NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Saindhav Review: విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం “సైంధవ్” మూవీ రివ్యూ..!!

Saindhav Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ ఒక పర్టికులర్ ఇమేజ్ కలిగిన హీరో. ఏకకాలంలో ఫ్యామిలీ మరియు మాస్ ప్రేక్షకులను మెప్పించిన హీరో. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే వెంకటేష్ నటించిన ఎలాంటి సినిమాకైనా ఫ్యామిలీ ఆడియన్స్ ధియేటర్ లకి వస్తుంటారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులలో వెంకీకి స్పెషల్ ఇమేజ్ ఉంది. అలాంటి వెంకటేష్ కెరియర్ లో “సైంధవ్” 75వ సినిమాగా రావటం జరిగింది. నేడు ఈ సినిమా విడుదల కావడం జరిగింది.

సినిమా పేరు: సైంధవ్
నటినటులు: వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాష్, బేబీ సారా, జిష్షూ సేన్ గుప్తా, ముఖేష్ రిషి
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రాఫర్: ఎస్. మణికందన్
ప్రొడక్షన్ డిజైనర్:
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ: జనవరి 13, 2024

పరిచయం:

“సైంధవ్” వెంకటేష్ నటించిన అన్ని సినిమాల్లో కంటే కొత్తదనం కలిగిన కంటెంట్. ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తిభిన్నంగా తన ఇమేజ్ నీ దాటి ఈ సినిమాలో వెంకటేష్ నటించినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం.

Victory Venkatesh carrier seventy fifth Saindhav Movie Review

స్టోరీ:

“చంద్రప్రస్థ” అనే ఫిక్షనల్ సిటీలో ఈ సినిమా జరుగుతుంది. సైంధవ్(వెంకటేష్) అలియాస్ సైకో క్రైన్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక కూతురు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో ఒంటరిగా కూతురితో కలిసి ఉంటున్న సైంధవ్ జీవితంలోకి అతని పక్కింటి అమ్మాయి మనోగ్యా(శ్రద్ధ శ్రీనాథ్) రావటం జరుగుద్ది. సైంధవ్ కూతురు గాయత్రి ఆలనా పాలన చూసుకుంటూ క్యాబ్ డ్రైవర్ గా మనోగ్యా.. వ్యవహరిస్తుంటది. మనోగ్యాకి ఆల్రెడీ పెళ్లయి భర్తతో విభేదాలు వచ్చి అతని మీద కేసు పెట్టి ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత సైంధవ్ తో మనోగ్యా సహజీవనం చేస్తూ అలా గడిపేస్తుంటుంది. ఈ రకంగా ముగ్గురు హ్యాపీగా ఉంటున్న సమయంలో మరోవైపు సైంధవ్ పనిచేసే హార్బర్ లో 6000 కోట్ల రూపాయల కంటైనర్ కలిగిన డ్రగ్స్.. నేవీ ఆఫీసర్లు పట్టుకుంటారు. ఈ డ్రగ్స్ టీనేజ్ పిల్లలకు యువకులకు.. అలవాటు చేసి వారిని విదేశాలకు యుద్దాలలో దింపడానికి ఓ ముఠా ప్రయత్నాలు చేస్తూ ఉంటది. పరిస్థితి ఇలా ఉండగా సైంధవ్ కూతురు గాయత్రి.. స్పైనల్ మజిలర్ అడ్రోఫియా అనే అరుదైన వ్యాధి బారిన పడతది. ఈ వ్యాధికి సంబంధించి ఒకే ఒక చికిత్స ఏమిటంటే 17 కోట్ల రూపాయలు విలువచేసే.. ఇంజక్షన్ చేయాలి. సైంధవ్ ఒక సాధారణ జీవితం గడిపే వ్యక్తి. దీంతో అన్ని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కూతురికి చికిత్స చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో సైంధవ్ ఏ రకంగా కూతురు ప్రాణాన్ని కాపాడాడు..? డ్రగ్స్ ముఠాతో సైంధవ్ కి ఉన్న సంబంధం ఏమిటి..? సైంధవ్ గతం ఏమిటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Victory Venkatesh carrier seventy fifth Saindhav Movie Review

విశ్లేషణ:

కథగా చూసుకుంటే కూతురి ప్రాణాలు కాపాడటానికి ఇంజక్షన్ చేయించాలని తపనపడే తండ్రి. కూతురు పుట్టకముందు గ్యాంగ్ స్టార్ గా పనిచేసిన నరహంతకుడు. అత్యంత ఘోరమైన స్వభావం కలిగిన గ్యాంగ్ స్టార్ లతో సైంధవ్ పనిచేసేవాడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన సైంధవ్… కూతురికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ చేయించే ప్రక్రియలో ఎమోషనల్ గా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. ఎంత సంక్లిష్టం అనుభవించాడు అనేది కథ. కానీ సినిమా తీసిన విధానం మాత్రం వెంకటేష్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా దూరంగా ఉంది. ఎందుకంటే ఒక పాప ప్రాణం కోసం తపన పడే తండ్రి ఒకప్పుడు నరహంతకుడు అనేది.. ప్రేక్షకుడు తీసుకోవడానికి.. చాలా కష్టమైన పాయింట్ గా చూపించడం జరిగింది. ఈ పాయింట్ ఆసక్తికరంగా మలచటంలో డైరెక్టర్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కూతురు పరంగా వెంకటేష్ పడే తపన నటనలో కనబడిన కానీ కథలో అంత డెప్త్ ఉండదు. దీంతో సినిమాలో కాస్త ఓవర్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తాయి. కథకి నటించే నటుడికి మధ్య ఎమోషనల్ కనెక్షన్ సరైన మోతాదులో వెండితెరపై లేదు. ఈ ప్రధానమైన లోపం “సైంధవ్” లో కనిపిస్తుంది. ఒకవైపు భర్త పై కేసు పెట్టిన అమ్మాయితో హీరో సహజీవనం చేయటం అనేది అనైతికం. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ ఇమేజ్ కలిగిన హీరోని.. అటువంటి సన్నివేశాలు సినిమాలో పెట్టడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. కథపరంగా లోపం ఉన్న గాని నటన పరంగా వెంకటేష్ గురించి చెప్పక్కర్లేదు. యాక్షన్స్ సన్నివేశాలలో చెలరేగిపోవటం మాత్రమే కాదు ఎమోషనల్ గా తనకు తగ్గ న్యాయం చేయడం జరిగింది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసిన నవాజుద్దీన్..సిద్దిఖీ తనదైన శైలిలో నటించాడు. ఆర్య, రుహనీ శర్మ, ఆండ్రియా జెర్మియా తమ పాత్రలకు ఉన్నంతలో మెప్పించారు. బేబీ సారా, జిష్హూ సేన్ గుప్తా, ముఖేష్ రిషి, జయప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu