Nuvvu Nenu Prema Today November 9 2023 Episode 463: నిన్నటి ఎపిసోడ్ లో పద్మావతి గుడిలో విక్కీ పుట్టినరోజు సందర్భంగా తులాభారం ఇవ్వాలనుకుంటుంది. కృష్ణ ఎన్నో అడ్డంకులు పెట్టిన చివరికి పద్మావతి విక్కీ కీ తులాభారం ఇస్తుంది. కృష్ణ తులాభారం సక్సెస్ అయినందుకు చాలా బాధపడతాడు. ఇక పద్మావతి తులాభారం సక్సెస్ అయినందుకు సంతోషించి విక్కీ దగ్గరికి వెళ్లి మన ప్రేమ నిజమైందని ఇప్పుడు రుజువైంది అని అంటుంది. కానీ విక్కీ పద్మావతిని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఇంకొక మూడు నెలలు మాత్రమే మనిద్దరం కలిసి ఉంటాము తర్వాత నీ దారి నీదే అని తెగేసి చెప్తాడు. ఈ మాటలన్నీ కృష్ణ దూరం నుంచి వింటాడు.

ఈరోజు 463 ఎపిసోడ్ లో,గుళ్లో అన్న మాటలకి పద్మావతి బాధపడుతూ, విక్కీ మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకుంటూ ఇంకొక మూడు నెలలు మాత్రమే ఇంట్లో ఉండాలి తర్వాత వెళ్లిపోవాలి నేను ఎంత ప్రయత్నించినా విక్కీ ప్రేమ పొందలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది.అప్పుడే ఎదురుగా ఉన్న గరుడ బండితో మాట్లాడుతూ నేను ఎంత ప్రయత్నించినా గరుడ విక్కీ మనసు మాత్రం మారట్లేదు అని అంటుంది దానికి నువ్వు ఇంత డల్ గా ఉంటే ఎట్లా అమ్మి పద్మావతి అంటే ఎలా ఉండాలి, నువ్వు నీలానే ఉండాలి ఇదంతా దేవుడి పెట్టే పరీక్ష అనుకో నీకు ఏదో ఒక రోజు ఈ పరీక్షలోనికి విక్కీ మనసు గెలుచుకుంటావు అని గరుడ ధైర్యం చెప్పి పద్మావతిని ఎంకరేజ్ చేస్తాడు.
Krishna Mukunda Murari: ఆదర్శ్ రీ ఎంట్రీనా.!? అందుకేనా ఈ సస్పెన్స్?

కౌంట్ డౌన్ మొదలైంది అన్న కృష్ణ..
ఇక పద్మావతి గరుడ చెప్పిన మాటలకు సరే ఇక నేను పద్మావతి లానే ఉంటాను ఇలా ఎప్పుడు డల్లుగా ఉండను అని చెప్పి నేను భయపడను వికీప్రేమను సాధిస్తాను అని అంటుంది అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి బెలూన్ పగలగొడతాడు వెంటనే పద్మావతి ఉలిక్కిపడుతుంది. ఇప్పుడేగా నేను భయపడను అని అన్నావు ఇంతలోనే భయపడ్డావేంటి పద్మావతి అని అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా అని పద్మావతి స్టార్ట్ చేయబోతుంటే కాస్త అగుతావా అని అంటాడు. నువ్వు చెప్పేదంతా తర్వాత వింటాను కానీ ముందు నేను చెప్పేది విను అని అంటాడు.ఏం చెప్తావు నువ్వు నీ గురించి నిజం తెలిస్తే నేనే చెప్పాల్సి వస్తుంది అని అంటుంది నిజం నా గురించి తర్వాత చెబుదువు గాని పద్మావతి ఇంట్లో వాళ్లకి ముందు నీ గురించి తెలిసింది దాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పమంటావా అని అంటాడు. నా గురించి నిజం తెలిసిందా ఏం నిజం తెలిసింది అని పద్మావతి షాక్ అవుతుంది. వెంటనే కృష్ణ మీరిద్దరూ గుళ్లో మాట్లాడుకున్నది నేను విన్నాను. మీ మూడు నెలల ఒప్పందం ఆరు నెలల ఒప్పందం అన్నీ నాకు తెలిసిపోయాయి ఇప్పుడు ఈ విషయం గనుక ఇంట్లో వాళ్లకి చెప్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి అని అంటాడు. ఆ మాటలకి పద్మావతి షాక్ అవుతుంది. ఇంకిప్పుడు అర్థమైంది కదా పద్మావతి నేనంటే ఏంటో ఎప్పుడైనా బాంబు బ్లాస్ట్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండు అని అంటాడు.
