NewsOrbit
Cinema Entertainment News OTT Telugu Cinema సినిమా

Devara: విడుదల కాకముందే ఎన్టీఆర్ “దేవర” ఓటిటి ఫిక్స్..!!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా “దేవర”. “RRR” తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే సినిమా రిలీజ్ అవ్వకముందే “దేవర” ఓటిటి ఫిక్స్ కావడం జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు.. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

NTR New Movie Devara is coming soon on Netflix Ott

“దేవర” త్వరలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో పోస్ట్ థియాట్రికల్ విడుదల కాబోతోంది అని నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని “దేవర” కూడా కన్ఫామ్ చేసింది. “దేవర” రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ రాబట్టింది. సముద్ర నేపథ్యంలో సాగే కథగా సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్ వీడియో తెలియజేయడం జరిగింది.

NTR New Movie Devara is coming soon on Netflix Ott

గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. 2016లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ఇప్పుడు “జనతా గ్యారేజ్” కంటే మరింత పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ నీ కొరటాల చూపించబోతున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమ్మర్ కానుకగా పాన్ ఇండియా నేపథ్యంలో “దేవర” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతుంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri