OTT Platform: ప్రస్తుత కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫారంటు కూడా తమ వెబ్సైట్ వైపుకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు కొత్త కొత్త కాన్సెప్ట్లతో రెడీ అవుతున్నారు. అదేవిధంగా నిర్మాతలు సైతం అనేక కాన్సెప్ట్లు అందిస్తూ మరింత డబ్బును సంపాదిస్తున్నారు. ఇదివరకు సినిమాలకు కలెక్షన్లను పెంచుకోవడానికి విడుదలైన రెండు మూడు వారాల తర్వాత కొత్త సాంగ్ యాడ్ చేస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నారు నిర్మాతలు. లేదంటే సీన్స్ కలపడం వంటివి కూడా చేస్తున్నారు.
ఇక తాజాగా కూడా ఇటువంటి జలక్కులే మొదలుపెట్టారు నిర్మాతలు. ఓటిటిని తక్కువగా అంచనా వేసే వారికి గట్టి గుణపాఠమే చెప్పారు. ఓటిటి అనేది వందలకోట్ల ఆదాయం. అదేవిధంగా నిర్మాతలకు అదనపు ఆదాయం కూడా. మరి అన్ని కోట్లు ఇస్తున్నప్పుడు సేమ్ సినిమా ఎందుకు ఇవ్వాలి? ఇదే ఆలోచించి సరికొత్త ఆలోచన తీసుకున్నారు మేకర్స్. థియేటర్లో చూసినోళ్లు కూడా ఓటీటీలో చూసేందుకు కొన్ని సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు.
వెండి తెరపై చూడని సన్నివేశాలను బుల్లితెరపై చూపిస్తే ఏ విధంగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలుకు 50 నుంచి 200 కోట్ల మధ్యలో ఓటిటి రైట్స్ పలుకుతున్నాయి. అందుకే థియేటర్లో చూసిన సినిమా కాకుండా.. ఓటిటి కోసం కొత్త వర్షన్ ఇవ్వనున్నారు. షారుక్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు ఇదే చేశారు అట్లీ. థియేటర్లో లేని సీన్స్ ను ఓటిటిలో యాడ్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్సైట్మెంట్ కలిగించాడు. దీనివల్ల ఒక్కసారి సినిమా చూసిన వారు కూడా మరోసారి ఓటిటిని సంప్రదిస్తున్నారు.
ఇక ఈ పని ఒక్క అట్లినే కాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ మరియు లోకేష్ కనగరాజ్ వంటి వారు కూడా చేస్తున్నారు. ఇటువంటి ఓ కొత్త కాన్సెప్ట్ అనేది రూపొందడం విశేషం అని చెప్పుకోవచ్చు. థియేటర్లో చూడని సన్నివేశాలను ఓటిటి ఫ్లాట్ ఫారమ్స్ లో అందిస్తూ తమ ఫ్యాన్స్ కి మరింత కిక్కెక్కిస్తున్నారు. ఇక ప్రేక్షకులు సైతం ఒక్కసారి థియేటర్లో సినిమా చూశాం కదా మళ్లీ ఆ సినిమానే ఎందుకు చూడడం అనుకోకుండా కొత్త డైలాగ్స్ మరియు కొత్త సన్నివేశాలు ఉంటున్నాయని ఓటీటీని కూడా సంప్రదించడానికి ఇష్టపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ కాన్సెప్ట్ ఏ విధంగా వెళ్తుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!