Brahmamudi:హీరోయిన్ తో రాజ్ స్టెప్పులు.. ప్రోమో చూస్తే అదిరిపోవాల్సిందే?

విక్కీ పుట్టినరోజు ఏర్పాట్లు..
ఇక పద్మావతి వికీ పుట్టినరోజు కి ఒంట్లో వాళ్ళు అంత ఏర్పాటు చేస్తూ ఉంటే డల్ గా ఉంటుంది. పద్మావతి ఎందుకు అలా ఉంది అని ఇంట్లో అందరూ వరుసగా అడుగుతూ ఉంటారు పద్మావతిని. కానీ కృష్ణ క్రితం తెలిసిపోయింది ఎప్పుడైనా ఇంట్లో అందరికీ చెప్పేస్తాడేమోనని పద్మావతి భయపడుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక డల్లుగా ఉంటుంది. ఇక పద్మావతిఎందుకు అలా ఉన్నది అని కంగారుపడుతూ అరవింద అడుగుతుంది నారాయణగూడ ఎందుకలా ఉన్నావో చెప్పమ్మా అని అంటాడు. కుచల కావాలని గ్రాండ్ గా హోటల్ లో పార్టీ చేద్దామనుకున్నావా మేము ఇంట్లో ఏర్పాటు చేశామని అలా ఉన్నావా అని అంటుంది. ఇక పద్మావతి ఎంత అడిగినా ఎవరూ చెప్పకపోవడంతో ఇక పద్మావతి ఇలా కాదు నేను డల్లుగా ఉంటే వీళ్ళందరికీ డౌట్ వస్తుంది నేను విక్కీ పుట్టినరోజుకి వీళ్లంతా సంతోషంగా చేసుకోవాలనుకుంటుంటే నేను ఇలా ఉండకూడదు అని తనకి తానే చెప్పుకొని, నేను ఇలా ఉంటే మీరు ఎలా ఉంటారో చూద్దామని డల్లుగా ఉన్నాను వదిన అని అంటుంది.పద్మావతి అన్న మాటలకి అరవింద అలా ఉంటే మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అంటుంది. ఇక వెళ్లి విక్కీని తీసుకొని వస్తాను అని అంటుంది పద్మావతి విక్కీ కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కేక్ కటింగ్ కి, పద్మావతి నేను వెళ్లి తీసుకొస్తాను విక్కీ సార్ ని అని వెళుతుంది.

పుట్టినరోజుకి విక్కీని ఒప్పించిన పద్మావతి..
