NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 07 2023 Episode 100: అంజలి పరిస్థితిని చూసి బాధపడుతున్న అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

Nindu Noorella Saavasam December 07 2023 Episode 100:అంజలి నీకేమీ కాదు నాన్న నిన్ను నేను కాపాడుకుంటాను అని అమరేంద్ర అంటాడు. అంజలి అంటూ అరుంధతి కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. నీకేం కాదు అంజు అంతా నా వల్లే జరిగింది తప్పంతా నాదే అని బాధపడుతుంది భాగమతి. రాథోడ్ ఇంకా ఎంత దూరం ఉంది హాస్పిటల్ ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు అమరేంద్ర. వచ్చేస్తున్నాను సార్ ఇంకా 10 నిమిషాల్లో వెళ్తాము అని రాథోడ్ అంటాడు. అలా ముందు కారు వెళ్తుంది వెనకాల అరుంధతి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా ఘోర అక్కడ అరుంధతిని చూస్తాడు. ఆత్మ కనిపించింది దాని ఎలాగైనా బంధించి అతీత శక్తులను పొందాలి అని ఆ ఆత్మ వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు ఘోర. కట్ చేస్తే, అమ్మ మిమ్మల్ని బాగా చూసుకోమని నా దగ్గర మాట తీసుకుంది అమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అని అమృత ఏడుస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

దూరం నుంచి చూస్తున్న గుప్తా గారు మీ అమ్మ నీ పక్కనే ఉందమ్మా ఎక్కడికి వెళ్ళలేదు అని అంటాడు. అక్క అంజు బాగా చదివి ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని ఇలా చేసింది నువ్వు మాత్రం ఏం చేస్తావో చెప్పు అంజు అలా చదవకపోతే జ్వరం వచ్చేది కాదు ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు తనకి జ్వరం తగ్గిపోతుందిలే అక్క నువ్వు ఏమీ బాధపడకు అని ఆకాష్ అంటాడు. లేదురా తమ్ముడు నేనే సరిగా పట్టించుకోలేదు తను అల్లరి చేస్తుంది ఎందుకులే అని ఊరుకున్నాను కానీ నేనే కొంచెం జాగ్రత్త తీసుకొని చదివించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అమృత అంటుంది. ఆ పిల్ల పిచ్చుకకి ఏమీ కాదులే అమ్మ అని గుప్తా అంటాడు. లేదు అంకుల్ చెల్లికి అమ్మంటే చాలా ఇష్టం తను అమ్మ కోసం ఇలా చదివి ఫీవర్ తెచ్చుకుంది తనకి ఏమన్నా అయితే అమ్మ నన్ను క్షమించదు అని అమృత అంటుంది. మీ అమ్మ ఎక్కడికి వెళ్లలేదమ్మా మీ చుట్టూనే ఉంది మీ అమ్మ ఉన్నంతవరకు మీకు ఏ ఆపద రానివ్వదు అమ్మ అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

మా అమ్మ చనిపోయింది కదా అంకుల్ అని అమృత అంటుంది. మీ అమ్మ చనిపోయిన ఆత్మ రూపంలో మీ చుట్టూ మిమ్మల్ని చూస్తూనే ఉంటుందమ్మా మీ ఆలోచనలు బ్రతికే ఉంది మీ ప్రేమలో బ్రతికే ఉంది తను ఉన్నప్పుడు చేసిన జ్ఞాపకాలని మీరు మర్చిపోలేరు అని గుప్తా అంటాడు. కట్ చేస్తే కారు వెనకాల అరుంధతి పరిగెత్తుతుంది. అరుంధతి వెనకాల ఘోరా పరిగెత్తుతాడు. ఆత్మ ఆగు నిన్ను బంధించి తీరుతాను ఈరోజు ఎలాగైనా బంధించి తీరుతాను అని పరిగెత్తుతాడు ఘోర. ఘోరాన్ని చూసుకొని అరుంధతి అంజు అంజు అంటూ ఏడ్చుకుంటూ కారు వెనకాల పరిగెత్తుతుంది. రాథోడ్ త్వరగా ఫాస్ట్ గా కారు పోనీ అంజలి ఒళ్లంతా చల్లబడిపోయింది అని అమరేంద్ర బాధపడుతూ ఉంటాడు. స్పీడ్ గానే పోనిస్తున్నాను సార్ దగ్గరికి వచ్చాము సార్ అని రాథోడ్ అంటాడు. ఇంతలో హాస్పిటల్ వచ్చేస్తుంది. అమరేంద్ర కంగారుపడుతూ అంజలిని ఎత్తుకొని హాస్పిటల్ లోకి పరిగెత్తుతాడు. డాక్టర్ ఎక్కడ అని రిసెప్షన్ లో అడుగుతాడు. పాపకు ఏమైంది ఈ పేపర్ మీద రాసి ఇవ్వండి డాక్టర్ని పిలుస్తాను అని నర్స్ అంటుంది. అంత టైం లేదు అర్జెంటుగా డాక్టర్ని పిలవండి అని అమరేంద్ర కంగారు పడతాడు. సార్ హాస్పిటల్ రూల్స్ ఇలాగే ఉంటాయి ముందు పేరు నమోదు చేయాలి సార్ అని అమ్మాయి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

