది. ఏసీబీ సార్ నన్ను గుర్తు పట్టబోతుంటే ఇక ఇలాంటి మాటలు విని మనం భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య అని అంటుంది. బాగా చెప్పావు తింగరి అని అంటుంది రేవతి. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అని అంటుంది ముకుందా, జాలిపడు త్వరగా మేమంతా నిన్ను చూసి జాలి పడే రోజు వస్తుంది ముకుందా అంటుంది కృష్ణ. నవ్వు కృష్ణవేణి ఈ నవ్వులు ఎక్కువ రోజులు ఉండవు. అందుకే జీవితానికి సరిపడే అంత నవ్వు నవ్వు, ఈ రెండు మూడు రోజుల్లోనే నీ నవ్వు అంత నవ్వేసి ఎందుకంటే తర్వాత నీకు నవ్వే అవకాశం ఉండదు. ఏంటి పిచ్చి గాని పట్టిందా అని అంటుంది రేవతి. నాకు కాదు పిచ్చి నేను చేసే పని చూసి మీకు మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పడుతుంది ఖచ్చితంగా, అని అంటుంది ముకుంద.నేను ఇప్పుడే ఒక ప్లాన్ వేసాను ఆ ప్లాన్ తిరుగులేకుండా సక్సెస్ అవుతుంది అప్పుడు మీ ఇద్దరు అత్త కోడళ్ళకి పిచ్చి ఖచ్చితంగా పడుతుంది అని అంటుంది ముకుందా, నేను చెప్తే నమ్మట్లేదు కదా మీరు అని అంటుంది ముకుందా. త్వరలోనే మీరు నాకు అసలైన అత్తగారు కాబోతున్నారు అని అంటుంది ముకుంద. ముకుందని అరుస్తుంది రేవతి. మీరంతా అనుకున్న, కృష్ణ అంత గింజుకున్నా జరిగేది ఇదే అని అంటుంది ముకుందా, మనసులో ఫిక్స్ అయిపోండి ఇంకా అని అంటుంది. తనతో నా భవిష్యత్తు దత్తయ్య మురారితో నా భవిష్యత్తు డిజైన్ చేసేసాను అని అంటుంది. ఇలాంటి మాటలు అన్ని అంతకుముందు కూడా జరగలేదు భవిష్యత్తు కూడా జరగదు. అసలు భవిష్యత్తు గురించి నీకేం తెలుసు అని అంటుంది కృష్ణ. ఇదివరకు ఏదో ప్రేమని వెలగబెట్టినంత మాత్రాన జీవితాంతం శాశ్వతంగా నిలబడి పోతుందని నువ్వు అనుకోకు, నేను ఉండంగా అది జరగదు అని అంటుంది కృష్ణ. నాకు తెలుసు కృష్ణ అందుకే నువ్వు లేకుండా ఎవరూ లేకుండా నేను ఒక చిన్న ప్లాన్ వేశాను. సరే చేసేది చెప్పడం నాకు అలవాటు లేదు కానీ మళ్ళీ నా మురారి ఇక్కడికి వచ్చి వేణి వేణి అనుకుంటూ ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేసాను. అదేంటో మీకు చెప్పనులే ఉంటాను అని వెళ్లబోతూ నేను వెళ్ళిన తర్వాత కృష్ణని మల్లి అదలానే మాట్లాడుతుంది దాని మాటలు పట్టించుకోకు ఇలాంటివి చెప్పి మోసం చేయకండి అత్తయ్య. అని అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ముకుంద.

Krishna Mukunda Murari: క్రిష్ణా అనుకున్నది చేయనివ్వన్న ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari  Serial Today Episode November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode November 9 2023 Episode 309 Highlights

రేవతి కోపం..

ఇక ముకుంద కృష్ణ మురారి ముగ్గురు బయటికి వెళ్దాం అనుకుంటారు. కృష్ణ కారు దగ్గరికి వచ్చి మురారి పక్కన కూర్చుందాం అనుకునే టయానికి ముకుందా వచ్చి ఈ సీట్ నాది నువ్వు వెనక కూర్చొని అంటుంది అదంతా రేవతి చూసి పక్కనే ఉన్న మధు తో, చూసావా మధు కృష్ణ ని వెనక్కి ఎలా రమ్మని చెప్పిందో, వాళ్ళిద్దరి మధ్యలో ముకుందని దూరం చేయాలి రా అని అంటుంది మధు తో రేవతి. ఇక వాళ్ళు ముగ్గురూ వెళ్ళిన తర్వాత, రేవతి కోపంగా కూరలు తరుగుతూ ఇది ఎక్కువ చేస్తుంది మరీ అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మధు వచ్చి ఏంటి పెద్దమ్మ కూరలు ఇక్కడ కట్ చేస్తున్నావ్ అని అంటాడు. కృష్ణ మురారి పక్కన కూర్చోవాలి అని అనుకుంటే దాని వెనక్కి నెట్టేసింది చూశావు కదా ఇందాక నువ్వు ముకుందని అని అంటుంది. ముకుంద ఏదో ప్లాన్ వేసింది రా అదేంటో అర్థం కావట్లేదు అని మధు తో అంటుంది రేవతి. ఇదంతా భవాని పెద్దమ్మ చేసిన పని, ముకుందని బాగా అలసి ఇచ్చింది ఇప్పుడు కృష్ణతో తిరగడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది అని అంటాడు మధు. నాక్కూడా అదే అనిపిస్తుంది రా లేదంటే ముకుంద మొదట్లో ఇలా లేదు ఇప్పుడు మరీ రెచ్చిపోతుంది అని అంటుంది రేవతి మధు తో, అక్కయ్యకి ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడే కృష్ణ నుంచి మధుకి మెసేజ్ వస్తుంది. నాకు ఇప్పుడే ఒక అనుమానం వచ్చింది అది ఏంటంటే, అని మెసేజ్ సగం చదువుతాడు అంతలో రేవతి ఏంటంట్రా దాని అనుమానం అని అంటుంది. పెద్దమ్మ కృష్ణకి వచ్చిన అనుమానం 100% కరెక్ట్ అని అంటాడు. అదేంటి అంటే ట్రీట్మెంట్ కోసం మురారిని అమెరికా వెళ్ళమని చెప్పింది కదా పెద్దమ్మ తోడుగా ముకుంద కూడా వెళ్తుంది కదా ఇక అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి ఇండియాకి వద్దు, మనం ఇక్కడే ఉందాము అని వీసా తీసి పడేసి ముకుందా అక్కడే ఉంటుందేమో అని కృష్ణ అనుమాన పడుతుంది అని రేవతితో చెప్తాడు మధు. ఆ మాట విని రేవతి షాక్ అవుతుంది. నిజంగా అదే జరుగుతుంది అంటావా అని అంటుంది. ఏమో పెద్దమ్మ జరిగిన జరగొచ్చు అంటాడు మధు.దేవుడా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపు అని రేవతిదండం పెట్టుకుంటుంది.

Nuvvu Nenu Prema:కౌన్ డౌన్ మొదలైంది అన్న కృష్ణ…పద్మావతి విక్కీలను ఒప్పందం కృష్ణ ఇంట్లో చెప్పనున్నాడా?

Krishna Mukunda Murari  Serial Today Episode November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Serial Today Episode November 9 2023 Episode 309 Highlights

మురారి ట్రిప్పు క్యాన్సిల్ చేయమన్న మధు..

ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కృష్ణా ముకుందా మురారి వస్తారు. మధు పెద్దమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు అసలు ఏం జరిగిందో నేను మురారిని కనుక్కొని చెప్తాను అని అంటాడు. ఇక మధు మురారిని పక్కకు పిలుస్తాడు. ఏంటి మధు నన్ను ఇక్కడికి రమ్మన్నావు మాట్లాడడానికి అని అంటాడు. ఏం లేదు మురారి ఇద్దరితో కలిసి షాపింగ్ కి వెళ్ళావు కదా ఆడవాళ్ళతో షాపింగ్ చాలా కష్టంగా ఉంటుంది కదా అని అంటాడు. అలాంటిదేం లేదు అని అంటాడు మురారి ఇంతలో మురారి కి కృష్ణ గురించి తన గతంలో ఎంత బడికి ఉందో మధుకి తెలిసే ఉంటుంది అడుగుదాము అని అనుకొని వద్దులే మళ్ళీ పెద్దమ్మకు తెలిసిందంటే బాధపడుతుంది అని ఆగిపోతాడు. ఇక మధు తో అసలు ఏంటి చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు. ఏం లేదు నువ్వు అమెరికాకి చూపించుకోవడానికి ట్రిప్ వెళ్తున్నావ్ కదా అది వెళ్లకుండా ఉంటే మంచిది కదా అని అంటాడు. ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతాడు మురారి.ఏం లేదు ఇక్కడైనా అక్కడైనా ఒకటే డాక్టర్స్ కదా ఇక్కడి వాళ్ళే అక్కడికి వెళ్లివైద్యం చేస్తున్నారు అలాంటప్పుడు నువ్వు అమెరికా వెళ్లాల్సిన పని ఏముంది ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు మధు. మధు ఎంత చెప్పినా కానీ మురారి కాన్వెంట్స్ అవ్వడు ఎందుకంటే ఇది పెద్దమ్మ నిర్ణయం పెద్దమ్మకి నేను ఎదురు చెప్పలేను అయినా ఇక్కడికన్నా నాకు అక్కడే బెటర్ అనిపిస్తుంది ఒకసారి వెళితేనే కదా తెలిసేది. నేను ట్రీట్మెంట్ తీసుకోవడానికి అదే కరెక్ట్ అయిన ప్లేస్ అనిపిస్తుంది అని అంటాడు మురారి. ఇక్కడ ఉంటే అన్నీ కన్ఫ్యూజన్ గా ఉంటుంది అదే అక్కడికి వెళ్లాను అనుకో నేను ముకుంద ఇద్దరే ఉంటాము ఇక్కడ అందరినీ చూస్తూ నాకు గతం గుర్తు రాక చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది అని అంటాడు మురారి. ముకుంద అసలే ఒప్పుకోదు పెద్దమ్మ ఒప్పుకోదు, అని అంటాడుమురారి.ఎందుకు ఒప్పుకోదు ముకుందా అని అంటాడుమధు.ఏమో అదంతా నాకు తెలియదు అని అంటాడు మురారి ఇక మధుకి అర్థం అయిపోతుంది ముకుంద ప్లాన్ చేసే మురారిని తీసుకువెళుతుందని ఈ విషయం అర్జెంటుగా పెద్దమ్మకి చెప్పాలి అని అనుకుంటాడు. నీ దగ్గర గ్యాస్ పాడ్ నెంబర్ ఉంటే ఇవ్వు అని మధు దగ్గర నెంబర్ తీసుకుంటాడు మురారి ఎందుకు అని అడుగుతాడు తర్వాత చెప్తాలే అంటాడు మురారి సరే అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights

కృష్ణబాధ..

కృష్ణ గతం గుర్తు చేసుకుంటూ,మురారి తనతో క్లోజ్ గా ఉండడానికి చూసి, తనకు దగ్గరవుతున్నారు అని అనుకోవాలా లేదంటే తనకసలు గతం గుర్తుకొస్తుందో రాదో అని భయపడుతూ బాధపడుతూ ఉంటుంది కృష్ణ అప్పుడే అక్కడికి గ్యాస్ వాడు గ్యాస్ బండ తీసుకొని వస్తాడు. ఎవరు చెప్పారు గ్యాస్ తీసుకురమ్మని అని అంటుంది కృష్ణ మురారి సార్ పంపించాడు అని చెప్తాడు. వెంటనే కృష్ణ సంతోషపడుతుంది మురారి కి గతం గుర్తుకొచ్చేస్తుంది ఇక అందుకే నా గురించి ఆలోచిస్తున్నారు అని అనుకుంటుంది. ఇక అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. నేను చెప్పకపోయినా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని తనే పంపించాడు అంటే నా మీద ఎంత ఆలోచన ఉందో అని అనుకుంటుంది కృష్ణ మనసులో, ఇక గ్యాస్ వాడు పెట్టేసేసి వెళ్తూ ఉండగా మురారి ఎదురవుతాడు. మీరు చెప్పినట్టే గ్యాస్ పెట్టేసాను సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

Brahmamudi:హీరోయిన్ తో రాజ్ స్టెప్పులు.. ప్రోమో చూస్తే అదిరిపోవాల్సిందే?

Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights
Krishna Mukunda Murari Today Episode November 9 2023 Episode 309 Highlights

మురారి కన్ఫ్యూజన్..

ఇక మురారి రాగానే కృష్ణ మీకు గ్యాస్ అయిపోయిన విషయం బాగానే గుర్తుంది అని అంటుంది. నాకు ఒకసారి బానే గుర్తొస్తున్నాయి కృష్ణ అని అంటాడు మరి పూర్తిగా మెమరీ లాస్ అయిపోలేదు అని అంటాడు. అయినా నాకు చంటి పిల్లాడికి పెద్ద తేడా ఏమీ లేదు కృష్ణ ఇంకా వాడికైనా గతం గుర్తొస్తుంది నాకు పూర్తిగా గతం గుర్తు రాదు అట్లా అని భవిష్యత్తు గురించి ఏం ఆలోచించమంటావు చెప్పు అని అంటాడు. అయ్యో సార్ అలా అనమాకండి అని అంటుంది కృష్ణ. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకేం కాలేదు అని అంటుంది కృష్ణ. నిజంగానే చెప్తున్నావా అందరిలాగానే నన్ను భ్రమలో పెట్టి నిజమని నమ్మించాలని చూస్తున్నావా అని అంటాడు మురారి. ఇలాంటి ఆలోచనలు మీరు చేయడం మంచిది కాదు సార్ మీరు తొందరగానే క్యూర్ అవుతారు అని అంటుంది. ఎలా కృష్ణ వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు మా అమ్మ వాళ్లు వీళ్లు ఎవరో అని నాకు నేనే చెప్పుకోవాలంటావా అని అంటాడు. నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అనే కానీ నేను ఎవరో గెస్ట్ గా ఉంటున్నాను కానీ ఓన్ గా అది నాఇల్లు అని ఫీలింగ్ కలగట్లేదు కృష్ణ అని అంటాడు మురారి. గతంలో నేనేం చేసే వారిని నా ఫ్రెండ్స్ ఎవరు నేను జాబ్ చేస్తే నా కొలీగ్స్ ఎవరు బిజినెస్ చేస్తే నా పార్ట్నర్స్ ఎవరు ఇలా నాకు ఏది సమాధానం దొరకట్లేదు. ఇలా ఆ ప్రశ్నలన్నింటికీ నాకు సమాధానం దొరక నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక ఆ ఇంట్లో కూడా నేను పరాయివాడిలానే ఉంటున్నాను అని అంటాడు మురారి. మీరు ఈ ఆలోచనలు అన్నిటి నుంచి బయటపడండి సార్ అన్ని అవే సర్దుకుంటాయి అంటుంది కృష్ణ. కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి కృష్ణ అని అంటాడు.

Madhuranagarilo November 08 2023 episode 204: హాస్పటల్లో పండు ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రుక్మిణి..

కృష్ణ ఆనందం..