ఇక విక్కీ పని చేసుకుంటూ ఉంటాడు అంతలో పద్మావతి వెళ్లి మీరు పుట్టినరోజు, వేడుకలు కింద ఏర్పాటు చేస్తుంటే మీరు ఇక్కడ ఒకల్లే కూర్చొని ఏం చేస్తున్నారు అని అంటుంది. నీ పని నువ్వు చూసుకో అని అంటాడు విక్కీ. నా పని మీతోనే కదా అని అంటుంది పద్మావతి. పుట్టినరోజుకి అందరూ ఏర్పాట్లు చేశారు రండి మీరు వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళండి అని అంటుంది. ఎంత చెప్పినా విక్కీ మాత్రం ఒప్పుకోడు తర్వాత పద్మావతి వికీ ని ఎలాగైనా కన్వెస్ట్ చేసి కిందకు తీసుకెళ్లాలి అని అనుకుంటుంది. ఇక పద్మావతిమీకు నేను ఒక విషయం చెప్తాను మీకు నచ్చితేనే వినండి లేదంటే లేదు అని అంటుంది. విక్కీతో పద్మావతి మనిద్దరం మూడు నెలలు కలిసి ఉండాలని మీరు అగ్రిమెంట్ పెట్టారు కదా, అగ్రిమెంట్ ప్రకారం మనం ఇంకొక కొన్ని రోజుల్లో విడిపోతాము. మరి అప్పటిదాకా ఇలా కొట్టుకుంటూ అందరికీ అనుమానం వచ్చేలా ఉండడం ఎందుకు అందుకనే నేను ఒక ఐడియాతో మీకు చెప్తున్నాను. మనం ఈ మూడు నెలలు కలిసి ఉందాం ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటుంది ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది పద్మావతి. పద్మావతి అన్న మాటలతో విక్కీ నిజమే కదా ఈ మూడు నెలలు కలిసి ఉంటే పద్మావతి గొడవ వదిలిపోతుంది తను వెళ్లడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఇంక పద్మావతి తో గొడవ పడకుండా ఉండడం నయం అని అనుకుంటాడు. ఇక పద్మావతి ఒక డ్రెస్ తీసుకొచ్చి విక్కీకి ఇచ్చి డ్రెస్ వేసుకోండి అని అంటుంది. నువ్వు చెప్పిన డ్రెస్ వేసుకుంటాను అని చెప్పలేదు నేనెప్పుడూ నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు నీ డ్రెస్ వేసుకొని అని అంటాడు. ఈ సంవత్సరం నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోండి వచ్చే సంవత్సరం మీ ఇష్టం ఇప్పుడు మాత్రం వేసుకోండి అని అంటుంది ఇక విక్కి పద్మావతి ఇచ్చిన డ్రెస్ ని వేసుకొని రెడీ అవుతాడు. విక్కీ డ్రెస్ లని పద్మావతి దాచేస్తుంది ఇక చేసేదేం లేక పద్మావత ఇచ్చిన డ్రస్సు వేసుకొని వస్తాడు.

విక్కీ కి ముద్దు పెట్టిన పద్మావతి..
ఇక నీట్ గా రెడీ అయ్యారు కానీ తల దువ్వుకోలేదు అని పద్మావతి విక్కి ని కూర్చోబెట్టి తల దువ్వుతూ ఉంటుంది. విక్కీ నేనేమైనా చిన్నపిల్లలు అనుకున్నావా ఏంటి అని అంటాడు. మీరు చిన్నపిల్లలు కాకపోయినా కిందకి నీటుగా వెళ్లాలి కదా అని అంటుంది. నేను బానే ఉన్నాను కదా అని అంటాడు కాదు సార్ తల దువ్వుకోండి సరిగ్గా నేను దువ్వుతాను రండి అని పద్మావతి విక్కి ని తల దువ్వుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ పద్మావతి అని అడుగుతాడు ఈ మూడు నెలలే కదా సారు ఆ తర్వాత మీ ఇష్టం ఈ మూడు నెలలైనా నాకు ఈ చిన్న చిన్న సంతోషాల్ని దూరం చేయకండి, హనీ పద్మావతి అనగానే విక్కీ ఒకసారిగా శాఖై పద్మావతి కళ్ళల్లోకి చూస్తాడు ఇక ఇద్దరు కొంచెం సేపు అలా చూసుకున్నాక పద్మావతి విక్కి కి ముద్దు పెట్టి ఐ లవ్ యు చెప్తుంది. నీకు అసలు బుద్ధుందా ఏం చేస్తున్నావ్ అని అంటాడు. బుద్ధుంది కాబట్టే మీకు ముద్దు పెట్టాలనిపించింది పెట్టాను అని అంటుంది.అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అనంగానే, చిన్నచిన్న ఆనందాన్ని నాకు దూరం చేయొద్దు అని చెప్పాను కదా సారు ఈ మూడు నెలలే కదా నన్ను భరించండి అని అంటుంది.
