Tollywood Actors: ఒకటి రెండు తరాలు వెనక్కి వెళితే సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా కనిపించేది. హీరోలు తమ వయసులో సగం వయసు కూడా లేని హీరోయిన్లతో జతకట్టేవారు. ఇప్పటికీ సీనియర్ హీరోలు ఇదే ఫాలో అవుతున్నారు. హీరోయిన్ల కొరత కారణంగా కుర్ర భామలతో కలిసి నటిస్తున్నారు. అయితే సినిమాలో హీరో కంటే హీరోయిన్ వయసు ఎక్కువగా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే వయసులో తమకంటే పెద్ద హీరోయిన్లతో నటించిన టాలీవుడ్ హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి, సాంబ చిత్రాల్లో భూమికతో కలిసి నటించాడు. బహుశా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వయసులో ఎన్టీఆర్ కంటే భూమిక ఐదేళ్లు పెద్దది. అలాగే నరసింహుడులో అమీషా పటేల్, ఎన్టీఆర్ జంటగా నటించారు. ఈ సినిమాలో కూడా అమీషా పటేల్ వయసే ఎక్కువ. ఆమె కంటే ఎన్టీఆర్ 8 ఏళ్లు చిన్నవాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన డెబ్యూ మూవీ రాజకుమారుడు. ఈ చిత్రంలో తనకంటే ఏడాది పెద్దది అయిన ప్రీతి జింటాతో మహేష్ జతకట్టాడు. అలాగే వంశీ మూవీలో నమ్రత, మురారీ చిత్రంలో సోనాలి బింద్రే కూడా మహేష్ బాబు కంటే వయసులో పెద్దవాళ్లు.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మహానటి మరియు ఖుషి చిత్రాల్లో సమంతతో జోడి కట్టాడు. అయితే విజయ్ కు 34 ఏళ్లు కాగా.. సమంతకు 36. వీరిద్దరి మధ్య రెండేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అఖిల్ అక్కినేని తనకంటే నాలుగేళ్లు పెద్ద అయిన పూజా హెగ్డేతో రొమాన్స్ చేశాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా కవచం, సీత చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య కూడా భారీ ఏజ్ గ్యాప్ ఉంది. బెల్లంకొండ వయసు 31 కాగా.. కాజల్ కు ఏకంగా 37 ఏళ్లు. గత ఏడాది విడుదలైన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అనుష్క శెట్టి తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన నవీన్ పోలిశెట్టితో కలిసి నటించింది. అయినప్పటికీ ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
అలాగే 31 ఏళ్ల రాజ్ తరుణ్ 35 ఏళ్ల హెబ్బా పటేల్ తో కలిసి కుమారి 21ఎఫ్, ఒరేయ్ బుజ్జిగా, అంధగాడు, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాలు చేశారు. ఒక దడ మూవీలో నాగచైతన్య వయసులో తమకంటే పెద్ద అయిన కాజల్ అగర్వాల్ తో జోడి కట్టాడు.