Nagagbabu: ఒకప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో టిఆర్పి రేటింగ్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. గురువారం మరియు శుక్రవారం ప్రసారమయ్యే ఈ షోకి భారీ ఎత్తున జనాల నుండి రెస్పాన్స్ వచ్చేది. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులలో ఈ షోకి ఉండే ఆదరణ బట్టి ఆ టైంలో సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఒకానొక సమయంలో ఇండస్ట్రీ వాళ్ళు భయపడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఈ షో ఇప్పుడు తక్కువ టిఆర్పి రేటింగ్ తో రన్ అవుతుంది. నాగబాబు మరియు రోజా షోకి జడ్జీలుగా ఉన్న సమయంలో… అందరూ కూడా చాలా కలిసి అద్భుతమైన పర్ఫామెన్స్ చేసి మంచి స్కిట్లతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవారు.
ఎప్పుడైతే ఈ షో నుండి నాగబాబు వెళ్ళిపోవటం జరిగిందో తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి. షోలో చమ్మక్ చంద్ర ఇంకా ఆరిపి పలువురు… కీలక కమెడియన్స్ షో నుండి బయటకు వచ్చేశారు. ఇంకా రేష్మి మరియు అనసూయ వంటి వారు సైతం షో నుండి బయటకు వచ్చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఓ ప్రముఖ వెబ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో రీ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను షో నుండి బయటకు రావడానికి ప్రధాన కారణం శ్యాం ప్రసాద్ రెడ్డి కాదు. యాజమాన్యంలో కొంతమంది స్టాఫ్ ఆటిట్యూడ్ చూపించారు. దాన్ని భరించలేక నేను బయటికి వచ్చేసాను. ముఖ్యంగా స్కిట్స్ వేసే కుర్రాళ్లకు అన్యాయం జరగటంతో.. దాన్ని సహించలేక బయటకు వచ్చేయడం జరిగింది.
కానీ ఎప్పుడూ కూడా జబర్దస్త్ షోపై నెగటివ్ కామెంట్లు చేయలేదు. నేను షో నుండి బయటకు వచ్చాక కొంతమంది… మీ వెంటే ఉంటామని వచ్చేశారు. ఈ క్రమంలో కొంతమంది సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అయ్యారు మరి కొంతమంది వ్యాపార పరంగా రాణిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ‘నేను వాలంటరీగా బయటకు వచ్చాను. నా అంతట నేను వెళ్లి అడగను. వాళ్లు నన్ను రమ్మని అడిగితే.. వెళతాను. కానీ అది జరగని పని.. అని రీ ఎంట్రీ గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చారు.