విక్కీ కోసం ఎదురుచూస్తున్న ఇంట్లో వాళ్ళు..
ఇక పద్మావతి వెళ్లి ఇంకా తీసుకురాలేదేంటి విక్కీ ని అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, ఈ అర్య ఇంకా రాలేదేంటి పద్మావతి అని అంటాడు. విక్కీకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు ఈ డ్యామేజ్ గర్ల్స్ సారీ వచ్చి ఇప్పుడు మారుస్తా అంటే విక్కి ఎందుకు మారతాడు కోపంతో రగిలిపోతూ ఉండుంటాడు విక్కీ కచ్చితంగా కిందకి రాడు. ఈ పుట్టినరోజు కూడా లేనట్టే అని అంటుంది కుచల. కృష్ణ కూడా నాకు అదే అనిపిస్తుంది రానమ్మ అని అంటాడు అప్పుడే అక్కడికి పద్మావతి విక్కీ ఇద్దరు వస్తారు. వెంటనే నారాయణ చూశారుగా డ్రైవరు రారని అన్నారు ఇక్కడ వచ్చాడుగా అని అంటాడు. మనము చాలా కష్టపడి డెకరేషన్ చేశామని వచ్చాడు ఆ పద్మావతి కోసం కాదు అని అంటుంది. నువ్వు మాత్రం మారవే అని అంటాడు నారాయణ కుచలతో, ఇక పద్మావతి విక్కీ ఇద్దరికీ కుటుంబ సభ్యులందరూ పూలు జల్లి వెల్కమ్ చెప్తారు. మీ ఇద్దరి వల్ల ఇంటికి ఇంత కల వచ్చింది విక్కీ అని అంటాడు నారాయణ.పద్మావతి మీరెప్పుడూ మా విక్కీ పక్కనే ఉండాలి. అప్పుడే తనతో పాటు మేము కూడా సంతోషంగా ఉంటాము అని అంటుంది అరవింద. నా ప్రాణం పోయినా సరే నేను మీ చేతిని విడిచిపెట్టను సారు అని మనసులో అనుకుంటుంది పద్మావతి. నా మనసులో నీకు భార్యగా స్నానం లేదు నువ్వు ఎంత చేసినా వేస్ట్ పద్మావతి అని మనసులో అనుకుంటాడు విక్కి. విక్కీ చేతిని వదలకుండా నువ్వెంత గట్టిగా పట్టుకున్న విడగొట్టడానికి నేనున్నాను కదా పద్మావతి అని కృష్ణ కూడా మనసులో అనుకుంటాడు. మీరిద్దరూ ఇలానే కలిసిమెలిసి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అని కృష్ణ అందరి ముందు చెప్తాడు.ఇక అన్ని బానే ఉన్నాయి కేక్ ఏది అని అంటాడు ఆర్య. పద్మావతి తన చేత్తో తనే విక్కీ కోసం కేక్ రెడీ చేసింది తీసుకొస్తాను అని అంటుంది ఆర్య. కేకు ఆర్డర్ ఇచ్చి తెప్పియచ్చు కదా అని అంటుంది. బయట కేకు బయటకు ఏకే అవుతుంది మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం మనం ప్రేమతో కేక్ చేసి తీసుకొస్తే అది చాలా బాగుంటుంది అని అంటుంది పద్మావతి.
రేపటి ఎపిసోడ్ లో, అరవింద పద్మావతిని విక్కీ పుట్టినరోజు సందర్భంగా డాన్స్ వేయమని అడుగుతుంది. విక్కీ అరవింద కు కేక్ తినిపించబోతుంటే ముందు నాకు కాదు మీ బెటర్ హాఫ్ అయినా పద్మావతికి నువ్వంటే ప్రాణమిచ్చే పద్మావతికి తినిపించు అని అంటుంది. విక్కీ అలానే పద్మావతికి కేక్ తినిపిస్తాడు.