Sandeep Kishan Web Series: ఒకపక్క బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం సినిమాలపై ఫోకస్ పెడుతూనే మరో పక్క వెబ్ సిరీస్ లో కూడా రాణిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి మళ్ళింది. మన టాలీవుడ్ హీరోలు వెంకటేష్, రానా, నాగచైతన్య వంటి హీరోలు సైతం ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ జాబితాలో మరో హీరో చార బోతున్నాడు. ఆ హీరోనే సందీప్ కిషన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్ ఇటీవలే ఊరి పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు లో సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ మూవీకు టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంసంతో ఈ సిరీస్ తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాను నిర్మిస్తున్న రాజీవ్ చిలుక.. సందీప్ కిషన్, మల్లిక్ రామ్ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. వెబ్ సిరీస్ చేయడం సందీప్ కిషన్‌కు ఇదే మొదటిసారి. రాజ్ డీకే దర్శకత్వం రూపొందిన ది ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సీజన్లో సందీప్ కిషన్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.
ఇండియాలోనే మోస్ట్ పాపులర్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ లో ఆర్మీ మేజర్ విక్రమ్ అనే పాత్రలో కనిపించాడు. ఈ ఫ్యామిలీ మెన్ అనంతరం సినిమాలపై దృష్టి పెట్టిన సందీప్ కిషన్ సిరీస్‌లో కనిపించలేదు. సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్ భాషల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు సందీప్ కిషన్. ఇటీవలే ఊరి పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ సైతం రాబట్టింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా శనివారం రోజు వైబ్ పేరుతో కొత్త సినిమాను సందీప్ కిషన్ అనౌన్స్ చేశాడు.
కాలేజీ స్టూడెంట్స్ జీవితాల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న వైబ్ మూవీకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్ జే స్వరూప్ దర్శకత్వం వహించాడు. 2025 వేసవిలో వైబ్ మూవీ రిలీజ్ కానుంది. ఇక తమిళంలో మయావన్ 2 తో పాటు ధనుష్‌తో రాయన్ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. ఇక మల్లిక్ మరియు సందీప్ కిషన్ సిరీస్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక ఈ సిరీస్ కనుక సూపర్ హిట్ టాక్ అందుకుంటే రానున్న రోజుల్లో సందీప్ కిషన్ వరుస పెట్టి వెబ్ సిరీస్‌లు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోయినా వెబ్ సిరీస్ తో కొందరు సక్సెస్ అవుతున్నారు. అలాంటి నేపథ్యంలో సందీప్ కిషన్ కూడా సిరీస్‌లో సక్సెస్ అయితే తప్పనిసరిగా ఎక్కువ సిరీస్ నే చేసుకుంటూ పోతాడు.