 

ఇంతలో డాక్టర్ గారు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. డాక్టర్ గారు అంజుకి మొన్నటి నుంచి జ్వరం వస్తుంది ఒళ్లంతా చల్లగా అయిపోయింది ఎంత పిలిచినా కళ్ళు తెరవట్లేదు చూడండి అని అంటాడు అమరేంద్ర. బాయ్స్ ఎమర్జెన్సీ వార్డులో పెట్టండి టెస్ట్ చేయాలి అని డాక్టర్ అంటుంది. కట్ చేస్తే, అరుంధతి కారు వెనకాల పరిగెత్తుకుంటూ హాస్పిటల్ లోకి వస్తుంది. అంజు ని హాస్పిటల్ లో ఎక్కడ ఉంది అని అంతా వెతుకుతుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి నా కూతురు ఇక్కడ జాయిన్ అయింది ఏ రూమ్ లో ఉంది అని అడుగుతుంది. వాళ్లకు ఏమీ వినపడదు కాబట్టి సమాధానం ఇవ్వరు. మళ్లీ అరుంధతి హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది అంజలి కోసం. మిస్సమ్మ అంజలికి అలా జరగడంతో ఏడుస్తూ ఉంటుంది. అమరేంద్ర బాధపడుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

అలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అరుంధతి వాళ్ళ దగ్గరికి వస్తుంది. మిస్సమ్మ ఎక్కడ చూస్తుందో నని టెన్షన్ పడుతూ చాట్ నుండి చూస్తుంది అంజలిని. ఇదే కరెక్ట్ సమయం అమరేంద్ర ఎమోషన్ ని మనం అవకాశం గా తీసుకొని మనకు అనుగుణంగా మార్చుకోవాలి అని మనోహరి అనుకుంటుంది. అమరేంద్ర దగ్గరికి వెళ్లి  చూడు అమర్ నువ్వే ఇలా బాధపడిపోతే ఇక మేమంతా ఏమైపోవాలి అంజలికి ఏమీ కాదులే అమర్ నువ్వు అంత బాధ పడకు నేను చూసుకుంటాను కదా అని అంటుంది మనోహరి. తను లేకుండా పిల్లల్ని కొన్ని రోజులు చూసుకోలేకపోయాను అంజలికి ఇలా జరిగింది అంటే తను నన్ను ఎప్పటికీ క్షమించదు తను ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత బాగా చూసుకునేది నేను చూసుకోలేకపోయాను అని అమరేంద్ర ఫీలవుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 07 2023 Episode 100 Highlights

అయ్యో నీను ఏమి మిమ్మల్ని అనను లేండి నేనే చెప్తున్నాను కదా మీకంటే బాగా ఎవరూ చూసుకోలేరు పిల్లని మీరు అలా బాధపడకండి నేను తట్టుకోలేక పోతున్నాను అని అరుంధతి చాటుగా చూస్తూ అనుకుంటుంది. అమర్ అంజలి కి ఏమీ కాదులే డాక్టర్లు చూస్తున్నారు కదా అని మనుహరి అంటుంది. కట్ చేస్తే, ఘోర హాస్పిటల్ దగ్గరికి వచ్చి లోపలికి వద్దామని చూస్తాడు. ఓయ్ ఎవరయ్యా నువ్వు నీలాంటి వాళ్ళకి హాస్పిటల్ లోకి పర్మిషన్ లేదు నీకు సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ఉండరు వెళ్ళు అని వాచ్మెన్ అంటాడు. నాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని ఘోర గట్టిగా అరుస్తాడు. ఏంటయ్యా మాట్లాడుతుంటే గట్టిగా బెదిరిస్తున్నావ్ ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళు ఉండరని చెప్పాను కదా ముందు బయటికి నడు అని వాచ్మెన్ అంటాడు. నేను ఈరోజు ఎలాగైనా ఆత్మని బంధించాలి ఈ ముల్లోకములను నా ఆధీనంలో ఉంచుకోవాలి ఆత్మను నా వశం చేసుకొని అతీతమైన శక్తుల్ని పొందాలి అని అరుస్తాడు ఘోర. చెప్తుంటే నీకు వినిపించట్లేదా ముందు నడు అని వాచ్మెన్ అతన్ని లాగి నెట్టేస్తాడు. ఈరోజు ఎలాగైనా ఆత్మని బంధించాలి అని ఘోరా అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri