NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kommineni Srinivasa Rao: ఏపీ మీడియా అకాడమి చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా .. రీజన్ ఏమిటంటే.. ?

kommineni Srinivasa Rao:  సీఆర్ ఏపీ మీడియా అకాడమి ( సీ రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ) చైర్మన్ పదవికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో మీడియా అకడమీ చైర్మన్ గా నియమించి.. పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు గానూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

kommineni Srinivasa Rao

సీనియర్ పాత్రికేయుడైన కొమ్మినేని శ్రీనివాసరావు 2022 నవంబర్ 10 తేదీన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలంలో వర్కింగ్ జర్నలిస్ట్ ల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తిని అందించిందని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ఉండటంతో 17వ తేదీ నుండి తన రాజీనామా అమలులోకి వస్తుందని తెలిపారు.

తన పదవీ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తన పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా కొమ్మినేని కృతజ్ఞతలు తెలిపారు.

తమ పదవీ కాలం ముగియకముందే పదవికి రాజీనామా చేసిన సీనియర్ పాత్రికేయుల్లో కొమ్మినేని శ్రీనివాసరావు రెండో వారు. ఇంతకు ముందు సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి కూడా ప్రభుత్వ సలహదారు పదవికి రాజీనామా చేశారు. జగన్  సర్కార్ నియమించిన కొద్ది నెలలకే ఆయన రాజీనామా చేశారు. తాజాగా సీనియర్ పాత్రికేయుడైన కొమ్మినేని కూడా పూర్తి కాలం పదవిలో ఉండకుండా రాజీనామా చేశారు. ఈ ఇద్దరూ కూడా వ్యక్తిగత కారణాలతోనే పదవులను వీడారు.

Revanth Reddy – Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు సీఎం రేవంత్ రెడ్డి

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N