Jayasudha: జయసుధ.. ఈ పేరు తెలుగు పరిశ్రమకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గతంలో అనేక సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న జయసుధ తల్లి మరియు అత్త పాత్రలో పోషిస్తూ మైమరిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. జయసుధ తల్లి ఓ హీరోయిన్ అని మీకు తెలుసా. జయసుధ కూతన తల్లి ఒక గ్రూప్ డాన్సర్ అని చెప్పుకోవడం నామోషీనా? అవమానంగా భావిస్తారా? ఈమె తండ్రి కి కూడా హీరోయిన్ అవడం అంటే అస్సలు ఇష్టం ఉండదా? తన చెల్లి హీరోయిన్ కాకపోవడానికి కూడా ఇదే కారణమా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. జయసుధ అసలు పేరు సుజాత. ఈమె తల్లి నిడదవోలులో జోగాబాయ్. జయసుధ తాతయ్య నిడదవోలు వెంకట్రావు పెద్ద రచయిత. ఇక వీరి తాత ముత్తాతల నుంచి చెన్నైకి వలస వచ్చింది. అలా జయసుధ ఉండేది తమిళనాడులో అయినప్పటికీ తెలుగింటి అమ్మాయిగా మారింది.
జయసుధ తండ్రి మరియు విజయనిర్మల తండ్రి సోదరులు. దీంతో జయసుధకు ,విజయ్ నిర్మలాకు రిలేషన్ ఉంది.
50, 60 లలో ఇండస్ట్రీ మంచి ఊపు మీద ఉన్న సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనేకమంది అనుకున్నారు. ఆ సమయంలో విజయ లలిత, విజయ్ నిర్మల వంటి వారు క్లిక్ అయ్యారు. జయసుధ తల్లి జోగాబాయ్, శ్రీదేవి తల్లి రాజేశ్వర్ అలాంటివారు అదృష్టం కలిసి రాక సైడ్ అయ్యారు. వాళ్లు సైడ్ అయినా వాళ్లకి సినిమాలపై తీరని కోరిక అలానే ఉండిపోయింది. అందుకే తమ పిల్లలను ఇండస్ట్రీ లోకి పంపించారు. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వారే జయసుధ మరియు శ్రీదేవి. ప్రేమాభిషేకర్ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది జయసుధ.
రొమాంటిక్ పాత్రలు అంటే శ్రీదేవి సాంప్రదాయ పాత్రలు అంటే జయసుధ అన్నట్లు వీరి పేర్లు మారుమోగాయి. అలా జయసుధ సహజ నటిగా స్థిరపడింది. ఇక అనంతరం జయసుధకు నిర్మాత వడ్డే రమేష్ బంధువులతో పెళ్లి కాగా.. అది పెటాకులు అయింది. ఆ తరువాత నితిన్ కపూర్ అనే జితేంద్ర బావమరిది తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. నితిన్ కపూర్ కి దర్శకుడు కావాలనే ఆశ ఉండేది. అందువల్లే ఒక కొడుకును డైరెక్షన్లో పెట్టి మరొక కొడుకును కోచ్గా వ్యవహరించమన్నట్లు తెలుస్తుంది. జయసుధ ఈ స్థాయికి చేరడానికి తన తల్లిలోని సినిమాల పిచ్చి.. అందువల్లే తాను సినిమాల్లోకి రాగలిగానని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పుకోలేదు జయసుధ. విజయనిర్మల పరిచయంతో తాను సినిమాల్లోకి వచ్చానని మాత్రమే చెప్పుకునేది.
తల్లి జోగా బాయ్ పేరు చెప్పుకోవడం అంటే జయసుధకు చిన్న చూపు అనే చెప్పొచ్చు. దానికి తోడు తండ్రికి కూడా సినిమాలు అంటే పిచ్చి కోపం. ఒకసారి జయసుధ తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఎయిర్పోర్టులో ఒక పెద్ద తగువే పెట్టుకున్నాడట. ఇక జయసుధ చెల్లికి కూడా సినిమాల్లో చేయాలనేది కోరిక. కానీ ఆమెని హీరోయిన్ గా కాకుండా అడ్డుకున్నది తన తండ్రే. జయసుధ తల్లి 1954లో కే రాఘవేంద్రరావు తండ్రి కె ఎస్ ప్రకాష్ రాజ్ తీసిన బాల రాముడు అనే మూవీలో ముఖ్యపాత్రలో నటించింది. అక్కినేని సినిమా ” కాళహస్తి ” వంటి సినిమాలో కూడా నటించింది. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ వంటి ప్రముఖుల సినిమాలలో నటించి మెప్పించింది జోగాబాయ్.