ఆ ఇంట్లో నేను ఎలా ఉన్నా కానీ నాకు ఆ ఇంట్లో ఎవరూ నా వాళ్ళని అనిపించట్లేదు అని అంటాడు మురారి. కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి కృష్ణ అని అంటాడు. ఏంటో చెప్పండి అని అంటుంది. నువ్వు ఏమనుకున్నా సరే చెప్పాలనుకున్నది చెప్తున్నాను అని అంటాడు మురారి. ఎవరిని చూసినా నా వాళ్ళు అన్న ఫీడింగ్ కలగలేదు కానీ నిన్ను చూస్తే మాత్రం నువ్వు నా దానివే అన్న ఫీలింగ్ కలుగుతుంది అని అంటాడు మురారి. ఆ మాటకు కృష్ణ చాలా సంతోషపడుతుంది. దయచేసి తప్పుగా అనుకోకు,ఇది అబద్ధం కాదు ఖచ్చితంగా నిజం. నేను ఎవరిని చూసినా రాని ఫీలింగ్ నిన్ను చూడంగానే నువ్వు నా దానివి అనిపిస్తుంది నీతో నాకు ఏదో బంధం ఉందనిపిస్తుంది. నీతోనే మాట్లాడాలి అనిపిస్తుంది అని అంటాడు మురారి మీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావచ్చు మీరు నాతో ఏది మాట్లాడాలనుకున్న మాట్లాడొచ్చు,నేను కూడా ఇది ఒక డాక్టర్ లాగా ఒక ఫ్రెండ్ లానే చెప్తున్నాను మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని అంటుంది కృష్ణ. మురారి అన్నమాటలకి కృష్ణ చాలా సంతోషపడుతుంది. కెసిపి సార్ మనసులో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అని అర్థమవుతుంది కృష్ణ కి. ఇక మురారి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్లి కృష్ణకి ఒక సారి గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇస్తాడు. ఇది నీకోసమే తీసుకొచ్చాను అని అంటాడు. ఎందుకు సార్ ఇది అంటుంది నా కృతజ్ఞతతో నేను ఇస్తున్నాను అని అంటాడు మురారి. చీర చాలా బాగుంది అని అంటుంది కృష్ణ. రేపు నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు నువ్వు ఇదే కట్టుకోవాలి అని అంటాడు మురారి.ఆ చీర చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకోసం తీసుకొచ్చారా అని అంటుంది అవును నీకోసమే తీసుకొచ్చాను, నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది అందుకే తెచ్చాను. ఈ కలర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని అంటుంది కృష్ణ. ముకుందతో నేను అమెరికా వెళ్లాలి అప్పుడు నువ్వు ఏర్పాటుకు వచ్చేటప్పుడు తప్పకుండా ఈ చీర కట్టుకొని రావాలి మా పెద్దమ్మ నేను అమెరికా వెళ్ళకపోతే ఊరుకోదు అని అంటాడు ఇక ఆ మాటకి కృష్ణ బాధపడుతూ ఉంటుంది. నువ్వు తప్పకుండా ఎయిర్ పోర్ట్ కీ వస్తావు కదా అంటాడు. ఆరోజు ఎప్పటికీ రానివ్వను సార్ అని మనసులో అనుకుంటుంది కృష్ణ. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నీకు వీడియో కాల్ చేయచ్చు కదా అంటాడు మురారి తప్పకుండా అని అంటుంది కృష్ణ సరేనా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి.కృష్ణ చీర ఇచ్చినందుకు సంతోషపడుతుంది. అమెరికా వెళుతున్నందుకుబాధపడుతూ ఉంటుంది ఇక ఎవరిని చూసినారు అని ఆలోచన నిన్ను చూస్తే వస్తుందని మురారి చెప్పడం తలుచుకొని ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటుంది కృష్ణ.

రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి ఇచ్చిన చీర కట్టుకొని అద్దంలో చూసుకుంటూ మిమ్మల్ని ఎప్పటికీ అమెరికా వెళ్ళనివ్వను అని అంటుంది. అప్పుడే అక్కడికి మురారి వస్తాడు ఇదేంటి చీరిపుడే కట్టుకున్నారు ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు కట్టుకొని రమ్మన్నాను కదా అని అంటాడు. మీకు కాఫీ కావాలి కదా ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అని అంటుంది కృష్ణ నిజం చెప్పాలంటే కాఫీ కోసం కాదు వచ్చింది. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అని అంటాడు మురారి.ఆ మాటకి కృష్ణ సంతోషపడుతుంది

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu